హిందీ బుల్లితెర నటి వైశాలి టక్కర్ ఆత్మహత్య కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లోని తన నివాసంలో వైశాలి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. వైశాలి డెడ్ బాడీతోపాటు.. సూసైడ్ నోట్ కూడా పోలీసులు స్వాదధీనం చేసుకున్నారు. ఆమె ఇంటి ముందు ఉండే రాహుల్ అనే వ్యక్తి వేధింపులు భరించలేక వైశాలి ఆత్మహత్యకు పాల్పడిందని ఇండోర్ ఏసీపీ ఎం.రెహమాన్ తెలిపారు. ఆమె ఇ-గాడ్జెట్లో ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. వైశాలిని రాహుల్ వేధించినట్లు విచారణలో తేలిందని ఆయన పేర్కొన్నారు. ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుందని తెలిసి రాహుల్ గొడవ చేశాడని. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నట్లు ఏసీపీ రెహమాన్ తెలిపారు.
వైశాలికి కెన్యాలో పనిచేస్తున్న సర్జన్ అభినందన్ సింగ్తో నిశ్చితార్థం జరిగినట్లుగా తెలుస్తోంది. ఆమె స్వస్థలం ఉజ్జయిని జిల్లాలలోని మహిద్ పూర్. అయితే గత రెండేళ్లుగా ఇండోర్లో నివసిస్తుంది. ఆమె 2015లో యే రిష్తా క్యా కెహ్లెతా అనే సీరియల్ ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సూపర్ సిస్టర్స్, మన్మోహిని 2 ధారవాహికలో నటించింది. ఆమె చివరిగా రక్షాబంధన్ సీరియల్ లో కనిపించింది.
వైశాలి టక్కర్ దివంగత హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ కు బెస్ట్ ఫ్రెండ్. అతను ఆత్మహత్య చేసుకోవడం పై ఆమె చాలా అనుమానాలు వ్యక్తం చేసింది. సుశాంత్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని.. అతని మరణం వెనక చాలా మంది ప్రమేయం ఉందని ఆరోపించింది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.