Sai Dharam tej: తేజు మీదనే కాదు.. మున్సిపాలిటీపై, కన్‌స్ట్రక్షన్‌ కంపెనీపై కూడా కేసుపెట్టమంటున్న మ్యూజిక్ డైరెక్టర్

|

Sep 11, 2021 | 7:07 PM

RP patnaik on Sai Dharam tej: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడి ఐసియూలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తేజు ప్రమాదంతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉల్కిపడింది. ఇక ఈ ప్రమాదంపై..

Sai Dharam tej: తేజు మీదనే కాదు.. మున్సిపాలిటీపై, కన్‌స్ట్రక్షన్‌ కంపెనీపై కూడా కేసుపెట్టమంటున్న మ్యూజిక్ డైరెక్టర్
Teju And Rp
Follow us on

RP patnaik on Sai Dharam tej: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడి ఐసియూలో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తేజు ప్రమాదంతో టాలీవుడ్ ఒక్కసారిగా ఉల్కిపడింది. ఇక ఈ ప్రమాదంపై ఒకొక్కరు ఒకొక్కలా స్పందిస్తున్నారు. తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పై ఇసుక పేరుకుపోవడం కారణంగానే సాయి తేజ్ బైక్‌ స్కిడ్‌ అయిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని మాదాపూర్‌ ఏసీసీ కూడా అధికారికంగా వెల్లడించింది. అతి వేగంగా బైక్ డ్రైవ్ చేశాడని తేజు పై పోలీసులు కేసు పెట్టిన సంగతి విదితమే.. తేజు ప్రమాదంపై, పోలీసుల కేసు విషయంపై సీనియర్ సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ .. సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సాయి తేజ్ అతి త్వరగా పూర్తిగా కోలుకోవాలని ఆర్పీ సోషల్ మీడియా ద్వారా ఆకాంక్షించారు.
అంతేకాదు సాయిధరమ్ తేజ్ ఆక్సిడెంట్ విషయంలో అతివేగం కేసు నమోదు చేసిన పోలీసులు, అదేసమయంలో అక్కడ రోడ్డుపై ఇసుక పేరుకు పోవటానికి కారణమైన అక్కడ ఉన్న కన్‌స్ట్రక్షన్‌ కంపెనీపై మరియు ఎప్పటికప్పుడు రోడ్డుని క్లీన్ గా ఉంచాల్సిన మున్సిపాలిటీ పై కూడా కేసు పెట్టాలని ఆర్పీ పట్నాయక్ చెప్పారు. అంతేకాదు

ఈ కేసు వల్ల నగరంలో మిగతా ఏరియాల్లో ఇలాంటి అజాగ్రత్తలు పాటించేవాళ్లు అప్రమత్తమై జాగ్రత్తలు తీసుకుంటారు అని తన అభిప్రాయమని ఆర్పీ ఫేస్ బుక్ లో ఒక కామెంట్ ను పెట్టారు. ప్రస్తుతం సాయి తేజ్ వెంటిలెటర్‌ పై చికిత్స తీసుకుంటున్నాడు. ఆరోగ్యం నిలకడగా ఉందని అపోలో వైద్య సిబ్బంది తెలిపింది. తేజుని చూడడానికి సినీ హీరోలు క్యూ కడుతున్నారు.

 

Also Read: Weight Loss Tips: బరువును తగ్గించడంలో సహాయపడే 5 ఆరోగ్యకరమైన యాంటీఆక్సిడెంట్ ఆహారాలు ఏమిటో తెలుసా..
చరణ్ ఫ్రెండ్ నవీన్.. తేజుకి ఎలా స్నేహితుడు అయ్యాడంటే.. తేజు మొదటి క్రికెట్ గురువు ఎవరో తెలుసా..!