దొరబాబు విషయంలో.. హైపర్ ఆది కీలక నిర్ణయం! ఇకపై ఆ కామెంట్స్

జబర్దస్త్ కమెడియన్ దొరబాబు విషయంలో.. హైపర్ ఆది కీలక నిర్ణయం తీసుకున్నాడట. ఇకపై అలాంటి కామెంట్స్ దొరబాబుపై చేయవద్దని అనుకుంటున్నారట. ఇటీవల విజయనగరం సెక్స్‌ రాకెట్‌లో దొరబాబు, పరదేశీలు దొరకిపోవడంతో...

దొరబాబు విషయంలో.. హైపర్ ఆది కీలక నిర్ణయం! ఇకపై ఆ కామెంట్స్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 17, 2020 | 5:37 PM

జబర్దస్త్ కమెడియన్ దొరబాబు విషయంలో.. హైపర్ ఆది కీలక నిర్ణయం తీసుకున్నాడట. ఇకపై అలాంటి కామెంట్స్ దొరబాబుపై చేయవద్దని అనుకుంటున్నారట. ఇటీవల విజయనగరం సెక్స్‌ రాకెట్‌లో దొరబాబు, పరదేశీలు దొరికిపోవడంతో… వారి భవిష్యత్తు ఏంటా అన్న ప్రశ్న ఎదురైంది. ఇదివరకటి లాగా అందరితోనూ మాట్లాడటానికి ఉండదు. అలాగే బయట కనిపించినా.. ఇవే ప్రశ్నలు ఎదురవుతూ ఉన్నాయి. అలాగే జబర్దస్త్ నుంచి కూడా అతన్ని తీసేశారని రూమర్స్ వచ్చాయి. దీంతో వారితో మాట్లాడి దొరబాబును మళ్లీ స్కిట్స్‌లో ఆది తీసుకున్నాడని కొన్ని వార్తలు వస్తున్నాయి.

అయితే ఇలాంటి గాసిప్స్‌కు చెక్ పెట్టిన హైపర్ ఆది.. దొరబాబు, పరదేశీలు తన టీమ్‌లోనే కొనసాగుతాడని.. గత వారంలో అయిన స్కిట్‌ ద్వారా క్లారిటీ ఇచ్చేశాడు. అలాగే ఇక నుంచి దొరబాబుపై రొమాంటిక్ సెటైర్లు, పంచ్‌లు తగ్గించాలని కీలక నిర్ణయం తీసుకున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. ఇప్పటికే కొనసాగుతున్న కామెంట్స్‌కి.. ఇవి ఇంకా ఆజ్యం పోస్తాయని భావించాడట. కాగా.. దొరబాబు ద్వారా కామెడీని పండించేందుకు హైపర్ ఆది ఓ కొత్త ట్రాక్‌ని క్రేయేట్ చేయాలనుకుంటున్నాడట. అది కూడా పాజిటీవ్‌గా ఉండేందుకు ట్రై చేస్తున్నాడని టాక్. మొత్తానికి హైపర్ ఆది మళ్లీ దొరబాబును జబర్దస్త్‌లో.. పాపులర్ చేయడానికి ప్లాన్స్ రెడీ చేస్తున్నాడు.

Read More this also: ఇంటింటికి ఉచితంగా కిలో చికెన్ సప్లై.. గారెలతో కలిపి

దారుణంగా పడిపోయిన టమాటా ధరలు.. పదికి 3 కిలోలు

శివగామి పాత్ర చేసినందుకు ఫీల్ అవుతోన్న రమ్య

 సీఎం జగన్‌పై నాగబాబు సెటైర్స్!

సిల్వర్ స్క్రీన్‌పై ‘కరోనా’ మూవీ

అవకాశం కోసం వెళ్తే.. ఓ నిర్మాత పడకగదికి రమ్మన్నాడు: హీరోయిన్ సంచలన కామెంట్స్..