Tollywood: సినీ లవర్స్‌ సిద్ధంగా ఉండండి.. ఏప్రిల్‌లో సినిమాల జాతరే. ఏ మూవీ ఏ రోజు రానుందంటే.

|

Apr 02, 2023 | 9:37 PM

తెలుగు సినీ లవర్స్‌కి పండగలాంటి వార్త. ఏప్రిల్‌ నెలలో సినిమా జాతర రానుంది. అసలే ఎండకాలం వచ్చేసింది. ఇప్పటికే ఇంటర్‌ పరీక్షలు ముగిశాయి. మరికొన్ని రోజుల్లో ఇతర విద్యా సంస్థలన్నింటికీ సమ్మర్ హాలీడేస్‌ మొదలు కానున్నాయి. ఇంకేముంది సినిమాలు..

Tollywood: సినీ లవర్స్‌ సిద్ధంగా ఉండండి.. ఏప్రిల్‌లో సినిమాల జాతరే. ఏ మూవీ ఏ రోజు రానుందంటే.
Tollywood
Follow us on

తెలుగు సినీ లవర్స్‌కి పండగలాంటి వార్త. ఏప్రిల్‌ నెలలో సినిమా జాతర రానుంది. అసలే ఎండకాలం వచ్చేసింది. ఇప్పటికే ఇంటర్‌ పరీక్షలు ముగిశాయి. మరికొన్ని రోజుల్లో ఇతర విద్యా సంస్థలన్నింటికీ సమ్మర్ హాలీడేస్‌ మొదలు కానున్నాయి. ఇంకేముంది సినిమాలు విడుదల చేయడానికి ఇంతకుమించి సరైన సమయం ఏముంటుంది.? అందుకే టాలీవుడ్‌ నిర్మాతలు ఏప్రిల్‌ నెలలో భారీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. హాట్‌ హాట్‌ సమ్మర్‌లో కూల్ మూవీస్‌తో ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసేందుకు సిద్ధమయ్యారు. మరి ఏప్రిల్‌ నెలలో ఏయే సినిమా ఏ తేదీల్లో విడుదలవుతోందో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఏప్రిల్‌ నెలలో విడుదలకు సిద్ధంగా ఉన్న తొలి చిత్రం రావణాసుర. రవితేజ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్‌, మేఘా ఆకాశ్‌, దక్షా నగర్కర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. సుధీర్‌ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 07-04-2023 తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దమాకాతో దుమ్మురేపిన రవితేజ రావణాసురతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు.

* యూత్‌ను ఆకట్టుకుంటూ దూసుకుపోతున్న యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం హీరోగా వస్తోన్న తాజా చిత్రం మీటర్‌. ఈ చిత్రంలో కిరణ్‌ పోలీస్‌ అధికారి పాత్రలో కనిపించనున్నాడు. రమేశ్‌ కాడూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్‌ 7వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది.

ఇవి కూడా చదవండి

* ఇక ఏప్రిల్‌ నెలలో ప్రేక్షకులకు ముందుకు రానున్న మరో భారీ చిత్రం శాకుంతలం. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీగా అంచనాలు ఉన్నాయి. గుణ శేఖర్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఏప్రిల్‌ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

* తెలుగులోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న లారెన్స్‌ హీరోగా తెరకెక్కుతోన్న రుద్రుడు సినిమా కూడా ఇదే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. కదిరేశన్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఏప్రిల్‌ 14వ తేదీన థియేటర్లలో సందడి చేయనుంది.

* సిన లవర్స్‌ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న మరో మూవీ విరూపాక్ష. సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై భారీగానే అంచనాలు ఉన్నాయి. వైవిధ్య కథాంశంతో వస్తోన్న ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకోవాలని తేజ్‌ పక్కా ప్లాన్‌తో ఉన్నాడు. సంయుక్త మీనన్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్‌ 21వ తేదీన విడుదల కానుంది.

* స్వాతిముత్యం మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వగానే మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న బెల్లంకొండ గణేష్‌ హీరోగా తెరకెక్కుతోన్న నేను స్టూడెంట్‌ మూవీ కూడా ఇదే నెలలో విడుదల కానుంది. రాఖీ ఉప్పలపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్‌ 21వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

* సినీలవర్స్‌ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మరో మూవీ పొన్నియన్‌ సెల్వన్‌ 2 కూడా ఇదే నెలలో ప్రేక్షకులకు ముందుకు రానుంది. మొదటి పార్ట్ భారీ విజయాన్ని అందుకోవడంతో సీక్వెల్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

* అక్కినేని అఖిల్‌ కెరీర్‌లో హైయ్యేస్ట్‌ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఏజెంట్‌ మూవీకి ఇదే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. స్టైలిష్‌ డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ఏప్రిల్‌ 28వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..