AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR: అలియా విషయంలో రాజమౌళి టెన్షన్.. ఆ సీన్ రిపీట్ అవుతుందా..!

'బాహుబలి'తో విశ్వవ్యాప్తంగా పేరును ఘడించిన దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్‌'ను తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ఈ మూవీలో మొదటిసారిగా కలిసి నటిస్తున్నారు.

RRR: అలియా విషయంలో రాజమౌళి టెన్షన్.. ఆ సీన్ రిపీట్ అవుతుందా..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 17, 2020 | 12:48 PM

Share

‘బాహుబలి’తో విశ్వవ్యాప్తంగా పేరును ఘడించిన దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్‌’ను తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు ఈ మూవీలో మొదటిసారిగా కలిసి నటిస్తున్నారు. ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతోన్న అలియా భట్, ఒలివియా హీరోయిన్లుగా కనిపించనుండగా.. అజయ్ దేవగన్, రాహుల్ రామకృష్ణ, సముద్రఖని తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. ఈ మూవీ షూటింగ్ కూడా దాదాపుగా 60శాతం పూర్తి అయ్యింది. ఇక ఈ మూవీకి సంబంధించి ఇటీవల హైదరాబాద్‌లో ఓ కీలక షెడ్యూల్‌ పూర్తి అవ్వగా.. తదుపరి షెడ్యూల్‌ను పుణెలో ప్లాన్ చేశారు. అయితే కరోనా నేపథ్యంలో మూవీ షూటింగ్‌లకు బ్రేక్ పడగా.. ఆర్ఆర్ఆర్ కూడా చిత్రీకరణను ఆపేసింది.

ఇక అసలు మ్యాటర్‌లోకి వెళ్తే.. పుణె షెడ్యూల్‌లో అలియా పాల్గొనాల్సి ఉంది. దానికి సంబంధించిన డేట్లను కూడా ఆమె ఇచ్చేసింది. కానీ ఇప్పుడు షూటింగ్‌కు బ్రేక్ పడిన నేపథ్యంలో.. ఆమె మళ్లీ డేట్లు అడ్జెస్ట్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే బాలీవుడ్‌లో ఆమె చేతినిండా సినిమాలు ఉన్నాయి. అలాంటి నేపథ్యంలో ఈ ప్రాజెక్ట్ కోసం డేట్లు అడ్జెస్ట్ చేయడం కాస్త కష్టమైన పనే. ఒకవేళ తప్పుకుంటే ఆర్ఆర్ఆర్‌కు మరోసారి హీరోయిన్ సమస్య ఎదురవుతోంది. అంతేకాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకో స్టార్ హీరోయిన్ దొరకడం కూడా చాలా కష్టమే. కాగా ఇదే సమస్యనే గతంలోనూ ఓ సారి ఎదుర్కొంది ఆర్ఆర్ఆర్ టీమ్.

ఆర్ఆర్ఆర్‌లో ఎన్టీఆర్ జోడీగా మొదట హాలీవుడ్ బ్యూటీ డైజీ ఎడ్గర్ జోన్స్‌ను అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. కానీ కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమె తప్పుకోవడంతో.. ఆ తరువాత మరో హీరోయిన్‌ను ఎంపిక చేయడానికి ఆర్ఆర్ఆర్ టీమ్‌కు చాలా రోజులే పట్టింది. ఇక ఇప్పుడు అలియా విషయంలో అదే జరిగితే.. ఈ సారి భారీ షాక్ తప్పదు. ఎందుకంటే షూటింగ్‌లో జాప్యం వల్లన ఇప్పటికే ఆరు నెలలకు ఆర్ఆర్ఆర్ విడుదల వాయిదా పడింది. ఇక మరోసారి వాయిదా అంటే ఆ పరిస్థితి ఎలా ఉంటుందో బాహుబలి మూవీల సమయంలో అందరూ చూశారు. ఈ నేపథ్యంలో రాజమౌళి, అలియాతో సంప్రదింపులు జరుపుతున్నారట. బాలీవుడ్‌లో కూడా షూటింగ్‌లకు బ్రేక్‌లు ఇస్తున్నారు కాబట్టి.. ఆర్ఆర్ఆర్ కోసం డేట్లను అడ్జెస్ట్ చేసుకోవాలని ఆమెకు సూచించారట. దీనిపై అలియా కూడా సానుకూలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. మరి చివరకు ఏం జరుగుతుంది..? ఆర్ఆర్ఆర్‌ అనుకున్న సమయానికి షూటింగ్‌ను పూర్తి చేసుకుంటుందా..? ఈ సారైనా రాజమౌళి చెప్పిన సమయానికి వస్తారా..? లేక బాహుబలిలాగే వాయిదాల మీద వాయిదాలు వేస్తారా..? ఇలాంటి ప్రశ్నలన్నింటికి సమాధానం తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Read This Story Also: ఏబీ వెంకటేశ్వరరావుకు షాక్.. సస్పెన్షన్‌ను సమర్ధించిన క్యాట్..!

Follow Us
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
కేవలం రూ.2000 పొదుపు చేస్తే చేతికి రూ.1.2 కోట్లు..
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నుంచి నోటీసు రావొద్దా..? ఇలా అస్సలు చేయకండి!
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
కేవలం రూ.448తో జియోలో ప్రత్యేక ప్లాన్‌.. 84 రోజుల పాటు వ్యాలిడిటీ
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
అమ్మకాల్లో రికార్డు సృష్టిస్తున్న ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
వరల్డ్ రికార్డ్‌తో చరిత్ర సృష్టించిన టీమిండియా స్పిన్ స్టార్..
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
పాకిస్తాన్‌పై భారత్ ఘనవిజయం.. ప్రపంచకప్‌లో హర్మన్ సేన బోణీ..!
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
400 కి.మీ వరకు మైలేజీనిచ్చే ఇ-స్కూటర్ల గురించి తెలుసా?
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
సోమవారం శివాలయానికి వెళ్లలేకపోతున్నారా? ఇంట్లోనే ఈ విధంగా పూజి..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
దీపారాధన మధ్యలో ఆగిపోతే అశుభమా? ఐశ్వర్యం, పుణ్యం, మరణానంతర..
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్
మీ మొదటి ₹1000 ఎలా ₹1 లక్ష అవుతుందో తెలుసా..? మనీ మ్యాజిక్