బాలీవుడ్‌లోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ.. ప్రముఖ దర్శకుడితో సినిమా!

బాలీవుడ్‌లోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ.. ప్రముఖ దర్శకుడితో సినిమా!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. పద్మావత్, భాజీరావ్ మస్తానీ, దేవదాస్, రామ్ లీలా వంటి చారిత్రక సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సంజల్ లీలా భన్సాలీ..

TV9 Telugu Digital Desk

| Edited By:

May 03, 2020 | 9:01 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా? అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. పద్మావత్, భాజీరావ్ మస్తానీ, దేవదాస్, రామ్ లీలా వంటి చారిత్రక సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ సంజల్ లీలా భన్సాలీ ఈ ప్రాజెక్ట్‌కు దర్శకత్వం వహించనున్నారట. ఇందులో తారక్‌ కీలక పాత్ర వహించబోతున్నారట. ఈ చిత్రంలో తారక్‌తో పాటు స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ నటించనున్నాడని టాలీవుడ్ ఫిల్మ్ వర్గాల్లో ఓ టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే హీరోలతో చర్చలు జరిపారని, ఇందుకు ఎన్టీఆర్‌ కూడా ఓకే చెప్పారని సమాచారం.

కాగా ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఆర్ఆర్ఆర్‌లో నటిస్తున్నారు. లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఈ చిత్రం అనంతరం తారక్ త్రివిక్రమ్, అట్లీతో నటించనున్నారని ఇప్పటికే టాలీవుడ్‌వలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ రెండు ప్రాజెక్టులూ పూర్తి అయిన తరువాత సంజయ్ చిత్రం సెట్స్ పైకి వెళ్లే అవకాశముందట.

Read More:

గుడ్‌న్యూస్: ఉద్యోగులకు, వ్యాపారులకు ‘కరోనా లోన్’

ప్రపంచవ్యాప్తంగా కరోనా విలయం: డేంజర్ జోన్లుగా అమెరికా, రష్యా, బ్రిటన్‌..

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu