తెలుగులో యాక్షన్ సినిమాలకు కేరాఫ్‌గా నిలిచిన సెన్సేషనల్ దర్శకుడు వీవీ వినాయక్.. ఇప్పుడు కొత్త అవతారంలో కనిపించబోతున్నాడట. ఇప్పటికే నటుడిగా ఠాగూర్‌లో గుర్తుండిపోయే పాత్రలో నటించిన వినాయక్.. ఇప్పుడు ఏకంగా హీరోగా మారబోతున్నాడట. ‘శరభ’ ఫేమ్ ఎన్ నరసింహారావు దర్శకత్వం వహించే సినిమాలో వినాయక్ హీరోగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడని కూడా టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. మరో రెండు నెలల్లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా ఇంటలిజెంట్ ఫ్లాప్ తరువాత వినాయక్.. కొత్తగా మళ్లీ మెగా ఫోన్ పట్టలేదు.