Bigg Boss 6: సూట్ కేస్ ఆఫర్ తీసుకుని బయటకు వచ్చేది ఆ కంటెస్టెంటే..! ఎందుకంటే

|

Dec 17, 2022 | 6:02 PM

ఈ సీజన్‌లో విన్నర్ ప్రైజ్ మనీ రూ.50 లక్షలు ఉండగా.. సువర్ణభూమి వారి ప్లాట్ ఖరీదు రూ.25 లక్షలు.. దీంతో పాటు బ్రీజా కారు కూడా వస్తుంది. అయితే ఇక్కడ సూట్ కేసు ఆఫర్ గురించి మనం మాట్లాడుకోవాలి.

Bigg Boss 6:  సూట్ కేస్ ఆఫర్ తీసుకుని బయటకు వచ్చేది ఆ కంటెస్టెంటే..! ఎందుకంటే
Keerthi Bhat, Adi Reddy , LV Revanth
Follow us on

స్టార్ మా ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 6 గ్రాండ్ ఫినాలే ఆదివారం, డిసెంబర్ 18న జరగనుంది. ఈ సీజన్ ప్రేక్షకులను పెద్ద ఆకట్టుకోలేదనే చెప్పాలి. ట్రోఫీని కైవసం చేసుకునేందుకు సింగర్ రేవంత్, రోహిత్ సాహ్ని, ఆది రెడ్డి, శ్రీహాన్,  కీర్తి భట్ ఐదుగురు ఫైనలిస్టులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. మిడ్ వీక్ ఎలిమినేషన్‌ రూపంలో శ్రీ సత్య తాజాగా బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రజంట్ హౌస్‌లో ఉన్న ఫైనలిస్టుల్లో అందరికీ కొన్ని ప్లస్‌లు, కొన్ని మైనస్‌లు ఉన్నాయి. డబ్బుతో కూడిన బ్రీఫ్‌కేస్ ఆఫర్ బిగ్ బాస్‌ ఫినాలే రోజు మోస్ట్ ఇంట్రస్టింగ్ టాస్క్. ఈ సంవత్సరం కూడా ఐదుగురు ఫైనలిస్ట్‌లకు ఈ ఆఫర్ అందజేయనున్నారు హోస్ట్ నాగార్జున. ఈ ఆఫర్‌ను ఎవరు ఎంచుకుంటే వారు.. డబ్బుతో బిగ్ బాస్ ఇంటి నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. ఈ బ్రీఫ్‌కేస్‌లో రూ. 25 లక్షలు ఉంటుంది.  అది విన్నర్ ప్రైజ్ 50 లక్షల్లో సగం అన్నమాట. కాగా విన్నర్ ప్రైజ్ మనీ నుంచే కోత పెట్టి ఈ సూట్ కేసు ఆఫర్ ఇస్తారు.

ఆదిరెడ్డి బ్రీఫ్‌కేస్‌తో బయటకు వచ్చేస్తాడా..?

ఇప్పుడు, టాప్ 5లోని ఏ కంటెస్టెంట్ ఈ స్మార్ట్ మూవ్ చేస్తారో తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సామాన్యుడిగా షోలోకి అడుగుపెట్టిన ఆది రెడ్డి బిగ్ బాస్ తెలుగు 6 టైటిల్ కంటే డబ్బు ఉన్న బ్రీఫ్‌కేస్‌ను ఎంచుకుంటాడని బజ్ ఉంది. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్‌లో క్యాష్ బ్యాగ్‌తో ఆది రెడ్డి ఇంటి నుండి బయటకు వచ్చే అవకాశం ఉంది. సామాన్యుడిగా బిగ్ బాస్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆదిరెడ్డి.. తన ప్రవర్తన, మాట తీరుతో ప్రేక్షకులు హృదయాలను గెలుచుకున్నాడు. అద్భుతమైన ఆటతీరుతో ఫినాలే వరకు వచ్చాడు.

ఒకవేళ ఆదిరెడ్డి బ్రీఫ్‌కేస్‌ ఆపర్ స్వీకరించకపోతే..  25 లక్షలు మిస్ అయ్యే చాన్స్ ఉంది. ఇది ఒక సామాన్య వ్యక్తిగా అతనికి పెద్ద అమౌంట్.  రేవంత్, శ్రీహాన్ రూపంలో భారీ కాంపిటేషన్ ఉంది. సో.. తెలివిగా ఆలోచించే ఆదిరెడ్డి.. ఈ ఆఫర్ వినియోగించుకుంటాడనే బజ్ ఉంది. గతంలో బిగ్ బాస్ ఓటీటీలో రూ.10 లక్షల సూట్ కేసు తీసుకుని బయటకు వచ్చేసింది ఫైనలిస్ట్ అరియానా. సీజన్ 4లో రూ.25 లక్షల సూట్ కేసు తీసుకుని బయటకు వచ్చేశాడు సొహైల్‌.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.