యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు క్రికెట్ చూడాలనే ఆసక్తి ఉండదనే విషయం మీకు తెలుసా. ? తనకు ఎందుకు క్రికెట్ చూడాలనే ఆసక్తి పోయిందో తాజాగా ఎన్టీఆర్ చెప్పేశాడు. తన తండ్రి హరికృష్ణ చెప్పి పనులతో క్రికెట్ చూడాలనే ఆసక్తి పూర్తిగా పోయిందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెర పైఎ ఎవరు మీలో కోటిశ్వరులు అనే షో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ షోను ఘనంగా ప్రారంభించారు. అయితే తాజాగా ఇందులో పాల్గోనే కంటెస్టెంట్స్‌తో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల గురించి.. అలాగే తన జీవితంలోని కొన్ని ఆసక్తికర విషయాల గురించి చెప్పుకోచ్చారు.
ఇదిలా ఉంటే.. నిన్న ఈ షోలో పాల్గోన్న అభిరాం అనే కంటెస్టంట్‌కు క్రికెట్‌కు సంబంధించిన ప్రశ్న వచ్చింది. ఈ సందర్భంగా.. తనకు క్రికెట్ అంటే చాలా ఇష్టమని.. కానీ క్రికెట్ చూడాలనే ఆసక్తి పూర్తిగా తన తండ్రి హరికృష్ణ వలనే పోయిందంటూ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. నాకు క్రికెట్ ఆడటమంటే చాలా ఇష్టం. కానీ క్రికెట్ టీవీలో చూడటమంటే అస్సలు ఇష్టం ఉండదు. ఇందుకు కారణం కూడా మా నాన్నే. చిన్నప్పుడు ఉదయం టీవీలో వచ్చే క్రికెట్ మ్యాచ్‌ను వీసిఆర్లో రికార్డ్ చేయమని చెప్పేవారు. అది ఎలా చేయాలో కూడా తనే నేర్పించాడు. దీంతో ఆ మ్యాచ్ పూర్తిగా చూసేవాడిని. ఆ తర్వాత సాయంత్రం నాన్నతో కలిసి మళ్లీ అదే మ్యాచ్‌ను చూసేవాడిని. దీంతో చివరకు నాకు క్రికెట్ అంటనే బోర్ కొట్టింది అంటూ చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్. అలాగే ఎన్టీఆర్ తన ప్రేమ విషయాలను కూడా తొలిసారిగా అభిమానులతో పంచుకున్నారు. పెళ్లికి మందుకు తన భార్యకు తన ప్రేమను వ్యక్తపరిచినా.. ఆమె నుంచి అంగీకారం రావడం కోసం 8 నెలలు వెయిట్ చేసినట్లుగా ఎన్టీఆర్ చెప్పుకొచ్చాడు.
Also Read: Pooja Hegde: బుట్టబొమ్మ ఖాతాలో మరో రికార్డ్.. నెట్టింట్లో సంబరాలు జరుపుకుంటున్న పూజా హెగ్డే..