Emmanuel : నా వల్లే సంజనకు ఓట్లు పడ్డాయి.. నాకు అర్థమయ్యేసరికి పది వారాలు పట్టింది.. ఇమ్మాన్యుయేల్..

దాదాపు 105 రోజులు బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న రియాల్టీ షో బిగ్ బాస్. కానీ ఈసారి సీజన్ 9 అంటే ముందుగా గుర్తొచ్చే పేరు ఇమ్మాన్యుయేల్. అంతగా తన కామెడీ టైమింగ్ తో ప్రతి క్షణం ప్రేక్షకులను, హౌస్మేట్స్ ను నవ్వించాడు. నిజానికి ఇమ్మాన్యుయేల్ లేకపోతే సీజన్ 9 ఇంతగా హిట్టయ్యేది కాదేమో అన్నట్లుగా తన ఆట తీరుతో అలరించాడు ఇమ్మూ.

Emmanuel : నా వల్లే సంజనకు ఓట్లు పడ్డాయి.. నాకు అర్థమయ్యేసరికి పది వారాలు పట్టింది.. ఇమ్మాన్యుయేల్..
Emmanuel

Updated on: Dec 25, 2025 | 1:00 PM

బిగ్ బాస్ సీజన్ 9 ముగిసింది. కామనర్ గా అడుగుపెట్టిన కళ్యాణ్ పడాల విజేతగా నిలిచాడు. రన్నరప్ గా తనూజ నిలవగా.. విన్నర్ కావాల్సిన ఇమ్మాన్యుయేల్ చివరకు నాలుగో స్థానంలో ఎలిమినేట్ అయ్యాడు. ఇమ్మూ ఎలిమినేషన్ హౌస్మేట్స్ తోపాటు అడియన్స్ సైతం షాకయ్యారు. నిజానికి ఈ షో ఇంతగా హిట్ కావడానికి కారణం ఇమ్మాన్యూయేల్ అనడంలో సందేహం లేదు. ప్రతి సందర్భంలో తన కామెడీ టైమింగ్ పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాడు ఇమ్మూ. బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయిన తర్వాత శివాజీ హోస్ట్ చేస్తున్న బజ్ షోలో పాల్గొన్నాడు. ఇందుకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేయగా.. ఈ షోలో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. రావడంతోనే ఇమ్మూకు లాఫింగ్ బుద్దను అందించాడు శివాజీ.

ఇవి కూడా చదవండి : Actor: ఒక్క సినిమాతోనే అమ్మాయిల డ్రీమ్ బాయ్‏గా.. వరుస హిట్లకు కేరాఫ్ అడ్రస్ ఈ హీరో.. క్రేజ్ చూస్తే..

విన్నర్ అవుతావని అనుకుంటే ఇలా బయటకొచ్చేసావేంట్రా అని శివాజీ అడగ్గా.. నేను అనుకున్నాని ఆన్సర్ ఇచ్చాడు. హౌస్ లో ప్రతి విషయాన్ని తప్పుగానే చూడాలని తెలుసుకునేసరికి. ఎవరు ఎలాంటి వాళ్లు అనేది తెలుసుకోవడానికి తనకు 10 వారాలు పట్టిందని అన్నారు. బిగ్ బాస్ హౌస్ లో కామెడీ చేయడం అంత సులభం కాదు.. నామినేషన్స్ టైంలో హౌస్మేట్స్ కోపంగా ఉంటారు. ఆ టైంలో మనం ఏం మాట్లాడినా తప్పే అవుతుంది అంటూ చెప్పుకొచ్చాడు ఇమ్మాన్యూయేల్. నా వంతు ఎంటర్టైన్ మాత్రం చేసాను అని అన్నాడు. నీ కంటే ఎక్కువగా మీ అమ్మ పాపులర్ అయ్యింది. మమ్మతో స్నేహం ప్లస్ అయ్యిందా ?మైనస్ అయ్యిందా? అడగ్గా మైనస్ అయ్యిందని అన్నారు ఇమ్మూ.

ఇవి కూడా చదవండి : Director: సక్సెస్ అంటే ఇది.. ఒకప్పుడు లారీ డ్రైవర్.. ఇప్పుడు గొప్ప డైరెక్టర్.. ఒక్క ప్లాపు లేని దర్శకుడు..

పదివారాలు తాను నామినేషన్లలోకి రాకపోవడంతో తన ఫ్యాన్స్ సైతం సంజనకు ఓట్లు వేశారని చెప్పుకొచ్చాడు. అలాగే ఇమ్మాన్యుయేల్ గర్ల్ ఫ్రెండ్ గురించి ప్రస్తావిస్తూ ఆటపట్టించాడు శివాజీ. మొత్తానికి బిగ్ బాస్ బజ్ లో ఇమ్మూ పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టినట్లు ప్రోమోలో చూస్తుంటే తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి : 1000కి పైగా సినిమాలు.. సిల్క్ స్మిత కంటే ముందే ఇండస్ట్రీని శాసించిన హీరోయిన్.. చివరి రోజుల్లో ఎంతగా బాధపడిందంటే..

ఇవి కూడా చదవండి : Actress Srilakshmi : 500లకు పైగా సినిమాలు.. ఈ నటి మేనకోడలు తెలుగులో క్రేజీ హీరోయిన్.. 300 కోట్లు కొల్లగొట్టింది..