ప్రేమ, పెళ్లి, విడాకులు, బ్రేకప్ ఈ మాటలు ఇప్పుడు చాలా కామన్. ముఖ్యంగా సెలబ్రెటీల జీవితాల్లో ఈ మాటలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. గత రెండు మూడు సంవత్సరాలు సౌత్ టూ నార్త్ ఇండస్ట్రీలలో చాలా జంటలు తమ బంధానికి ముగింపు పలికాయి. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పుడు వరుసగా పెళ్లి భజాలు మోగుతున్నాయి. మరోవైపు ప్రేమపక్షులు బ్రేకప్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తాజాగా మరో లవ్ బర్డ్స్ బ్రేకప్ చెప్పుకున్నారనే వార్త బాలీవుడ్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షోలో మొదలైన ఆ ఇద్దరి ప్రేమయాణం ఇప్పుడు ముగిసిందని అంటున్నారు. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరంటే బిగ్ బాస్ సీజన్ 17తో ఫేమస్ అయిన సమర్ద్ జురెల్, ఇషా మాల్వియా. గతేడాది హౌస్ లో వీరిద్దరి ప్రేమ పెద్ద సంచలనమే సృష్టించింది. వీరిద్దరి తీరుపై అనేక విమర్శలు వచ్చాయి. అలాగే ఈ షోలో తన ప్రేమ, ప్రవర్తనతో పూర్తిగా నెగిటివీటిని తెచ్చుకుంది ఇషా. అప్పటివరకు ఉన్న క్రేజ్ కూడా క్షణాల్లో ఆవిరైపోయింది. ఎందుకంటే అదే షోలో ఇషా మాజీ ప్రియుడు అభిషేక్ కుమార్ కూడా ఉండడం.
ఇషా, సమర్థ్ ఇద్దరూ ఉదరియన్ అనే సీరియల్లో కలిసి నటించారు. అదే సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైందని టాక్ నడిచింది. ఇక తమ ప్రేమ విషయాన్ని బిగ్ బాస్ హౌస్ లో సల్మాన్ ఖాన్ ముందు కన్ఫా్ర్మ్ చేశారు. ఇక హౌస్ లో వీరిద్దరి ప్రవర్తనపై అడియన్స్ మండిపడ్డారు. బిగ్ బాస్ రియాల్టీ షోను వీరు అసభ్యకరంగా మార్చేశారని విమర్శలు వచ్చాయి. ఇక హౌస్ లో మాజీ ప్రియుడు అభిషేక్ కుమార్ పై ఇషా ప్రవర్తన కూడా ఆమెపై నెగిటివిటీని పెంచేసింది. అయితే హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇషా, సమర్థ్ బ్రేకప్ వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. కానీ ఇప్పటివరకు వీరిద్దరు ఈ రూమర్స్ పై స్పందించలేదు.
మంగళవారం ఇషా మాల్వియా, సమర్థ్ జురెల్ ఇన్ స్టాలో ఒకరినొకరు అన్ ఫాలో చేయడంతో మరోసారి బ్రేకప్ రూమర్స్ తెరపైకి వచ్చాయి. ఇక వీరిద్దరు విడిపోయినట్లు ధృవీకరించాయి సన్నిహిత వర్గాలు. అలాగే బ్రేకప్ పుకార్లపై ఇషా లేదా సమర్థ్ ఎవరూ స్పందించలేదు.
#SamarthJurel and #IshaMalviya breakup 😱 both unfollowed eachother on instagram. #AbhishekKumar ne sahi bola tha😂 pic.twitter.com/66EJH47Wws
— The Khabri (@TheKhabriTweets) April 16, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.