AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అట్లీ డైరక్షన్‌లో షారూక్?

చెన్నై: బాలీవుడ్‌ కింగ్ ఖాన్ షారూక్‌ ఓ సౌత్ ఇండియా దర్శకుడితో సినిమా చేయబోతున్నారా? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ సౌత్ డైరక్టర్ ఎవరో తెలుసా? యంగ్ అండ్ టాలెంటెడ్ అట్లీ. ఇటీవల చిదంబరం స్టేడియంలో జరిగిన  చెన్నై సూపర్‌ కింగ్స్‌, కొల్‌కతా నైట్‌ రైడర్స్‌ మధ్య మ్యాచ్‌లో వీరిద్దరు పక్కపక్కనే కూర్చుని మ్యాచ్‌ను ఎంజాయ్ చేశారు. తర్వాత అట్లీ ఆఫీసుకు షారుక్‌ వెళ్లి వచ్చారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు బయటికి వచ్చాయి. […]

అట్లీ డైరక్షన్‌లో షారూక్?
Ram Naramaneni
|

Updated on: Apr 10, 2019 | 3:54 PM

Share

చెన్నై: బాలీవుడ్‌ కింగ్ ఖాన్ షారూక్‌ ఓ సౌత్ ఇండియా దర్శకుడితో సినిమా చేయబోతున్నారా? అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ సౌత్ డైరక్టర్ ఎవరో తెలుసా? యంగ్ అండ్ టాలెంటెడ్ అట్లీ. ఇటీవల చిదంబరం స్టేడియంలో జరిగిన  చెన్నై సూపర్‌ కింగ్స్‌, కొల్‌కతా నైట్‌ రైడర్స్‌ మధ్య మ్యాచ్‌లో వీరిద్దరు పక్కపక్కనే కూర్చుని మ్యాచ్‌ను ఎంజాయ్ చేశారు. తర్వాత అట్లీ ఆఫీసుకు షారుక్‌ వెళ్లి వచ్చారు. ఈ సందర్భంగా తీసిన ఫొటోలు బయటికి వచ్చాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రాబోతోందని కోలీవుడ్‌ వర్గాల్లో టాక్ నడుస్తుంది.

బాలీవుడ్‌కు అట్లీను తీసుకెళ్లాలని బాద్‌షా ప్రయత్నిస్తున్నారట. అట్లీ తెరకెక్కించిన తమిళ సినిమా ‘మెర్సల్‌’ హిందీ రీమేక్‌లో షారుక్‌ నటించనున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. అంతేకాదు విజయ్‌ హీరోగా అట్లీ ప్రస్తుతం తీస్తున్న సినిమాలో షారూక్‌ అతిథి పాత్రలో నటించనున్నారని కూడా ప్రచారం జరిగింది.  షారూక్‌ గతంలో ఓ తమిళ సినిమాలో నటించారు. కమల్‌ హాసన్‌ ‘హే రామ్‌’ సినిమాలో షారుక్‌ ఆయన సోదరుడి పాత్రను పోషించారు. దర్శకుడిగా అట్లీ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటి వరకు ఆయన తీసిన మూడు సినిమాలు ‘రాజా రాణి’, ‘తెరి’, ‘మెర్సల్‌’ హిట్‌ సినిమాలుగా నిలిచాయి. మరి ఈ రూమర్స్‌లో ఎంత నిజముందో తెలియాలంటే ఇద్దర్లో  ఒకరు నోరు విప్పాలి.

Follow Us