Bigg Boss Telugu 9: క్లారిటీ వచ్చేసింది.. బిగ్ బాస్ టాప్-5 కంటెస్టెంట్స్ వీళ్లే.. ఈ వారం ఎలిమినేట్ ఎవరంటే?

బిగ్ బాస్ సీజన్ 9 టాప్- 5 కంటెస్టెంట్స్ లెక్కలు ఆసక్తికరంగా మారాయి. టాప్ లో ఉన్న వాళ్లు అనూహ్యంగా డేంజర్ జోన్ లోకి వెళ్లిపోయారు. అలాగే లీస్ట్ లో ఉన్న కంటెస్టెంట్స్ అనూహ్యంగా టాప్ లోకి వచ్చేశారు. మొత్తానికి టాప్-5 కంటెస్టెంట్స్ పై ఓ క్లారిటీ వచ్చేసింది.

Bigg Boss Telugu 9: క్లారిటీ వచ్చేసింది.. బిగ్ బాస్ టాప్-5 కంటెస్టెంట్స్ వీళ్లే.. ఈ వారం ఎలిమినేట్ ఎవరంటే?
Bigg Boss Telugu 9

Updated on: Dec 06, 2025 | 7:14 AM

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా అలరిస్తోన్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 దాదాపు తుది అంకానికి వచ్చేసింది. సుమారు మూడు నెలలుగా కొనసాగుతోన్న ఈ రియాలిటీ షోకు మరికొన్ని రోజుల్లో ఎండ్ కార్డ్ పడనుంది. దీంతో ప్రస్తుతం ఎక్కడ చూసినా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేపైనే చర్చ నడుస్తోంది. బిగ్ బాస్ టాప్- ఫైనలిస్ట్ లో ఎవరు ఉంటారు? విన్నర్ ఎవరు? రన్నర్ ఎవరు? ఈ వారం ఎవరు ఎలిమెంట్ అయ్యి బయటకు వెళ్తారు? అన్నది ఆసక్తిగా మారింది. సోషల్ మీడియాలోనూ ఈ విషయాలపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం హౌస్ లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ వారం ఎలిమినేషన్స్ కు సంబంధించి ఆరుగురు నామినేషన్స్ లో ఉన్నారు. తనూజ, డిమాన్ పవన్, భరణి శంకర్, రీతూ చౌదరి, సుమన్ శెట్టి, సంజనా గల్రానీ నామినేషన్స్ లో నిలిచారు. వీరికి ఆన్ లైన్ ఓటింగ్ లైన్స్ కూడా క్లోజ్ అయ్యాయి. ఎప్పటిలాగే తనూజ ఓటింగ్ లో తుక్కురేగ్గొట్టింది. టాప్ ప్లేస్ ను కైవసం చేసుకుంది. ఇక తనూజ తర్వాతి స్థానం రీతూ చౌదరిదే. ఆమె ఓటింగ్ పర్సంటేజ్ బాగా పెరిగింది. ఇక మొన్నటివరకు లీస్ట్ లో ఉన్న భరణి ఇప్పుడు టాప్-3లోకి వచ్చేశాడు.

ఇక నాలుగో ప్లేస్ లో డిమాన్ పవన్ ఉండగా, ఐదో పొజిషన్ లో సుమన్ శెట్టి ఉన్నాడు. మొన్నటివరకు టాప్-3లో ఉన్న సంజనా గల్రానీ ఇప్పుడు అనూహ్యంగా డేంజర్ జోన్ లోకి వచ్చేసింది. ఈ వారం టాస్క్ ల్లో ఆమె గట్టిగానే పోరాడినా పెద్దగా ఫలితం కనిపించలేదు. ఇది ఆమె ఓటింగ్ పై ప్రతికూల ప్రభావం చూపించనట్లు కనిపిస్తోంది. అయితే ఈ వారం సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఇక ప్రజెంట్ ట్రెండింగ్స్ ను చూస్తే.. మొత్తం 8 ఎనిమిది కంటెస్టెంట్స్ లో టాప్-5 కంటెస్టెంట్స్ పై ఒక ఫుల్ క్లారిటీ వచ్చేసింది. కళ్యాణ్ పడాల, తనూజ, ఇమ్మానుయేల్, రీతూ చౌదరి, భరణి శంకర్ లు టాప్ 5లో నిలుస్తారని తెలుస్తోంది. డిమాన్ పవన్ కు కూడా ఇందులో ఛాన్స్ ఉంది. అయితే అందుకోసం అతను చాలా కష్టపడాల్సి ఉంది.

బిగ్ బాస్ లేటెస్ట్ ప్రోమో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.