కొణిదెల శివశంకర వరప్రసాద్ అలియాస్ మెగాస్టార్ చిరంజీవి.. అనతికాలంలోనే టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినీ కెరీర్‌లో తొలుత కాస్త.. ఇబ్బందులు ఎదుర్కొన్నా.. అనంతరం.. ‘ఖైదీ’ సినిమాతో వెనక్కి తిరిగి చూసుకోలేదు. ‘మెగాస్టార్ చిరంజీవి’గా ప్రేక్షకుల గుండెల్లో అంతులేని అభిమానాన్ని సంపాదించుకున్నారు. 1980లలో చిరంజీవి ఒక ప్రభంజనం. బాలీవుడ్‌లో బిగ్‌బీ ఎలానో.. టాలీవుడ్‌లో చిరంజీవి అలా. దివంగత మాజీ సీఎం, ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు తరువాత.. ఆ స్థాయిలో అభిమానించతగ్గ గొప్ప నటుడిగా.. తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆయన నటావిశ్వరూపానికి 2006 జనవరిలో భారత ప్రభుత్వం తరుపున అప్పటి రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలామ్.. చిరంజీవికి ‘పద్మభూషణ్’ పురస్కారాన్ని, నవంబర్ 2006లో డాక్టరేట్‌ని ఇచ్చి గౌరవించారు.
నిజానికి చిరంజీవి మొదటి సినిమా.. 1978లో చేసిన ‘పునాది రాళ్లు’ చిత్రం. కానీ.. దాని కంటే ముందుగా.. ఆ తరువాత చేసిన ‘ప్రాణం ఖరీదు’ సినిమా విడుదల అయ్యింది. మొదటి సినిమాకి రూ.1,116 రూపాయల పారితోషికంతో.. ప్రారంభమైన చిరూ సినీ ఆరంభం.. కోటి రూపాలయ దాకా వెళ్లింది. సైడ్ ఆర్టిస్ట్‌గా, కమేడియన్‌గా, విలన్‌గా, హీరోగా.. పలు రకాల పాత్రలను చిరు పోషించారు. 1991లో రిలీజైన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాతో.. మంచి మాస్ ఇజాన్ని సంపాదించారు చిరు. ఈ రోజుల్లో.. సినిమా ఒక వారం కంటిన్యూగా ఆడితేనే.. సూపర్ హిట్ అంటున్నారు. అప్పట్లో.. చిరంజీవి సినిమాలు ఒక సంవత్సరంలో.. 365 డేస్ కంటిన్యూగా థియేటర్స్‌లలో ఆడేవి.
కాగా.. చిరు గురించి మరో ఆసక్తికరమైన విషయం.. డ్యాన్స్. డ్యాన్స్‌లో.. ఆయనకి పోటీ లేరనే చెప్పవచ్చు. మొదటిగా టాలీవుడ్‌లో బ్రేక్ డ్యాన్స్‌ని ప్రేక్షకులకు పరిచయం చేసింది ఆయనే. ఎలాంటి కఠినతరమైన స్టేప్స్ అయినా.. అవలీలగా చేసి చూపిస్తారు. అలాగే.. మాస్, క్లాస్, కామెడీ ఇలా అన్ని రకాల సినిమాలు చేశారు చిరంజీవి. రుద్రవీణ, ఆపద్భాందవుడు, స్వయం కృష్టి లాంటి క్లాస్ హిట్స్‌లలో కూడా ఓ రేంజ్‌లో నటించి మెప్పించారు. అంతేకాకుండా.. శివుడి పాత్రలు.. చిరంజీవికి పెట్టింది పేరు అంటారు. స్వయానా శివుడే.. భూలోకానికి వచ్చారా అన్నట్టుగా.. ఆయన అభినయం ఉండేది. ఇకపోతే.. ఆయన సినీ కెరీర్‌లో ఎన్ని హిట్స్.. ఎన్ని ఫ్లాప్స్ సినిమాలు ఉన్నాయో తెలుసుకుందామా..!
చిరంజీవి హిట్ సినిమాల లిస్ట్:
1982 – శుభలేఖ, 1983 – అభిలాష, 1983 – ఖైదీ, 1984 – ఛాలెంజ్, 1985 – విజేత, 1986 – చంటబ్బాయి, 1987 – దొంగ మొగుడు, 1987 – పసివాడి ప్రాణం, 1987 – స్వయం కృషి, 1988 – రుద్ర వీణ, 1988 – యముడికి మొగుడు, 1989 – అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, 1990 – కొండవీటి దొంగ, 1990 – జగదేవ వీరుడు అతిలోక సుందరి, 1991 – రౌడి అల్లుడు, 1991-గ్యాంగ్ లీడర్, 1992-ఘరానా మొగుడు, 1992-ఆపద్బాంధవుడు, 1993-ముఠామేస్త్రి, 1997-హిట్లర్, 1998-చూడాలని వుంది, 1999-స్నేహం కోసం, 2000-అన్నయ్య, 2001-డాడీ, 2001-మృగరాజు, 2002-ఇంద్ర, 2003-ఠాగూర్, 2017-ఖైది నెంబర్ 150
చిరంజీవి ఫ్లాప్ సినిమాల లిస్ట్:
1979 – పునాది రాళ్లు
1980 – పున్నమి నాగు
2004 – అంజి
2006 – స్టాలిన్
2005 – అందరివాడు
2005 – జై చిరంజీవా
2007 – శంకర్ దాదా జిందాబాద్