చాలా కాలంగా టాలీవుడ్ బుల్లితెరపై పరభాష నటీనటుల హవా ఎక్కువగానే ఉందన్న సంగతి తెలిసిందే. మెయిన్ లీడ్స్ నుంచి క్యారెక్టర్ ఆర్టిసుల వరకు కన్నడ యాక్టర్స్ సత్తా చాటుతున్నారు. తెలుగు సీరియల్లలో తమ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇక ఇటీవల సీరియల్స్ మాత్రమే కాకుండా.. అటు రియాల్టీ షోలలోనూ పాల్గొంటూ తెగ సందడి చేస్తున్నారు. కన్నడ నుంచి తెలుగు బుల్లితెరపై ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న నటీమణులలో ఈ నటి ఒకరు. పైన ఫోటోలో కనిపిస్తున్న బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా ?.. బుల్లితెరపై తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. సంప్రదాయ చీరకట్టు, బొట్టుతోపాటు.. అద్భుతమైన నటనతో తెలుగువారికి దగ్గరయ్యింది. కన్న కొడుకు కోసం.. అతని ప్రేమ కోసం తల్లడిల్లే తల్లి పాత్రలో ఒదిగిపోయింది. అయితే సీరియల్లో ఎంతో సంప్రదాయంగా కనిపించే ఈ బ్యూటీ.. అటు సోషల్ మీడియాలో మాత్రం పూర్తిగా విభిన్నం. చిట్టి గౌనులతో.. గ్లామర్ షోతో నెట్టింట రచ్చ చేస్తుంటుంది. ఎవరో గుర్తుపట్టారా ?.. తనే ‘గుప్పెడంత మనసు’ సీరియల్ నటి జగతి అలియాస్ జ్యోతిరాయ్.
గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి మేడమ్గా తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది జ్యోతిరాయ్. కొద్దిరోజుల క్రితం సీరియల్ తన పాత్ర ముగిసింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ ముద్దుగుమ్మ గ్లామర్ షోతో రచ్చ చేస్తుంది. ఇక ఇప్పుడు బ్యాక్ లెస్ భంగిమల్లో కెమెరాకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం జ్యోతిరాయ్ ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. జగతి మేడమ్ గ్లామర్ ఫోజులు చూసి షాకవుతున్నారు నెటిజన్స్.
ఓవైపు నెట్టింట గ్లామర్ ఫోజులతో రచ్చ చేస్తోన్న జ్యోతిరాయ్..ఇప్పుడిప్పుడే ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. రాహుల్ దీపక్ దర్శకత్వంలో ది ప్రెట్టీ గర్ల్ అనే వెబ్ సిరీస్ చేస్తుంది. కొద్ది నెలల క్రితం ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. అందులోనూ ఫుల్ గ్లామర్ గర్ల్ గా కనిపించి షాకిచ్చింది జ్యోతిరాయ్. అలాగే ఆమె వ్యక్తిగత విషయాలతోనూ నిత్యం వార్తలలో నిలుస్తోంది. ఇప్పటికే పెళ్లై బాబు కూడా ఉన్న జ్యోతిరాయ్.. కొంతకాలంగా యంగ్ డైరెక్టర్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవలే తమ రిలేషన్ ను బయటపెట్టింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.