టాలీవుడ్‌లో ‘బాహుబలి’ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ సినిమాకి మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా ‘బాహుబలి’లో శివగామి పాత్ర అదనపు ఆకర్షణ అనే చెప్పాలి. ఆమె గంభీరత్వం.. ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అయింది. అయితే ఇప్పుడు ఈ పాత్ర చేసినందుకు ప్రముఖ నటి రమ్యకృష్ణ ఫీల్ అవుతున్నారట. ఆమె ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారని ఆశ్చర్యపోతున్నారా? కొన్ని కొన్ని సినిమాలు వారి జీవితాల్లో అలా గుర్తుండి పోతూంటాయి.
హీరోయిన్‌గా చేసి ఫేడౌట్ అయిపోయిన తరువాత.. శివగామి రూపంలో మంచి పాత్ర లభించింది. దీంతో ఆమె స్టార్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. దాన్ని కంటిన్యూ చేయడం కూడా అంత సులభం కాదు. ప్రతీసారి అలాంటి పాత్రలు రావు. చిన్న పాత్రల్లో కూడా కనిపించలేరు. ఇప్పుడు ఈ సీనియర్ నటీమణి పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే ఉందట. అప్పట్లో కేఎస్ రవికుమార్ డైరెక్షన్‌లో.. రజినీకాంత్ హీరోగా నటించిన ‘నరసింహా’ సినిమాలో వాంప్(విలన్) పాత్రలో ఎంతలా ఒదిగిపోయారో తెలిసిందే. ఆ తర్వాత అలాంటి పవర్ ఫుల్ రోల్ మళ్లీ రాలేదు.
మళ్లీ ఎన్నో ఏళ్లకు బాహుబలి సినిమాలో శివగామి పాత్రలో కనిపించి ఆమె నటా విశ్వ రూపాన్ని చూపించారు. నిజానికి ఈ చిత్రంలో హీరో, హీరోయిన్ల కంటే ఆమెకే మంచి పేరు వచ్చింది. శివగామి తర్వాత రమ్య ఏ పాత్ర చేసినా.. అభిమానులను మెప్పించడం లేదు. తాజాగా ఆమె ఇప్పుడు తన భర్త కృష్ణ వంశీ డైరెక్షన్‌లో ‘రంగ మార్తాండ’ సినిమాలో నటిస్తున్నారు. మరి ఇందులో రమ్య ఎలాంటి పాత్రలో కనిపిస్తారా అన్నది చూడాలి.
Read More this also:దారుణంగా పడిపోయిన టమాటా ధరలు.. పదికి 3 కిలోలు
సీఎం జగన్‌పై నాగబాబు సెటైర్స్!
సిల్వర్ స్క్రీన్‌పై ‘కరోనా’ మూవీ
ఫ్లూ, జలుబు, కరోనాల మధ్య తేడాలు ఇవే!
రోజా టైమింగ్‌కి దిమ్మ తిరగాల్సిందే!
అవకాశం కోసం వెళ్తే.. ఓ నిర్మాత పడకగదికి రమ్మన్నాడు: హీరోయిన్ సంచలన కామెంట్స్..