సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో ఈ పొంగల్‌కి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ మూవీ అనంతరం వంశీ పైడిపల్లితో సినిమా చేయాల్సి ఉన్నా, కథ అంతగా నచ్చకపోవడంతో సూపర్ స్టార్ ప్రస్తుతానికి ఆ సబ్జెక్ట్ పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. దీంతో మహేశ్‌కి చాలా కాలీ సమయం దొరికింది. ఇప్పుటికే విదేశాలకు ఫ్యామిలీతో కలిసి ట్రిప్‌కి వెళ్లివచ్చిన ఆయన త్వరలోనే హిమాలయాలకు వెళ్లాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.
మహేశ్ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ఆయన కొన్ని స్పా థెరపీ సెషన్లకు హాజరవుతారని తెలుస్తోంది. మహేశ్ ఈ మధ్య ఆయుర్వేదంపై ఎక్కువ ఇంట్రస్ట్ చూపుతున్నారు. చక్రసిద్ది నాడి వైద్యాన్ని ఆయన స్వయంగా ప్రమోట్ చేశారు కూడా. దీనితో పాటు హిమాలయాలోని ఆధ్యాత్మిక ప్రదేశాలను దర్శించడం వల్ల మనసుకు స్వాంతన కూడా లభిస్తుంది. దీంతో మహేశ్ నెక్ట్స్ సినిమా స్టార్ట్ చేసే సమయానికి మెంటల్‌గా, ఫిజికల్‌గా ఫిట్ అవ్వనున్నారనమాట. మరోవైపు సూపర్‌స్టార్ మహేశ్… చిరు-కొరటాల కాంబోలో తెరకెక్కుతోన్న ‘ఆచార్య’లో ఓ ప్రత్యేక పాత్రలో మెరవనున్నాడని టాక్.