
కళ్యాణ్ పడాల.. బిగ్ బాస్ చరిత్రలోనే ప్రత్యేక అధ్యాయం. వేలాది మందిని దాటుకుని అగ్నిపరీక్ష వరకు చేరుకున్న సోల్జర్. ఆ తర్వాత ఫస్ట్ కామనర్ గా హౌస్ లోకి అడుగుపెట్టి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. అలాగే చివరి కెప్టెన్ సైతం అతడే. తన ఆట, మాట తీరుతో అడియన్స్ హృదయాలను గెలుచుకుని చివరకు బిగ్ బాస్ సీజన్ 9 ట్రోఫీ గెలుచుకున్నాడు. అయితే బిగ్ బాస్ సీజన్ 9 ప్రైజ్ మనీ రూ.50 లక్షలు. ఇదే విషయాన్ని ఈ సీజన్ లో ఎంతో గ్రాండ్ గా ప్రకటించారు నాగార్జున. కానీ చివరకు కళ్యాణ్ ఎంత అందుకున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. బిగ్ బాస్ సీజన్ 9 ఫినాలే రూ.15 లక్షల బ్రీఫ్ కేసు తీసుకుని బయటకు వచ్చాడు డీమాన్ పవన్.
మూడో స్థానంలో ఎలిమినేటర్ అయిన డీమాన్.. రూ.15 లక్షల సూట్ కేస్ అందుకున్నాడు. ఆ తర్వాత రూ.20 లక్షలు ఆఫర్ చేయగా.. తనూజ, కళ్యాణ్ ఇద్దరూ రిజెక్ట్ చేశారు. చివరకు కళ్యాణ్ విజేతగా నిలిచి రూ.35 లక్షలు సొంతం చేసుకున్నాడు. కానీ ఇప్పుడు అతడికి వచ్చేది మొత్తం రూ.35 లక్షలు కాదట. రూ.35 లక్షలతోపాటు అతడికి ఓ కారు, మరో ఐదు లక్షల ఓచర్ అందించారు. కానీ ఆ రూ.35 లక్షల్లో అతడికి వచ్చేది కేవలం రూ.16 లక్షలు మాత్రమే.
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu : ఆ ముగ్గురికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పిన కళ్యాణ్.. తనూజ గురించి ఆసక్తికర కామెంట్స్..
ప్రైజ్ మనీ నుంచి రూ.27 లక్షలూ టాక్స్, జీఎస్టీ పేరుతో తగ్గిస్తారు. ఆ టాక్స్ అన్ని మినహాయించుకున్న తర్వాత అతడికి మిగిలిన డబ్బు అందిస్తారు. అది కూడా వెంటనే కాకుండా అగ్రిమెంట్ ప్రకారం అన్నీ పూర్తైన తర్వాతే అమౌంట్ అందిస్తారు. అన్ని టాక్స్ కట్ కాగా.. విజేతకు వచ్చేది కేవలం రూ.23 లక్షలు మాత్రమే అని సమాచారం. కళ్యాణ్ ప్రైజ్ మనీ రూ.35 లక్షలు.. అందులో జీఎస్టీ 46 శాతం మినహాయిస్తే చేతికి వచ్చేది రూ.16 లక్షలు. ఇక కారుకు కూడా జీఎస్టీ ఉంటుందట. అలాగే మరో రూ.5 లక్షల ఓచర్ కు మాత్రం జీఎస్టీ లేకపోవచ్చు అంటున్నారు. మొత్తంగా కళ్యాణ్ చేతికి వచ్చేది రూ.16 లక్షలే అంటున్నారు.
ఇవి కూడా చదవండి : Jabardasth Emmanuel : చాలా వదులుకుని బిగ్బాస్ వరకు.. విన్నర్ కావాల్సినోడు.. ఇమ్మాన్యుయేల్ రెమ్యునరేషన్ ఎంతంటే..