మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ చిత్రం రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. గత నెలలో శ్రీకాళహస్తీలో ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించిన మేకర్స్.. ఆ తర్వాత న్యూజిలాండ్‌లో ఎక్కువగ షూటింగ్ చేయనున్నారు. భారీ అంచనాల నెలకొన్న ఈ సినిమాను డైలాగ్ కింగ్ మోహన్ బాబు నిర్మాతగా దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నారు. ఈ సినిమాపై రోజు రోజుకీ మరింత ఆసక్తి పెరుగుతుంది. బుల్లితెరపై సంచలనం సృష్టించిన మహాభారతం సీరియల్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. అగ్ర నటీనటులు ఈ చిత్రంలో భాగం కానున్నారు. అయితే ఇప్పటివరకు బాగానే ఉంది.. కానీ ఇందులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కీలకపాత్రలో నటిస్తున్నాడనే వార్తలు నెట్టింట ప్రచారం కావడంతో ఈ సినిమాపై ఒక్కసారిగా హైప్ క్రియేట్ అయ్యింది.
ఈ చిత్రంలో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపిస్తున్నాడంటూ టాక్ నెట్టింట చక్కర్లు కొట్టింది. అయితే ఈ రూమర్స్ పై స్పందిస్తూ హర హర మహదేవా అంటూ రిప్లై ఇస్తూ పరోక్షంగా హింట్ ఇచ్చారు మంచు విష్ణు. దీంతో ఈ చిత్రంలో ప్రభాస్ నటించడం ఖాయమని తెలుస్తోంది. దీంతో యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో ప్రభాస్ శివుడి పాత్రలో ఎలా కనిపించనున్నాడో ఏఐ ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. టెక్నాలజీ సాయంతో శివుడి రూపంలో ప్రభాస్ పోస్టర్లను డిజైన్ చేసి నెట్టింట షేర్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ఇక ఈ ఫోటోస్ చూసిన నెటిజన్స్ శివుడి రూపంలో ప్రభాస్ లుక్ సూపర్ ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Darling Prabhas As Lord Shiva 🔱🙏🏻#Prabhas𓃵 #kannappa pic.twitter.com/EarYM5NSWZ
— Rushi Pavan (@McaBeing) October 5, 2023
ఇప్పటివరకు మాస్ యాక్షన్ హీరోగా, లవర్ బాయ్ గా నటించి మెప్పించిన ప్రభాస్.. ఇటీవలే ఆదిపురుష్ సినిమాలో రాముడిగా కనిపించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ అందుకున్నప్పటికీ ప్రభాస్ నటనకు మరోసారి ప్రశంసలు అందుకున్నారు. ఇదిలా ఉంటే.. కన్నప్ప చిత్రంలో టైటిల్ పాత్రలో మంచు విష్ణు కనిపించనుండగా.. ప్రభాస్ శివుడిగా.. లేడీ సూపర్ స్టార్ నయనతార పార్వతిగా కనిపించనుంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.
Ee range Looks kavali @iVishnuManchu Anna #Prabhas #Shivudu #kannappa pic.twitter.com/kBLSjqe29i
— veyd prabhas 🦖 (@veydprabhas) October 4, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.