
బుల్లితెరపై టాప్ టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోతున్న సీరియల్ గుండె నిండా గుడి గంటలు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సీరియల్ కు వస్తున్న రెస్పాన్స్, క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. అయితే ఇందులో మీనా, బాలు పాత్రలతోపాటు.. రోహిణి, మనోజ్ పాత్రలు సైతం విపరీతంగా ఫాలోయింగ్ పెంచుకున్నాయి. ఇక రోహిణి పాత్రలో కనిపించిన అమ్మాయి గురించి చెప్పక్కర్లేదు. ఆమె పేరు మునిరత్నం జ్యోతిక. ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తనదైన నటన, అందంతో తెలుగు, కన్నడ టెలివిజన్ రంగాల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘గుండెనిండా గుడిగంటలు’ సీరియల్ ద్వారా ఈమె తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. అలాగే ‘కళ్యాణి’ వంటి పలు ప్రజాదరణ పొందిన సీరియల్స్‌లో నటించి మెప్పించింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఆమె ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. అందులో రోహిణి లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్.
ఎక్కువమంది చదివినవి : Cinema : ఇదెక్కడి డిమాండ్ రా బాబూ.. ప్రేమ, ద్రోహం, ప్రతీకారం.. ఓటీటీలో దూసుకుపోతున్న వెబ్ సిరీస్..
సాధారణంగా సీరియల్స్ అనగానే హీరోయిన్లు పద్ధతిగా, చీరకట్టులో లేదా పంజాబీ డ్రెస్సుల్లో చాలా ట్రెడిషినల్‌గా కనిపిస్తుంటారు. అలాగే జ్యోతిక కూడా స్క్రీన్ మీద హోమ్లీ లుక్‌తోనే అందరినీ ఆకట్టుకుంది. అయితే, రీల్ లైఫ్‌లో ఎంతో పద్ధతిగా కనిపించే ఈ అమ్మడు.. రియల్ లైఫ్‌లో మాత్రం ఇందుకు పూర్తి భిన్నం అని నిరూపిస్తోంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే జ్యోతిక, తాజాగా షేర్ చేసిన మోడ్రన్ ఫొటోషూట్ పిక్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తన గ్లామరస్, వెస్ట్రన్ లుక్స్‌తో జ్యోతిక సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. సీరియల్‌లో ఆమెను చూసిన ప్రేక్షకులు, ఈ మోడ్రన్ అవతార్ చూసి ఫిదా అవుతున్నారు. “స్క్రీన్ మీద పద్ధతిగా కనిపించే మన జ్యోతికనేనా ఈమె!” అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. స్టైలిష్ వెస్ట్రన్ వేర్స్‌లో ఆమె ఇస్తున్న పోజులు కుర్రకారును ఆకట్టుకుంటున్నాయి.
ఎక్కువమంది చదివినవి : Cinema : నిజమైన సంఘటనల ఆధారంగా సిరీస్.. ఓటీటీలో ట్రెండింగ్‌లో ఉన్న వెబ్ సిరీస్..
నటిగా బిజీగా ఉంటూనే, మరోవైపు ఇలాంటి వెరైటీ ఫొటోషూట్లతో తనలోని గ్లామర్ యాంగిల్‌ను కూడా బయటపెడుతోంది. బుల్లితెరపైనే కాకుండా సోషల్ మీడియాలోనూ భారీగా ఫాలోయింగ్‌ను సంపాదించుకుంటున్న ఈ భామ, రాబోయే రోజుల్లో వెండితెరపై కూడా అవకాశాలు అందుకుంటుందేమో చూడాలి. ప్రస్తుతం ఈమె గ్లామరస్ మోడ్రన్ ఫొటోలు ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
ఎక్కువమంది చదివినవి : Cinema : వెంకటేశ్ హీరో.. తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. కానీ తెలుగులో అట్టర్ ప్లాప్.. కారణం ఇదే..
ఎక్కువమంది చదివినవి : Rajanna Movie : రాజన్న సినిమాకు నాకు ఇచ్చిన రెమ్యునరేషన్ అంతే.. టాలీవుడ్ నటుడు..