Bigg Boss 6 Telugu: ఇనయ పై మాటలతోనే రెచ్చిపోయిన గీతూ.. సంస్కారమంటూ కౌంటరిచ్చిన చంటి.. ఈవారం నామినేషన్స్ హీట్ మాములుగా లేదుగా..

|

Sep 19, 2022 | 4:42 PM

అలాగే ఆది రెడ్డి వర్సెస్ ఇనయ.. గీతూ వర్సెస్ చంటి కౌంటర్స్, రీకౌంటర్స్ అయ్యాయి. తాజాగా విడుదలై ప్రోమో చివరలో సుదీప ఎమోషనల్ అవుతూ నా పేగు బంధం.. బాధ నాది అంటూ గీతూ గలాటను నామినేట్ చేసింది.

Bigg Boss 6 Telugu: ఇనయ పై మాటలతోనే రెచ్చిపోయిన గీతూ.. సంస్కారమంటూ కౌంటరిచ్చిన చంటి.. ఈవారం నామినేషన్స్ హీట్ మాములుగా లేదుగా..
Bigg Boss Promo
Follow us on

బిగ్ బాస్ సీజన్ 6 మూడో వారం నామినేషన్స్ హీట్ మొదలైంది(Bigg Boss 6 Telugu). గత వారం డబుల్ ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా షాని, అభినయ శ్రీ ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా విడుదలైన ప్రోమో చూస్తుంటే మూడో వారం ఇంట్లో నామినేషన్స్ రచ్చ కాస్త ఎక్కువగానే నడిచినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గీతూ గలాట, ఇనయ సుల్తానా, ఆదిరెడ్డి, చంటి మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం నడిచినట్లుగా కనిపిస్తుంది. దొబ్బెయ్..సంస్కారం అంటూ ఒకరినొకరు దూషించుకున్నట్లు తెలుస్తోంది. అలాగే ఆది రెడ్డి వర్సెస్ ఇనయ.. గీతూ వర్సెస్ చంటి కౌంటర్స్, రీకౌంటర్స్ అయ్యాయి. తాజాగా విడుదలై ప్రోమో చివరలో సుదీప ఎమోషనల్ అవుతూ నా పేగు బంధం.. బాధ నాది అంటూ గీతూ గలాటను నామినేట్ చేసింది.

ఇక ముందుగా సత్య ఇనయను నామినేట్ చేయగా.. గేమ్ ఆడటమే నీకు ఇంట్రెస్ట్ లేదు.. తినడం.. కూర్చోని ముచ్చట్లు చెప్పడం మాత్రమే నీకు ద్యాస ఉంది.. అది నా ఇష్టం అంటూ సత్య కౌంటర్ వేయగా.. సిల్లి రీజన్.. సిల్లి నామినేషన్స్ అని ఇనయ అనగా.. అందరికీ తెలుసు సెటైర్ వేసింది సత్య. ఇక ఆ తర్వాత ప్రాక్టీస్ వాట్ యూ ప్రీచ్ అనే కారణంతో లాస్ట్ వీక్ నన్ను నామినేట్ చేశావు.. అది నాకు నచ్చలేదంటూ సుదీపను నామినేట్ చేసింది గీతు. ఆ కారణంతో నన్ను నామినేట్ చేశావంటే నా బుద్ది ఎక్కడుందో అర్థమవుతుంది అని అనేసింది సుదీప. అలాగే.. ఒకరు పెద్ద అనే కారణంతో రెస్పెక్ట్ ఇవ్వను అని గీతూ అనగా.. మనం పది మందిలో ఉన్నప్పుడు కొంచెం సంస్కారంగా బిహేవ్ చేయాలంటూ చంటి కౌంటర్స్ వేశారు. దీంతు ముందు నీది చూసుకో.. ఆ తర్వాత నాకు చెప్పు అని గీతూ అనగా.. నువ్వ అలా అనకపోయి ఉంటే నేను
ఈ డైలాగ్ అనేవాడిని కాదంటూ కౌంటరిచ్చాడు చంటి. నాకు తీటనా అందరితో ఆర్గ్యూమెంట్లు పెట్టుకోవడానికి అంటూ రెచ్చిపోయింది గీతూ. ఇక ఇనయ, గీతూ మధ్య జరిగిన డైలాగ్ వార్‏లో చివరకు దొబ్బెయ్ అంటూ ఇనయ పై మాటలు జారింది గీతూ. ఆ తర్వాత ఆదిరెడ్డి.. ఇనయ మధ్య సైతం మరోసారి మాటల యుద్దం నడిచింది. మొత్తానికి మూడో వారం నామినేషన్స్ రచ్చ ఓ రెంజ్‏లో జరిగినట్లుగా తెలుస్తోంది. ఈ వారం బాలాదిత్య, గీతూ, ఆరోహి, ఇనయ, వాసంతి, సుదీప, నేహ, చంటి నామినేట్ అయినట్లుగా సమాచారం.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లి్క్ చేయండి.