ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో అప్పూ చేయి కట్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు కనకానికి కల వస్తుంది. దీంతో కంగారు పడుతుంది కనకం. వెంటనే అప్పూ దగ్గరకు వెళ్లి చూస్తుంది. కానీ గదిలో అప్పూ ఉండదు. కానీ బయట కూర్చుంటుంది అప్పు. ఏంటి ఇంత రాత్రి పూట ఒంటరిగా కూర్చుంటావా.. అని కనకం అడుగుతుంది. నాకు ఇంట్లో ఈ స్వాతంత్ర్యం కూడా లేదా.. అని అప్పూ అడిగితే.. నీకు ఇష్టం వచ్చినట్లు ఉండనిచ్చాను కదా.. కాదని ఎప్పుడైనా అన్నానా అని కనకం అంటుంది. ఇక అప్పూని లోపలికి తీసుకువచ్చి పడుకోమంటుంది కనకం. ఆ తర్వాత అప్పూ దగ్గరే ఉంటుంది కనకం. ఇందాక కావ్య అక్క నాకు ఏ పనీ చెప్పదని అన్నానని బాధ పడుతున్నావా అని కనకం అడిగితే.. ఎందుకు బాధ పడతాను కావ్య అక్క అంటే నాకూ ఇష్టమే కదా అని అప్పూ అంటుంది. మీ అక్క ఉంటే నాకు కష్టం ఉండదేమో కానీ.. నువ్వు పక్కన ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది. ఒక కొడుకులా అనిపిస్తావ్. కోపంలో నిన్ను ఎప్పుడైనా ఏదైనా అంటే నన్ను వదిలేసి వెళ్లి పోవు కదా అని అనకం అనగానే.. అప్పూ బాధ పడుతుంది.
రాజ్ గదిలోకి వచ్చిన దొంగ.. తాడుతో రాజ్, కావ్యలను కట్టిపడేశాడు:
ఈ సీన్ కట్ చేస్తే.. దుగ్గిరాల ఇంట్లోకి దొంగోడు వస్తాడు. తలుపు తీసి ఉండటాన్ని గమనించి లోపలికి వస్తాడు. బెడ్ పై పడుకున్న రాజ్, కావ్యలను ఇద్దర్నీ తాడుతో కట్టేస్తాడు. ఈలో రాజ్ కదులుతాడు.. ఏంటే ఇంత దగ్గరకు వచ్చావ్ అని రాజ్ అడగ్గా.. నేనా అని ఇద్దరూ పక్కకి జరగబోతే చేతికి కట్లు ఉంటాయి. నువ్వు కట్టి పడేశావ్ అంటే నువ్వు కట్టి పడేశావ్ అని ఇద్దరూ పోట్లాడుకుంటారు. నేను కాదని రాజ్ చెప్తే.. మరి ఎవరు కట్టి పడేశారని కావ్య అంటుంది. అప్పుడే నేనే కట్టేశాను దొంగోడు చెప్తాడు. రేయ్ ఎవడివి రా నువ్వు అని రాజ్ అడిగితే.. తలుపు తీసే ఉన్నాయి కదా దేవుడు సార్ అని చెప్తాడు. అంటే నువ్వు దొంగవా అని కావ్య అంటుంది. మర్యాదగా కట్లు విప్పుతావా.. లేదా అని అడిగితే లేదు దేవుడు సార్ అని చెప్తాడు.
దొంగ కుశలాలు అడుగుతున్న కావ్య.. మండిపోతున్న రాజ్:
ఏయ్ ఉత్తప్పుడు అరుస్తావ్ కదా.. ఇప్పుడు ఏమైంది అరవడానికని రాజ్ అంటే.. ఏవండీ నేను దొంగను ఎప్పుడూ చూడలేదండి.. ఒకసారి కళ్లారా చూడనివ్వండి అని కావ్య అనగానే రాజ్ షాక్ అవుతాడు. ఆ తర్వాత కావ్య దొంగోడిని పై నుంచి కింద దాకా చూసి.. అరుస్తుంది. దీంతో దొంగ కత్తి బయటకు తీస్తాడు. కత్తితో బెదరిస్తాడు. ఈలోపు కావ్య వద్దు దొంగ అన్నయ్యా.. అని అంటుంది. దీంతో దొంగ మరోసారి అనమ్మా అని పిలవమంటాడు. ఆ తర్వాత కావ్య పిలుస్తుంది. ఇది సీజన్ కాదు కాబట్టి.. రాఖీ కట్టించుకోలేక పోతున్నా అమ్మా అని అంటాడు దొంగ. ఇక కావ్య దొంగని వదిన ఏం చేస్తుంది అని వివరాలు అడుగుతూ ఉంటుంది. హౌస్ వైఫ్ కాదమ్మా.. హౌస్ తీఫ్.. దీపావళి ఆఫర్ లో ఆడవాళ్లు పట్టు చీరలు కొంటారు కదా అవి కొట్టేయడానికి వెళ్లిందమ్మా అని దొంగ అంటాడు. వసేయ్ కుశలం కనుక్కుంటావేంటే.. వాడు అసలే దొంగ గట్టిగా అరు అంటాడు రాజ్. ఏయ్ అల్లరి చేయకండి.. మాది అసలే పరువు గల కుటుంబం అంటాడు దొంగ.
