PSPK 27 : పవన్​ లుక్​ లీక్..!

పవర్​స్టార్ పవన్​కల్యాణ్ ఇప్పుడు రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు.  ఒకవైపు వరస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, మరోవైపు రాజకీయాల్లో కూడా ఫుల్ యాక్టీవ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ‘వకీల్​సాబ్’ తో పాటు క్రిష్ డైరెక్షన్‌లో మరో మూవీలో నటిస్తున్నారు. క్రిష్ డైరెక్ట్ చేస్తోన్న  సినిమాలోని పవన్​ లుక్​ ఇదేనంటూ ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో నుదుటన బొట్టు, మీసకట్టుతో పవన్​ ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్నాడు. కాగా ఈ మూవీ చారిత్రక నేపథ్యంతో […]

PSPK 27 : పవన్​ లుక్​ లీక్..!

Updated on: Mar 15, 2020 | 9:28 PM

పవర్​స్టార్ పవన్​కల్యాణ్ ఇప్పుడు రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు.  ఒకవైపు వరస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ, మరోవైపు రాజకీయాల్లో కూడా ఫుల్ యాక్టీవ్ అయ్యారు. ప్రస్తుతం ఆయన ‘వకీల్​సాబ్’ తో పాటు క్రిష్ డైరెక్షన్‌లో మరో మూవీలో నటిస్తున్నారు. క్రిష్ డైరెక్ట్ చేస్తోన్న  సినిమాలోని పవన్​ లుక్​ ఇదేనంటూ ఓ ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో నుదుటన బొట్టు, మీసకట్టుతో పవన్​ ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్నాడు.

కాగా ఈ మూవీ చారిత్రక నేపథ్యంతో తెరకెక్కుతుంది. ఏఎమ్ రత్నం చిత్రాన్ని నిర్మిస్తుండగా, దీపావళి కానుకగా మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు హరీశ్ శంకర్‌తో కూడా పవన్ మూవీకి కమిట్ అయిన విషయం తెలిసిందే.