
ఎవరు మీలో కోటీశ్వరులు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ బుల్లితెర మీద హోస్ట్ చేస్తున్న నయా షో. 120 దేశాల్లో సూపర్ హిట్ అయిన అదే కాన్సెప్ట్.. గతంలో టాలీవుడ్‌లోనూ కాసులు కురిపించిన సేమ్ ఫార్ములా… బట్ ఈ సారి హోస్ట్ తారక్… సారి సారీ.. మీ రామారావు. త్వరలో ప్రారంభం కానున్న ఈ షోకు సంబంధించి ఒక్కో అప్‌డేట్ ఫ్యాన్స్‌కు గూజ్‌బంప్స్ తెప్పిస్తోంది.
పేరుకు స్మాల్ స్క్రీన్ షోనే గానీ… బిగ్ స్కేల్‌లో ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ముఖ్యంగా తారక్ స్టైలింగ్ విషయంలో భారీగా ఖర్చు పెడుతున్నారట. టీజర్‌లో కనిపించిన లుక్‌కు సంబంధించి ఇంట్రస్టింగ్ విషయాలు రివీల్ చేశారు మేకర్స్. ఇండియాస్ బెస్ట్ స్టైలిష్ట్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన బ్లాక్ సూట్‌లో కనిపించారు తారక్. ఆ సూపర్ కూల్ లుక్ అభిమానులను అలరిచింది.
గతంలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ ఫోటో షూట్ చేసిన డబూ రత్నాని ఈ షో కోసం ఎన్టీఆర్‌తో ఓ ఫోటోషూట్ చేశారు. ఆ ఫోటోలను తన ఇన్‌స్టా పేజ్‌లో షేర్ చేస్తూ హాట్ సీట్‌లో మిమ్మల్ని చూసేందుకు ఎదురుచూస్తున్నా అంటూ కామెంట్ చేశారు. దీంతో అటు నందమూరి అభిమానులతో పాటు వీక్షకులు తారక్‌ను స్మాల్ స్క్రీన్‌పై చూసేందుకు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే బిగ్ బాస్ హోస్ట్‌గా బిగ్ సక్సెస్ సాధించిన తారక్ ఎవరు మీలో కోటీశ్వరులుతో మరోసారి తన బెస్ట్ ను ఆడియన్స్ కి మరోసారి పరిచయం చేస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ.
Uber Cool @tarak9999 for #EvaruMeeloKoteeswarulu
? @DabbooRatnani @ManishaDRatnani @Dabboo
Wearing @ManishMalhotra
Styled by @ashwinmawle @hassankhanhak #JrNTR #dabbooratnani pic.twitter.com/x4XnrAQl2f— Dabboo Ratnani (@DabbooRatnani) March 13, 2021
Also Read:
బయట నుంచి చూస్తే టమాట పంటేగా అనుకుంటారు.. లోపలికి వెళ్లి చూసిన పోలీసులు మైండ్ బ్లాంక్ అయ్యింది
Gold Illegal Smuggling: ఎంత క్రియేటివిటి..! ఇవే తెలివితేటలు బాగుపడటానికి ఉపయోగించరు