దొంగకు లేని పోని ఐడియాలు ఇచ్చిన కావ్య.. బిత్తరమొఖం వేసిన రాజ్:
అన్నయ్యా అరవకుండా ఉండాలంటే మా ఇద్దరి నోట్లో గుడ్డలు కుక్కాలి కదా అని కావ్య అంటే.. వసేయ్ వాడికి లేని పోని ఐడియాలు ఇస్తావేంటి? అని రాజ్ అంటాడు. ఏంటి దొంగ అన్నయ్య మంచి వాడిలా ఉన్నాడు. అదే ముదురు దొంగ అయితే.. గొంతు మీద కత్తి పెట్టి.. ఎందులో ఎంత ఉందో తీసుకెళ్లి పోయేవాడని కావ్య అంటుంది. వసేయ్ నోరు మూస్తావా అని రాజ్ అంటాడు. దొంగ అన్నయ్యా ఇదీ వరస.. పెళ్లిన్ని నోరు ఎత్తనివ్వడు మీ బావా అని అంటుంది కావ్య. ఇలాంటి బావతో ఎలా వేగుతున్నావ్ అమ్మా అని దొంగ అంటాడు. దొంగ అన్నయ్యా నువ్వు ఇంత మంచివాడి కదా.. ఎలా దొంగ వృత్తిలోకి వచ్చావ్ అని కావ్య అడిగితే.. పెళ్లి అయ్యిందమ్మా.. పట్టు చీరలు, నగలు, ఇంటిలో సామాను కొనివ్వకపోతే ఉరి వేసుకుని చచ్చిపోతా అంది. అందుకే ఇలా దొంగగా మారాల్సి వచ్చింది.
నగలు, డబ్బు ఎక్కడ పెట్టారమ్మా అని అమాయకంగా అడిగిన దొంగ:
ఇప్పుడు చెప్పు బావా ఎక్కడ ఎంత ఉంది అని దొంగ అడిగితే.. బ్యాంకులో ఉన్నాయని రాజ్ చెప్తాడు. ఇక్కడ ఎంత ఉంది అని దొంగ అడిగితే.. 22, 23 ఉంటాయి. ఏంటి లక్షలా.. కాదు రూపాయలు అని అంటాడు రాజ్. నీకంటే నేనే బెటర్ కదా బావా పర్సులో 10 వేల కంటే తక్కువ ఉండవని దొంగ అంటాడు. నువ్వు చెల్లెమ్మా.. నగలు ఎక్కడ ఉన్నాయి? అని అడిగితే.. బ్యాంకులో నుంచి తెచ్చిన నగల్ని మళ్లీ బ్యాంకులోనే పెట్టేశాడని కావ్య చెప్తుంది. నువ్వేం చేస్తావ్ లేమ్మా ఇలాంటి మొగుడు ఉంటే చీర మడతల్లో చిల్లర కూడా మిగలదని అంటాడు. వీళ్ల మాటలకు రాజ్ ఏం చేయాలో తెలీక చూస్తూ ఉంటాడు. ఈ సీన్స్ నిజంగానే కడుపుబ్బా నవ్విస్తాయి.
