Bigg Boss 8 Telugu: బిగ్‏బాస్ మూడో వారం ఓటింగ్.. డేంజర్ జోన్‏లో ఊహించని కంటెస్టెంట్.. ఎలిమినేట్ తప్పదా?

|

Sep 19, 2024 | 1:48 PM

ఇక ఈ వారం డేంజర్ జోన్ లో మరోసారి అబ్బాయిలు ఉన్నారు. మూడో వారం ఓటింగ్ లో లెక్కలు మారుతున్నారు. ఈసారి ఇద్దరు అబ్బాయిలకు ఓటింగ్ తక్కువ వస్తున్నట్లు తెలుస్తోంది. ఈవారం మొత్తం 8 మంది నామినేషన్స్ లో ఉన్నారు. నాగ మణికంఠ, యష్మి, సీత, నైనిక, పృథ్వీరాజ్, విష్ణుప్రియ, అభయ్ నవీన్ ఉన్నారు. చీఫ్ అయినప్పటికీ ఎవరో ఒకరు నామినేట్ కావాలని బిగ్‏బాస్ అదేశించగా అభయ్ నవీన్ నామినేట్ అయ్యాడు.

Bigg Boss 8 Telugu: బిగ్‏బాస్ మూడో వారం ఓటింగ్.. డేంజర్ జోన్‏లో ఊహించని కంటెస్టెంట్.. ఎలిమినేట్ తప్పదా?
Bigg Boss 8 Telugu Eliminat
Follow us on

బిగ్‏బాస్ సీజన్ 8 విజయవంతంగా మూడో వారానికి వచ్చేసింది. హౌస్ లో నిన్నటి నుంచి ప్రభావతి 2.0 టాస్కు ఓ రేంజ్ లో జరుగుతుంది. నిఖిల్ వర్సెస్ అభయ్ టీం ఈ టాస్కులో పోటాపోటీగా ఆడుతున్నారు. కంటెస్టెంట్స్ బిహేవియర్.. ఆట తీరుపై ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గేమ్ కోసం ప్రతి ఒక్కరు కొట్టుకున్నంత పనిచేస్తున్నారని ఫైర్ అవుతున్నారు. ఇక ఇదిలా ఉంటే మూడో వారం ఓటింగ్ ప్రక్రియ ముగియడానికి ఇంకా రెండు రోజులే సమయం ఉంది. రేపటితో ఓటింగ్ లైన్స్ క్లోజ్ కానున్నాయి. దీంతో నామినేషన్లలో ఉన్న తమ కంటెస్టెంట్స్ ను కాపాడుకోవడానికి ఫ్యాన్స్ తెగ ట్రై చేస్తున్నారు. బిగ్‏బాస్ ఫస్ట్ వీక్ బెజవాడ బేబక్క ