దేవరకొండకు పెరుగుతున్న మద్దతు.. చిరు మొదలు పలువురు సెలబ్రిటీల ట్వీట్లు..!

ఫేక్‌న్యూస్‌పై టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్‌ దేవరకొండ యుద్ధం ప్రకటించిన విషయం తెలిసిందే. కిల్ ఫేక్‌ న్యూస్, స్ప్రెడ్‌ పాజిటివిటీ పేరిట విజయ్‌ చేసిన

దేవరకొండకు పెరుగుతున్న మద్దతు.. చిరు మొదలు పలువురు సెలబ్రిటీల ట్వీట్లు..!

Edited By:

Updated on: May 05, 2020 | 12:35 PM

ఫేక్‌న్యూస్‌పై టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్‌ దేవరకొండ యుద్ధం ప్రకటించిన విషయం తెలిసిందే. కిల్ ఫేక్‌ న్యూస్, స్ప్రెడ్‌ పాజిటివిటీ పేరిట విజయ్‌ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఇక ఈ విషయంలో మెగాస్టార్ చిరంజీవి మొదలు సెలబ్రిటీలందరూ విజయ్‌కు మద్దతును ఇస్తున్నారు. నీకు సపోర్ట్ ఇస్తున్నాం అంటూ అందరూ కామెంట్లు పెడుతున్నారు. ఫేక్‌ న్యూస్‌ వలన ఎంతోమంది సెలబ్రిటీలు మానసికంగా బాధపడుతున్నారని వారు కామెంట్లు పెడుతున్నారు. వారిలో మహేష్ బాబు, కొరటాల శివ, కాజల్ అగర్వాల్, రానా దగ్గుబాటి, మైత్రీ మూవీ మేకర్స్, రాశి ఖన్నా తదితరులు ఉన్నారు. టాలీవుడ్‌లోనే కాదు మిగిలిన ఇండస్ట్రీల్లోనూ విజయ్‌కు మద్దతు లభిస్తుండటం విశేషం.

Read This Story Also: కరోనా ప్రపంచం అప్‌డేట్స్‌.. 36 లక్షలకు చేరువైన పాజిటివ్ కేసులు..!