Jabardasth Faima: ఇదేం ట్విస్ట్! మళ్లీ పటాస్ ప్రవీణ్‌తో జబర్దస్త్ ఫైమా.. కొత్త లవర్‌ను పరిచయం చేశాక కూడా ఇలా!

|

May 21, 2024 | 7:58 PM

పటాస్ ప్రవీణ్ తో ఫైమా చేసిన కామెడీ స్కిట్స్ ఓ రేంజ్ లో పేలాయి. అయితే ఆన్ స్క్రీన్ లో ఉన్నట్లే వీరు రియల్ లైఫ్ లో కూడా ప్రేమలో ఉన్నట్లు చాలా మంది అనుకున్నారు. పెళ్లి కూడా చేసుకుంటారని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే ఇద్దరూ కలిసి ఫొటోలు దిగడం, బహమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. దీంతో ఈ రూమర్లను నిజమేననుకున్నారు.

Jabardasth Faima: ఇదేం ట్విస్ట్! మళ్లీ పటాస్ ప్రవీణ్‌తో జబర్దస్త్ ఫైమా.. కొత్త లవర్‌ను పరిచయం చేశాక కూడా ఇలా!
Jabardasth Faima
Follow us on

ప్రముఖ జబర్దస్త్ కమెడియన్ ఫైమా గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన కామెడీ స్కిట్స్ తో బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిందీ లేడీ కమెడియన్. ముఖ్యంగా పటాస్ ప్రవీణ్ తో ఫైమా చేసిన కామెడీ స్కిట్స్ ఓ రేంజ్ లో పేలాయి. అయితే ఆన్ స్క్రీన్ లో ఉన్నట్లే వీరు రియల్ లైఫ్ లో కూడా ప్రేమలో ఉన్నట్లు చాలా మంది అనుకున్నారు. పెళ్లి కూడా చేసుకుంటారని ప్రచారం జరిగింది. అందుకు తగ్గట్టుగానే ఇద్దరూ కలిసి ఫొటోలు దిగడం, బహమతులు ఇచ్చిపుచ్చుకున్నారు. దీంతో ఈ రూమర్లను నిజమేననుకున్నారు. అయితే ఇంతలోనే తాము విడిపోయామంటూ ఫ్యాన్స కు షాకిచ్చారు ప్రవీణ్, ఫైమా. ఇది మరవక ముందే మరో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది. ఇటీవల తన కొత్త బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసింది ఫైమా. అంతేకాదు అతనితోనే బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకుని ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రవీణ్ నాయక్‌ తో తాను ఐదేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు అందులో తెలిపింది. దీంతో కొంతమంది నెటిజన్లు ఈ జబర్దస్త్ నటిని ట్రోల్ చేశారు.

ఇది జరుగుతుండగానే మరో బిగ్ ట్విస్ట్ ఇచ్చింది ఫైమా. తన కొత్త బాయ్ ఫ్రెండ్ ను పరిచయం చేసి మూడు రోజులు కూడా కాలేదు.. మళ్లీ పాత లవర్ పటాస్ ప్రవీణ్ తో కనిపించిందీ లేడీ కమెడియన్. తన బర్త్ డే పార్టీలోనే ప్రవీణ్ తో కలిసి ఓ రీల్ చేసి దానిని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది. అది కూడా టిల్లు స్క్వేర్ స్పూఫ్ చేయడంతో అభిమానులు, నెటిజన్లు షాక్ అవుతున్నారు.  ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు అసలు వీరిద్దరి మధ్య అసలు ఏం జరుగుతుందో అర్థం కాక నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు. ఇంతకీ ఇద్దరిలో ఎవరు ఫ్రెండ్? ఎవరు లవర్‌? రాధికా అంటూ ఫైమాను ట్రోల్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

 

కొత్త  లవర్ తో జబర్దస్త్ లేడీ కమెడియన్ ఫైమా.. ఫొటోస్ ఇదిగో..

తన బర్త్ డే పార్టీలోనే పటాస్ ప్రవీణ్ తో జబర్దస్త్ ఫైమా.. వీడియో ఇదిగో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..