Kushboo Sundar: తన ఆల్‌టైమ్ ఫేవరెట్ టాలీవుడ్ కో స్టార్ గురించి చెప్పేసిన సీనియర్ హీరోయిన్

తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ సినిమాల్లో దాదాపు రెండు దశాబ్దాల పాటు టాప్ హీరోయిన్‌గా రాణించిన నటి ఖుష్భూ. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున… దాదాపు అందరు టాప్ హీరోలతోనూ ..

Kushboo Sundar: తన ఆల్‌టైమ్ ఫేవరెట్ టాలీవుడ్ కో స్టార్ గురించి చెప్పేసిన సీనియర్ హీరోయిన్
Khushboo

Updated on: Nov 24, 2025 | 4:11 PM

తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళ సినిమాల్లో దాదాపు రెండు దశాబ్దాల పాటు టాప్ హీరోయిన్‌గా రాణించిన నటి ఖుష్భూ. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. చిరంజీవి, రజనీకాంత్, కమల్ హాసన్, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున… దాదాపు అందరు టాప్ హీరోలతోనూ ఆమె జోడీ కట్టారు. అయితే, ఈ అందరిలో ఖుష్భూ హృదయంలో ప్రత్యేక స్థానం ఆక్రమించిన హీరో ఎవరు? ఆమె ఫేవరెట్ కో స్టార్ ఎవరో ఖుష్భూనే స్వయంగా చెప్పారు. ‘నా ఫేవరెట్​ కో స్టార్ ఆయనే’ అంటూ ఆ హీరోపై తన అభిమానాన్ని చాటుకున్నారు.

ఖుష్భూ తెలుగులో అందరు స్టార్​ హీరోలతోనూ నటించారు. నటించడమే కాదు సూపర్​ హిట్​లను ఖాతాలో వేసుకుని స్టార్​ హీరోయిన్​గా రాణించారు. సెకండ్​ ఇన్నింగ్స్​లోనూ ‘స్టాలిన్​’ సినిమాలో చిరంజీవి అక్కగా, ‘యమదొంగ’ సినిమాలో యముడి భార్య పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు.

హీరోయిన్​గానే కాదు మంచి క్యారెక్టర్​ ఆర్టిస్ట్​గానూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. అయితే అందరిలోకెల్లా ఒక హీరో అంటే మాత్రం ఖుష్భూకి ప్రత్యేక అభిమానం. ఆ హీరోతో ఆమె సినిమాలు ఎక్కువ చేయలేదు, కానీ చేసిన ప్రతి సినిమా దాదాపు సూపర్ హిట్. ఆ హీరో స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్, వినయం, ఫ్యామిలీ వాల్యూస్ ఇవన్నీ ఖుష్భూ హృదయాన్ని గెలుచుకున్నాయి.

ఆయనే నా ఫేవరెట్​..

టాలీవుడ్​లో తనకు ఇష్టమైన కో స్టార్ గురించి ఆమె మాట్లాడారు. ‘తెలుగులో నాకు ఇష్టమైన కో స్టార్ ఒకరే. ఆయనతో నటించడం ఎప్పుడూ కంఫర్ట్‌గా ఉండేది. ఆయన సెట్‌లో అందరితోనూ గౌరవంగా మాట్లాడతారు, ఎప్పుడూ లేట్​గా రారు, డైలాగ్స్ పర్ఫెక్ట్‌గా చెబుతారు. ఆయనతో కలిసి నటించడం నా అదృష్టం’ అన్నారు. అది ఎవరో కాదు.. విక్టరీ వెంకటేష్! అవును, ఖుష్భూ ఎన్నోసార్లు ఈ విషయాన్ని చెప్పారు.

Venkatesh

‘తెలుగులో నాకు ఇష్టమైన కో స్టార్ వెంకటేష్. ఆయనతో ‘కలియుగ పాండవులు’, ‘త్రిమూర్తులు’ సినిమాలు చేశాను. ఆయన వినయం, టైమ్ సెన్స్, ఫ్యామిలీ వాల్యూస్… నన్ను ఎప్పుడూ ఆకట్టుకునేవి’ అంటూ చెప్పుకొచ్చారు ఖుష్భూ.  ఇద్దరి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీ కూడా అదిరిపోయేది. ఫ్యాన్స్ ఈ జోడీని ఎప్పటికీ మరచిపోరు. వెంకీ మామ ప్రేక్షకులకే కాదు హీరోయిన్లకీ ఫేవరెట్​ హీరో అన్నమాట!