AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karthika Deepam: మీ ఆశీస్సులు కావాలి.. భార్యతో కలిసి కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన డాక్టర్ బాబు.. వీడియో వైరల్

స్టార్ హీరోలు, హీరోయిన్లు సైతం ఇప్పుడు బిజినెస్ రంగంలోకి అడుగు పెడుతున్నారు. ఓ వైపు సినిమాలు చేసుకుంటూనే తమ వ్యాపార కార్యకలాపాలు చక్కదిద్దుకుంటున్నారు. ఈ క్రమంలోనే కార్తీక దీపం సీరియల్ ఫేమ్ డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాల కూడా బిజినెస్ స్టార్ట్ చేశాడు.

Karthika Deepam: మీ ఆశీస్సులు కావాలి.. భార్యతో కలిసి కొత్త బిజినెస్ స్టార్ట్ చేసిన డాక్టర్ బాబు.. వీడియో వైరల్
Nirupam Paritala
Basha Shek
|

Updated on: Jul 26, 2025 | 8:17 PM

Share

దివంగత రైటర్, ప్రముఖ సినీ నటుడు ఓంకార్ నట వారసుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు నిరుపమ్ పరిటాల. సీరియల్స్ తో పాటు ఫిటింగ్ మాస్టర్, రభస వంటి కొన్ని సినిమాల్లోనూ నటించాడు. అయితే సిల్వర్ స్క్రీన్ పై అంతగా లక్ కలిసి రాకపోవడంతో బుల్లితెరపైనే ఫుల్ ఫోకస్ పెట్టి సక్సెస్ అయ్యాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. కార్తీక దీపం, హిట్లర్ గారి పెళ్లాం, కుంకుమపువ్వు, మూగమనసులు, అత్తారింటికి దారేది, కలవారి కోడళ్లు, కాంచన గంగ, ప్రేమ, రాధకు నీవెర ప్రాణం సీరియల్స్‌లో నటించా బుల్లితెర ఆడియెన్స్ కు చేరవయ్యాడు నిరుపమ్. ముఖ్యంగా టీఆర్పీ విషయంలో టాప్‌ ప్లేస్‌ను దక్కించుకుంది కార్తీక దీపంతో బాగా ఫేమస్ అయిపోయాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. ఇందులో అతను పోషించిన డాక్టర్ బాబు పాత్రకు చాలా మంది అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం ఈ సీరియల్ కు సీక్వెల్ గా కార్తీక దీపం 2 కూడా ప్రసారమవుతోంది.

ఇవి కూడా చదవండి

రెమ్యునరేషన్ లో టాప్ గా నిరుపమ్..

కాగా తెలుగు బుల్లితెరపై అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటుల్లో నిరుపమ్ కూడా ఒకరు. ఒక్క రోజుకే సుమారు 30 వేల రూపాయలు పారితోషికంగా తీసుకుంటారని టాక్. అలా ప్రస్తుతం కార్తీక దీపం 2, హిట్లర్ గారి పెళ్లాం, కుమారి శ్రీమతి తదితర సీరియల్స్‌లో నటిస్తున్నాడు నిరుపమ్. అలాగే పలు టీవీ షోలు, ఈవెంట్స్, వాణిజ్య ప్రకటనల్లోనూ నటిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ఈ క్రమంలో చాలా మంది స్టార్స్ లాగానే నిరుపమ్ కూడా వ్యాపార రంగంలోకి అడుగు పెట్టాడు. తన భార్య మంజులతో కలిసి క్లాత్ బిజినెస్ ప్రారంభించారు. ఈ విజయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు నిరుపమ్ దంపతులు.

భార్య మంజులతో నిరుపమ్..

ఈ క్రమంలోనే శ్రీవల్లి కలెక్షన్స్‌‌తో చేతులు కలిపి చందానగర్‌లో కొత్త క్లాత్ స్టోర్ ప్రారంభించనున్నట్లు నిరుపమ్ తెలిపాడు. జూలై 30వ తేదీన ఈ స్టోర్ లాంచ్ చేస్తున్నామని.. ఇందుకు అందరి ఆశీస్సులు కావాలని నిరూపమ్- మంజుల కోరారు. ప్రస్తుతం వీరు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు నిరూపమ్ దంపతులకు ఆల్ ది బెస్ట్ చెబుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
అరటి తోటల్లో అలికిడి.. అడుగు ముందుకేసిన రైతుకు ఎదరైన భయానక దృశ్యం
అరటి తోటల్లో అలికిడి.. అడుగు ముందుకేసిన రైతుకు ఎదరైన భయానక దృశ్యం
శ్రావణ పౌర్ణమి: రాఖీ కట్టే రోజున ఈ పనులు చేయకండి!
శ్రావణ పౌర్ణమి: రాఖీ కట్టే రోజున ఈ పనులు చేయకండి!
సప్త సముద్రాలు ఈది.. పిల్ల కాలువలో తేలిపోయిన టీమిండియా
సప్త సముద్రాలు ఈది.. పిల్ల కాలువలో తేలిపోయిన టీమిండియా
డిగ్రీ, డిప్లొమా మార్కులతో BEMLలో 1346 ఉద్యోగాలు.. రాతపరీక్ష లేదు
డిగ్రీ, డిప్లొమా మార్కులతో BEMLలో 1346 ఉద్యోగాలు.. రాతపరీక్ష లేదు
మిలాద్-ఉన్-నబీ స్పెషల్.. రైస్ ఖీర్‌ను ఇలా తయారు చేస్తే ఉంటాది..
మిలాద్-ఉన్-నబీ స్పెషల్.. రైస్ ఖీర్‌ను ఇలా తయారు చేస్తే ఉంటాది..
పొయ్యి వెలిగించే పనిలేకుండా.. అమ్మమ్మల నాటి కమ్మని 'పొలం పచ్చడి'
పొయ్యి వెలిగించే పనిలేకుండా.. అమ్మమ్మల నాటి కమ్మని 'పొలం పచ్చడి'
ఏడాదికి 4 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ.. మీరూ పొందోచ్చు..
ఏడాదికి 4 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ.. మీరూ పొందోచ్చు..
చుక్క నూనెతో 10 నిమిషాల్లో  వంకాయ తవా ఫ్రై
చుక్క నూనెతో 10 నిమిషాల్లో  వంకాయ తవా ఫ్రై
ప్రాణాల మీదకు తెచ్చిన పిల్లి.. హాస్పిటల్‌లో 10 మంది కూలీలు..
ప్రాణాల మీదకు తెచ్చిన పిల్లి.. హాస్పిటల్‌లో 10 మంది కూలీలు..
'బింబిసార' ఛైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా మారిపోయిందో చూశారా? ఫొటోస్
'బింబిసార' ఛైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా మారిపోయిందో చూశారా? ఫొటోస్