Top Serials: బుల్లితెరపై గత మూడున్నర ఏళ్లకు పైగా టాప్ రేటింగ్ తో దూసుకుపోయి.. బుల్లి తెర ప్రేక్షకులను అలరించిన కార్తీక దీపం టాప్ స్థానం నుంచి దిగి వస్తుంది. ఒకానొక సమయంలో టాప్ రేటింగ్ తో దూసుకుపోయి.. స్టార్ హీరోల షోలకు కూడా షాకిచ్చిన కార్తీక దీపం ఇప్పుడు తన ప్రాభవాన్ని కోల్పోతుంది. రోజు రోజుకీ దారుణంగా రేటింగ్ పడిపోతుంది. దీనికి కారణం.. రోజు రోజుకీ సీరియల్ ను సాగదీస్తున్న విధానం అని అంటున్నారు. అందుకనే బుల్లితెర ప్రేక్షకులు వంటలక్కను చూడడానికి అంతగా ఆసక్తిని చూపించడం లేదని తెలుస్తోంది. అయితే మంచి కథ, కథనంతో గుప్పెడంత మనసు సీరియల్ రోజు రోజుకీ రేటింగ్ ను పెంచుకుని టాప్ స్థానానికి చేరుకుంది. ఇక గృహ లక్ష్మి కూడా మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంది.
కార్తీక దీపం సీరియల్ అర్బన్ ప్రాంతంలో 40వ వారం రేటింగ్ 12.80 నమోదు కాగా రూరల్ ప్రాంతంలో 14.52 రేటింగ్ వచ్చింది. ఇక గుప్పెడంత మనసు రేటింగ్ పెంచుకుని అర్బన్ లో 11.67 ఉండగా రూరల్ లో 13.53 రేటింగ్ నమోదయింది. జీ తెలుగు లో రాధమ్మ కూతురు, నెంబర్ వన్ కోడలు, ప్రేమ ఎంత మధురం సీరియల్ కూడా ప్రేక్షకుల ఆదరణను సొంతం చేసుకున్నాయి. ఇక ఈటీవీలో ప్రసారమవుతున్న సీరియల్స్ లలో మనసు మమత, నా పేరు మీనాక్షి, అత్తారింటికి దారేది సీరియల్స్ మంచి రేటింగ్ నమోదు చేస్తున్నాయి. అయితే ఒకప్పుడు అత్యధిక ఆదరణ పొందిన సీరియల్స్ జెమిని ఛానల్ సొంతం.. ఇప్పుడు జెమినీలో ప్రసారం అవుతున్న చానల్స్ కు అంతగా ఆదరణ దక్కడం లేదు.. ఒక్క అల వెంకటాపురం సీరియల్ మాత్రమే కొంతమేర ఆకట్టుకుంది. ఇక మొత్తం టాప్ సీరియల్స్ లో అధికంగా మా చానల్ నుంచి అధికంగా ఉండగా.. జీ తెలుగు తర్వాత స్థానంలో ఉంది.
Also Read: ఆర్మీ స్కూల్ లో చదువుకోవాలనుకునే బాలికల కోసం నోటిఫికేషన్ రిలీజ్.. మరిన్ని వివరాల కోసం