Bigg Boss 9 Telugu: మీరూ బిగ్ బాస్‌లో పాల్గొవాలనుకుంటున్నారా? ఇలా రిజిస్టర్ చేసుకోండి.. వీడియో

సాధారణంగా బిగ్ బాస్ అంటేనే సెలబ్రిటీ షో అనే టాక్ బయట ఉంది. అయితే ఈసారి సెలబ్రిటీలతో పాటు సామాన్యులను కూడా బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకురానున్నారు. దీనికి సంబంధించి బిగ్ బాస్ నిర్వాహకులు అధికారికంగా ఓ వీడియోను రిలీజ్ చేశారు.

Bigg Boss 9 Telugu: మీరూ బిగ్ బాస్‌లో పాల్గొవాలనుకుంటున్నారా? ఇలా రిజిస్టర్ చేసుకోండి.. వీడియో
Bigg Boss Telugu Season 9

Updated on: Jun 29, 2025 | 1:05 PM

టాలీవుడ్ బుల్లితెర ప్రేక్షకుల ఫేవరెట్ టీవీ షో బిగ్ బాస్ మళ్లీ వచ్చేస్తోంది. ఇప్పటికే ఈ రియాలిటీ షో సక్సెస్ ఫుల్ గా ఎనిమిది సీజన్లను పూర్తి చేసుకోగా త్వరలోనే తొమ్మిదో సీజన్ కూడా రానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. నాగార్జుననే ఈసారి షోను హోస్ట్ చేయనున్నారు. ‘ ఈసారి చదరంగం కాదు రణరంగం’ అంటూ హోస్ట్‌గా అక్కినేని నాగార్జున పంచ్‌ డైలాగ్ బిగ్ బాస్ కొత్త సీజన్ పై ఆసక్తి పెంచింది. ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కూడా శరవేగంగా జరుగుతోంది. కాగా బిగ్ బాస్ షో అంటేనే సెలబ్రిటీల షో అని బయట టాక్ ఉంది. బుల్లితెర ప్రముఖులు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెర్లనే ఇందులోకి కంటెస్టెంట్లుగా తీసుకుంటారు. గతంలో కొన్ని సార్లు సామాన్యులను తీసుకొచ్చినా పెద్దగా వర్కవుట్ అవ్వలేదు. అయితే ఇప్పుడు బిగ్ బాస్ టీం మరోసారి సామాన్య ప్రజలకు ఒక బంపరాఫర్ ఇచ్చింది. బిగ్ బాస్ సీజన్ 9 లో మీరు కూడా పాల్గొనచ్చు అని ఓ వీడియో రిలీజ్ చేసారు.

బిగ్ బాస్ టీమ్ రిలీజ్ చేసిన లేటెస్ట్ వీడియోలో నాగార్జున మాట్లాడుతూ.. ‘ఇన్నాళ్లు మీరు బిగ్ బాస్ ని ప్రేమించారు. ఎంతో ఆదరించారు. ఇప్పుడు మేము ఆ ప్రేమాభిమానలకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాం. సెలబ్రిటీలు మాత్రమే కాదు మీకు కూడా బిగ్ బాస్ లో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నాం’ అని నాగ్ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ లోకి వెళ్లాలనుకుంటున్నారా?

బిగ్ బాస్ సీజన్ 9 లో పాల్గొనాలంటే https://bb9.jiostar.com  ఈ లింక్ లోకి వెళ్లి మీ పేరు, మొబైల్ నంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్ అవ్వాలి. అలాగే ఒక మూడు నిముషాలు మీ గురించి, మీరు ఎందుకు బిగ్ బాస్ కి హౌస్‌ లోకి వెళ్లాలనుకుంటున్నారో తెలియచేస్తూ ఒక వీడియో చేసి అప్లోడ్ చేయాలి. దీనిని బిగ్ బాస్ టీమ్ పరిశీలించి అన్ని అర్హతలు, అనువైన వాళ్లను బిగ్ బాస్ హౌస్ లోకి పంపనుంది.

బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో..

 

 

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి . .