ప్రభాకర్ వస్తుంటే అందరూ నీకోసం చూస్తున్నారు రా చిన్నన్నా అని కృష్ణ అంటుంటే.. ఒక్క నిమిషం నువ్వు రా అల్లుడూ అంటూ మురారీని తీసుకుని వెళ్తాడు. ముకుంద .. మా ఇద్దరినీ చూసి ఉంటాడు.. మా విషయం తెలిసి పోయి ఉంటుందా చూద్దాం ఏమి జరుగుతుందో అని అంటుకుంది. ఇంతలో ప్రభాకర్ సేమ్ తనలా డ్రెస్ చేసి మురారీని తీసుకుని కిందకు వస్తాడు. అల్లుడు ధూమ్ ధామ్ షురూ అయింది పాట పెట్టు అని అంటే మధు ఒకే అంటూ సాంగ్ పెడతాడు.
ముందు ప్రభాకర్ .. మురారీ సాంగ్ కు డ్యాన్స్ చేస్తుంటే.. సుక్కు ఇపుడు అల్లుడు బిడ్డ చేస్తారు నువ్వు రా అని అంటే ఒకే అంటుంది. కృష్ణ సాంగ్ చేయడానికి వెళ్తుంటే ముకుంద పట్టుకుని ఆపి.. ఓడిపోయావు మా నాన్నకు పిలిపిస్తా అన్నావు అంటుంటే.. ఓడిపోలేదు ఇంకా పండగ పూర్తి కాలేదు.. నువ్వు ఓడిపోతే ఓ చీమలా మూలాన పడి ఉండాలి నువ్వు .. అది ఇల్లంతా తిరిగినా గానీ దాని స్థానం మాత్రం మూలే అంటూ ముకుందని కృష్ణ ఆటాడుకుంటుంది.
డీజీ సాంగ్స్ తో సందడి చేసిన కృష్ణ అలసి పోయాం కనుక.. గణపతి లడ్డుని వేలం వేస్తారు.. మధు లడ్డుని రూ. 500 లతో మొదలు పెడుతుంది. అప్పుడు ముకుంద నా కెపాసిటీ ఏమిటో అందరికి చుపిస్తా అనుకుంటూ నా పాట రూ.50 వేలు అని చెబుతుంది ముకుంద.. అందరూ షాక్ తింటారు.. అప్పుడు కృష్ణ.. నా పాట లక్ష అని అంటుంది.. మళ్ళీ కృష్ణతో ముకుంద పోటీ పడుతూ అలా లడ్డు కాస్ట్ ని ఆరు లక్షలు వరకూ తీసుకుని వెళ్తుంది. ప్రభాకర్ లడ్డుకి పోటీ పడబోతుంటే కృష్ణ ఆపి.. ముకుంద పేరుతోనే లడ్డు పాటని ఇవ్వమని చెబుతుంది.
గణేష్ లడ్డుని పాడుకున్న ముకుందకు లడ్డుని ఇవ్వమని అప్పటికప్పుడు డబ్బులు ఇవ్వమని చెబుతుంది. తన దగ్గర మూడు లక్షలు ఉంది.. ఇప్పుడు ఎలా అత్తయ్యలు లేరు.. మురారీని అడిగితె కృష్ణ దగ్గర పరువు పోతుంది. ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తుంటే.. ప్రసాద్.. అమ్మా ముకుంద క్యాష్ ఇచ్చి లడ్డు తీసుకో అని అంటాడు.. క్యాష్ లేకపోతే చెక్కు, యూపీఐ ఏదైనా ఒకే అంటాడు. ఇంతలో ముకుంద వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి మూడు లక్షలు కావాలి.. ఇవ్వవా అని అడుగుతూనే బయట ఉండి కాల్ చెయ్యి అంటే అలాగే అంటాడు శ్రీనివాస్. ఒక్క ఐదు నిమిషాల్లో మా మనిషి వచ్చి డబ్బులు ఇస్తారు కాల్ చేస్తారు.
