బిగ్ బాస్ నాల్గో సీజన్ కంటెస్టెంట్లందరికి మంచి గుర్తింపే వచ్చింది. బిగ్ బాస్ ఇంట్లో ఉన్నది ఎన్ని రోజులు అనే విషయం పక్కన పెడితే ప్రతీ ఒక్కరూ తమ కంటే ఓ ప్రత్యేకముద్రను వేయించుకునే వెళ్లారు. అలా మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన కుమార్ సాయి మధ్యలోనే వెళ్లిపోయాడు. అయితే ఆయన ఎలిమినేషన్ కూడా అందరికీ ఆశ్చర్యమే. సోదరా.. అప్పటి వరకు ఈ పదం కేవలం అలనాటి పౌరాణిక సినిమాల్లో ఎక్కువగా వింటుండేవాళ్ళం.. కానీ ప్రస్తుతం సోదరా అనే పదం యూత్ బాగా కనెక్ట్ అయిపోయింది. ముఖ్యంగా సోదరా అనగానే గుర్తుకువచ్చేది తెలుగు బిగ్ బాస్ కంటెస్టెంట్ కుమార్ సాయి గుర్తుకువస్తాడు. హౌస్‌లో అడుగు పెట్టిన మొదట్లో ఎవరితో కలవకుండా ఒంటరిగా ఉంటూ వచ్చాడు కుమార్ సాయి. ఆ తర్వాత తన ఆటలో మార్పు తీసుకువస్తూ.. అందరిని సోదరా అంటూ పిలుస్తూ.. నిజాయితిగా గేమ్ ఆడుతూ వచ్చాడు. కానీ తక్కువ సమయంలోనే హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి అందరికి షాక్ ఇచ్చాడు. ఇక కుమార్ సాయి ఇంట్లో ఉన్నప్పుడు తను ప్రతిసారి వాడిన సోదరా పదం మాత్రం ఇప్పటీకి యూత్ ఉపయోగిస్తూనే ఉన్నారు. తాజాగా కుమార్ సాయి.. తన తోటి కంటెస్టెంట్‌తో కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ హౌస్ నుంచి బయటకు వచ్చాక.. పార్టీలు, సెలబ్రెషన్స్ అంటూ ఎప్పుడూ కలుస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే కుమార్ సాయి, లాస్య కలిసి నాని గ్యాంగ్ లీడర్ సినిమాలోని గ్యాంగ్ గ్యాంగ్ అనే పాటకు స్టెప్పులేసారు. ఈ వీడియోను లాస్య తన ఇన్ స్టాలో షేర్ చేస్తూ.. సోదరాతో స్టెప్పులు అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇదిలా ఉండగా.. త్వరలోనే బిగ్ బాస్ 5 సీజన్ మొదలు కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే సీజన్ 5 కోసం మొత్తం 60 మంది కంటెస్టెంట్స్ సెలక్షన్ జరిగిపోయినట్లుగా.. మరికొంత మందిని ఎంపిక చేసే పనిలో మేకర్స్ ఉన్నట్లుగా సమాచారం.
Also Read:
కన్నడ స్టార్ హీరోతో సినిమా చేయనున్న ప్రభాస్ డైరెక్టర్.. త్వరలోనే షూటింగ్ స్టార్ట్…