Jabardasth: త్వరలో మనువాడబోతున్న జబర్దస్త్ నటి.. నిశ్చితార్థం ఫోటోలు వైరల్.. వరుడు ఎవరంటే..?

జబర్దస్త్ బ్యూటీ షబీనా పెళ్లిపీటలెక్కబోతుంది. ఆమె ఎంగేజ్​మెంట్ పిక్స్ ప్రజంట్ నెట్టింట ​ వైరల్​ అవుతున్నాయి. ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం పదండి.

Jabardasth: త్వరలో మనువాడబోతున్న జబర్దస్త్ నటి.. నిశ్చితార్థం ఫోటోలు వైరల్.. వరుడు ఎవరంటే..?
Jabardasth Shabena With Roja

Updated on: Aug 17, 2022 | 11:16 AM

jabardasth shabeena engagement: జబర్దస్త్ షో ఎంతో కాలంలో నవ్వులు పంచుతున్న విషయం తెలిసిందే. ఈ షోకు ఉన్న ఫాలోయింగ్, పాపులారిటీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జడ్జిలు, కంటెస్టెంట్స్ మారినా కూడా షో రేటింగ్ ఏమాత్రం తగ్గలేదు. ఎందరో కమెడియన్స్‌ను పరిచయం చేసింది ఈ బుల్లితెర నవ్వుల షో. ఇప్పుడు వారిలో చాలామంది సిల్వర్ స్క్రీన్‌పై సైతం రాణిస్తున్నారు. అయితే గతంలో స్కిట్‌‌లోని పాత్రల కోసం మగవాళ్లే లేడీ గెటప్పులు వేసేశారు. కానీ గత 3,4 ఏళ్లుగా లేడీ ఆర్టిస్టులు సైతం ఇందులో కనిపిస్తున్నారు. మంచి పేరు తెచ్చుకుంటున్నారు. అందులో ఒకరు  షబీనా షేక్(Shabeena Shaik). తొలుత  ‘కస్తూరి’, ‘అత్తారింటికి దారేది’, ‘నా పేరు మీనాక్షి’ వంటి ధారావాహికల్లో నటించిన ఈమె.. ఆ తర్వాతి కాలంలో జబర్దస్త్‌కు ఎంట్రీ ఇచ్చి మంచి పేరు తెచ్చుకుంది. కెవ్వు కార్తీక్(Kevvu Karthik) స్కిట్‌లలో ఎక్కువగా నటించింది.  చోటా నరేశ్‌పై  ఆమె వేసే పంచ్‌లు బాగా పేలేవి. తాజాగా ఈ యువ నటి దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టబోతుంది. ఎంగేజ్‌మెంట్‌ కూడా అయిపోయింది. మున్నా అనే వ్యక్తితో ఆమె మ్యారేజ్ జరగనుంది. తన నిశ్చితార్థం ఫోటోలను ఇన్ స్టాలో షేర్ చేసింది షబీనా. అవి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.