స్వైపింగ్ మిషన్ మెయింటైన్ చేస్తున్న దొంగ.. బిత్తరపోయిన కావ్య, రాజ్ లు:
ఇక పర్సులో క్రెడిట్ కార్డు దొరుకుతుంది. ఇది కావాలంటే స్వైపింగ్ మిషన్ కావాలి కాద అని దొంగ అడిగితే.. నేను అప్ డేట్ అయ్యాను బావా అని స్వైపింగ్ మిషన్ బయట పెడతాడు దొంగ. పిన్ నెంబర్ చెప్పమని రాజ్ ని బ్రతిమలాడతాడు దొంగ. అలా ఆయన్ని బ్రతిమలాడతావేంటి? అన్నయ్యా.. వైఫైలో రూ.5 వేలు లాగేయవచ్చు అని చెప్తుంది. వెంటనే రాజ్ వసేయ్ నువ్వు నా పెళ్లానివా.. దొంగకు సిస్టర్ వా అని అంటాడు . ఏంటి ఏమన్నారు? అని అడుగుతుంది కావ్య. ఇదిగో బావా కార్డు ఉంచుకో.. సచ్చినోడికి వచ్చిందే కట్నం అని సరిపెట్టుకోవాలి అని అంటాడు దొంగ. చూసి జాగ్రత్తగా వెళ్లు దొంగ అన్నయ్య.. పై నుంచి దూకి కాళ్లూ చేతులు విరగొట్టుకోకు. పక్కన మెట్లు ఉన్నాయి చూసి వెళ్లు అని చెప్తుంది కావ్య. చెప్పవే ఇంటి ప్లాన్ మొత్తం చెప్పేయ్.. మా అమ్మ రూమ్, మా తాతయ్య రూమ్ ఎక్కడ ఉంది అన్నీ చెప్పు అంటాడు రాజ్.
అమ్మబాబోయ్ కళావతికి ఎన్ని తెలివితేటలో..
బావా అరవకు అంతా లేస్తారు. వస్తాను చెల్లెమ్మా అని దొంగ వెళ్తాడు. వదిన్ని కూడా అడిగా అని చెప్పు అని అంటుంది కావ్య. ఇక కట్లు విప్పమని దొంగని అడుగుతాడు రాజ్.. ఏవంటి కట్లు విప్పేస్తే మనం పట్టుకుంటామని ఆ మాత్రం లాజిక్ కూడా తెలీదా ఆ దొంగకి అని అంటుంది కావ్య. లాజిక్ అని చెప్పి వెళ్లి పోతాడు దొంగ. వసేయ్ తల కొట్టుకుందామన్నా చేయి రావడం లేదని రాజ్ బాధ పడుతూ ఉంటాడు. నేను బీరువాలో ఉన్న నగల గురించి.. డ్రాలో ఉన్న నోట్ల కట్టల గురించి చెప్పానా.. ఐదు వేలతో సింపుల్ గా వదిలించేశాను.. ఎలా ఉంది నా తెలివి అని అంటుంది కావ్య. నీ మొహంలా ఉంది అని అంటాడు రాజ్. అయితే బావుంటుందిలెండి. ఏవండీ ఇలానే బావుంది పడుకోండి అని అంటుంది కావ్య. నీకు బావుందేమో.. నాకు బాలేదు అని అంటాడు రాజ్. అయితే ఈ రాత్రికి ఇలా పడుకోవాల్సిందే అని ఇద్దరూ పడుకుంటారు.
రాహుల్ ని ఇరికించేద్దాం అని స్వప్న భారీ ప్లాన్:
నెక్ట్స్ అరుణ్ గురించి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇదంతా రాహుల్ పక్క నుంచి చూస్తూ ఉంటాడు. పోనీ కావ్యని అడుగుదామంటే.. దాని నామీద పీకల్లోతు కోపంగా ఉందని అనుకుంటుంది. అవును తాతయ్య ఇచ్చిన నగలు ఉన్నాయి కదా.. వాటిని తాకట్టు పెడితే పది లక్షలు వస్తాయి. మల్లీ ఇంట్లో నగల గురించి అడిగితే నేనేం చెప్పాలి. అయినా ఒకసారి రాహుల్ నగలను తీసుకెళ్ల పోయాడు కదా.. మరీ అంతగా అవసరం అయితే రాహులే తీసుకెళ్లాడని అబద్ధం చెప్పేద్దాం అని అనుకుంటుంది. ఇదే కరెక్ట్ అని నగలను అమ్మడానికి రెడీ అవుతుంది స్వప్న. మరో వైపు ఇదంతా విన్న రాహుల్ షాక్ అవుతాడు.