ఇంతలో మధు అలేఖ్య ఓ ఫోక్ సాంగ్ కు డ్యాన్స్ చేస్తారు. ఇంతలో ముకుంద వాళ్ల నాన్న వచ్చి ముకుందకు డబ్బులు ఇస్తాడు. ఎందుకు వచ్చారు లోపలికి అంటే.. ఫోన్ చేశాను వినిపించలేదని లోపాలకి వచ్చాను అంటుంటే.. కృష్ణ వచ్చి.. బాబాయ్ అంటూ తన చిన్నాన్న ప్రభాకర్ కు ముకుంద తండ్రి అంటూ పరిచయం చేస్తుంది. ఏవో ప్రగల్భాలు పలికావు.. నా దగ్గర ఆరువందల మాత్రమే ఉంది. నిన్ను ఆరు లక్షల వరకూ పాడిచింది ఇందుకే.. సో.. రేపటి నుంచి ఒక మూలన పడి ఉండు అంటుంది ముకుందని కృష్ణ.
నిద్రపోతున్న మురారీని లేపుతూ కృష్ణ.. తనదైన శైలిలో అల్లరి మొదలు పెడుతుంది. లేచాక అమ్మయ్య లేచారా.. మీరు లేవాలనే ఇందంతా చేశాను.. రాత్రి లెట్ అయింది కదా నిద్రపోనివచ్చు కదా.. అని అంటే.. చిన్నన్నా, చిన్నమ్మ వెళ్లిపోతున్నారు కదా బట్టలు పెడదాం అనుకున్నాం కదా అంటుంటే.. మధ్యాహ్నం వెళ్ళమని చెప్పు కృష్ణ అంటూ మళ్ళీ నిద్రపోతాడు. కృష్ణ .. మురారీని లేపడానికి తిప్పలు పడుతుంది. ఏబీసీడీ అబ్బాయి అంటావు కదా మరి లేపు అని అంటుంటూ.. మురారీని నిద్రలేపడానికి నానా తిప్పలు పడుతుంది. ఇప్పుడు చెప్పు నేను ఏసీపీ సార్ నా ఎబిసిడీలబ్బాయినా.. అంటే నాకు ఎప్పుడూ ఎబిసిడీలబ్బాయే.. కాఫీ తీసుకుని రా అంటే.. లేదు ఫ్రెష్ అయి తగుదురుగాని లేవండి అని అంటుంటే.. ఓకే అంటాడు. రూమ్ లో ఉంటే ఇలా ఉంటారు. అదే ముకుంద ముందు అయితే ఇంకా దగ్గరకు వస్తారు అని కృష్ణ ఆలోచిస్తుంది.
ప్రభాకర్ సుక్కులు వెళ్ళడానికి రెడీ అవుతూ అందరికి తన కంపెనీ ఓపినింగ్ కు రమ్మనమని చెబుతాడు. ఇంతలో కృష్ణ వచ్చి చిన్నన్నా అని అంటే.. చల్లగా ఉండు బిడ్డ అని దీవిస్తుంటే.. ఇంతలో సుక్కు కలగజేసుకుని ముకుందకు మొగుడిని తెస్తేనే మన బిడ్డ చల్లగా ఉంటుందని అంటుంది. కృష్ణ, మురారీలు ప్రభాకర్ కు సుక్కుకు బట్టలు పెట్టి పంపిస్తారు. బిడ్డను జాగ్రత్తగా చూసుకో అని అంటూనే,, మధు సినిమా స్టోరీ రెడీ చేసుకో సినిమా తీద్దామని చెబుతాడు.
కృష్ణతో నీకు ఒకటి చెప్పాలి.. ఆ ముకుంద బిడ్డ మొగుడిని మిలటరీ నుంచి తీసుకుని రావడం తప్పితే నీ కాపురం నిలబడడానికి వేరే దారే కనిపించడం లేదు అని అంటాడు ప్రభాకర్. ఇదంతా నీకు ఎరుకై ఉంటుందని తెలిసే చెబుతున్నా జర జాగ్రత్తగా ఉండు.. లేకపోతే నువ్వు చాలా నష్టపోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ ముకుంద చాలా జాదూగా ఉంటుంది. జాగ్రత్తగా ఉండు అని అంటూనే నీకు ఏదైనా ప్రాబ్లెమ్ వస్తే నేను ఉన్నా అది మరచిపోకు అంటూ కూతురుకి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతారు ప్రభాకర్, సుక్కు..
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..