Raj Tarun: ఆ కాంట్రవర్సీలోకి నన్ను లాగొద్దు.. బిగ్‏బాస్ ఆఫర్ పై రాజ్ తరుణ్ క్లారిటీ..

|

Aug 27, 2024 | 3:10 PM

ఇటీవల తాను ఎదుర్కొన్న కాంట్రవర్సీలోకి మళ్లీ లాగొద్దని అన్నారు. డైరెక్టర్ శివసాయి వర్దన్ ను చూశాక ఎన్నో విషయాలు నేర్చుకున్నానని.. సినిమా కోసం మేకర్స్ ఎక్కడ రాజీపడలేదని అన్నారు. ఇటీవల జరిగిన కాంట్రవర్సీ నుంచి బయటకు వచ్చినట్లున్నారు ? అని ప్రశ్నించగా..

Raj Tarun: ఆ కాంట్రవర్సీలోకి నన్ను లాగొద్దు.. బిగ్‏బాస్ ఆఫర్ పై రాజ్ తరుణ్ క్లారిటీ..
Raj Tarun
Follow us on

షార్ట్ ఫిల్మ్స్ ద్వారా కెరీర్ ప్రారంభించి… ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు రాజ్ తరుణ్. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ హీరో.. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ ఖాతాలో వేసుకున్నాడు. కానీ కొన్నాళ్లుగా రాజ్ తరుణ్ నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో చాలా కాలం సినిమాలకు గ్యాప్ ఇచ్చిన ఈ హీరో.. ఇటీవలే నా సామిరంగ సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. ఇటీవల పురుషోత్తముడు, తిరగబడరాసామి సినిమాలతో అడియన్స్ ముందుకు రాగా.. ఆ రెండు సినిమాలు కూడా మెప్పించలేకపోయాయి. ఇదిలా ఉంటే గత నెల రోజులుగా రాజ్ తరుణ్ పేరు సోషల్ మీడియాలో మారుమోగిన సంగతి తెలిసిందే. తనను ప్రేమించి మోసం చేశాడని.. హీరోయిన్ మాల్వీ మల్హోత్రతో రిలేషన్ షిప్ లో ఉండి తనను దూరం పెడుతున్నాడంటూ లావణ్య అనే అమ్మాయి రాజ్ తరుణ్ పై కేసు పెట్టింది. వీరిద్దరు పరస్పరం ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకున్నారు. తాజాగా తన కొత్త సినిమా భలే ఉన్నాడే మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న రాజ్ తరుణ్ .. లావణ్య కాంట్రావర్సీ గురించి రియాక్ట్ అయ్యాడు.

ఇటీవల తాను ఎదుర్కొన్న కాంట్రవర్సీలోకి మళ్లీ లాగొద్దని అన్నారు. డైరెక్టర్ శివసాయి వర్దన్ ను చూశాక ఎన్నో విషయాలు నేర్చుకున్నానని.. సినిమా కోసం మేకర్స్ ఎక్కడ రాజీపడలేదని అన్నారు. ఇటీవల జరిగిన కాంట్రవర్సీ నుంచి బయటకు వచ్చినట్లున్నారు ? అని ప్రశ్నించగా.. రాజ్ తరుణ్ రియాక్ట్ అవుతూ.. ప్రస్తుతం బాగున్నానని.. ఆ కాంట్రవర్సీ నుంచి బయటకు వచ్చానని.. మళ్లీ అందులోకి లాగొద్దని అన్నారు. గతంలో తాను నటించిన సినిమాలు కూడా సరిగ్గా ప్రమోట్ చేయలేకపోయానని అన్నారు. అలాగే ఆ కాంట్రావర్సీ ఆగిపోవడానికి కూడా తానేం చేయలేదని అన్నారు.

ఇక బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‏బాస్ ఆఫర్ గురించి క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే రాజ్ తరుణ్ బిగ్‏బాస్ షోకు వెళ్లనున్నట్లు వార్తలు వస్తున్నాయి.. నిజమేనా అని అడగ్గా.. ఈ మూవీ డైరెక్టర్ శివసాయి మాట్లాడుతూ.. అసలు రాజ్ తరుణ్ ఒక్క నిమిషం కూడా కుదురుగా ఉండలేరని.. అలాంటి అన్ని రోజులు ఒక్క చోట ఉండడం జరిగే పని కాదని అన్నారు. దీంతో రాజ్ తరుణ్ బిగ్ బాస్ ఆఫర్ పై క్లారిటీ వచ్చింది. ఈ షో సెప్టెంబర్ 1న సాయంత్రం 7 గంటలకు స్టార్ట్ కానుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.