Movie Costumes : షూటింగ్ కోసం లక్షలు ఖర్చుపెట్టి దుస్తులు తెస్తారు.. నటీ నటులు వాడిన తర్వాత వాటిని ఏం చేస్తారో తెలుసా..?
Movie Costumes : ప్రతి సినిమా కోసం మేకర్స్ నటీ, నటుల పాత్రలను ఉద్ధేశించి భారీగా దుస్తులను కొనుగోలు చేస్తారు. వీటికోసం లక్షల రూపాయలను
Movie Costumes : ప్రతి సినిమా కోసం మేకర్స్ నటీ, నటుల పాత్రలను ఉద్ధేశించి భారీగా దుస్తులను కొనుగోలు చేస్తారు. వీటికోసం లక్షల రూపాయలను ఖర్చు చేస్తారు. కానీ సినిమా షూటింగ్ ముగిసిన తర్వాత వీటిని ఏం చేస్తారు. ఎక్కడికి తీసుకెళ్తారు.. ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. చిత్ర నిర్మాణంలో కాస్ట్యూమ్ డిజైన్‌పై ప్రత్యేక దృష్టి ఉంటుంది. బాహుబలి లాంటి హిస్టారికల్ సినిమాలకు ప్రత్యేకించి దుస్తులను క్రియేట్ చేస్తారు. ఆ దుస్తులతోనే సినిమాకు హైప్ పెరుగుతుంది. ప్రేక్షకులు కూడా ఆ గెటప్‌లోనే క్యారెక్టర్‌ను ఊహించుకుంటారు కనుక పాత్ర బాగా ఎలివేట్ అవుతుంది.
ప్రతి చిత్రంలో హీరో, హీరోయిన్, ఇతర తారాగణం భిన్నంగా కనిపించేలా వివిధ దుస్తులను వాడుతారు. వాటికోసం చాలా డబ్బులు ఖర్చు చేస్తారని అందరికి తెలుసు. బాహుబలి, దేవాదాస్, జోథా అక్భర్ లాంటి సినిమాలకు కాస్ట్యూమ్స్ కోసం ప్రత్యేక బడ్జెట్ కూడా కేటాయిస్తారు. అయితే అభిమానులు మాత్రం నటీ నటులు వాడిన దుస్తులను ఏం చేస్తారో తెలుసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు.కళాకారుల కోసం చాలా డబ్బు ఖర్చు చేసి దుస్తులను తయారు చేస్తారు. సినిమా షూటింగ్ తర్వాత ఆ దుస్తులను రీ సైక్లింగ్ చేస్తారు. అంతేకాకుండా అదే నిర్మాత ఇతర సినిమాలలో ఇతర పాత్రలకు కేటాయిస్తారు. అయితే అందరు అవే దుస్తులను వాడరు. వాటికి కొన్ని మెరుగులు అద్ధి పాత్ర ప్రాధాన్యతా రీత్యా ఉపయోగిస్తారు. అయితే ఆ దుస్తులను ప్రేక్షకులు గుర్తుపట్టలేరు.
ఇక కొంతమంది నటీ నటులు షూటింగ్ పూర్తయిన తర్వాత ఆ దుస్తులను తమతో పాటు ఇంటికి తీసుకెళ్తారు. ఇది ఆశ్చర్యం కలిగించినప్పటికి నిజం. వాటికి దుస్తుల కొరత లేదు కానీ వారు నటించిన ఆ పాత్రను గుర్తు చేసుకోవడం కోసం వాటిని తీసుకెళ్తారు. దీపికా పదుకొనె, రిషి కపూర్ లాంటి వాళ్లు అలాగే చేస్తారు. ఇక కొంతమంది స్టార్స్ వారు నటించిన కొన్ని పాత్రల దుస్తులను వేలం వేసి వచ్చిన ఆదాయాన్ని స్వచ్ఛంద సంస్థలకు అందిస్తారు. అత్యధిక వేలం పాడిన వారికి ఆ దుస్తులు లభిస్తాయి. అయితే ముఖ్యమైన పాత్రలకు సంబంధించిన దుస్తులను మాత్రమే వేలం వేస్తారు.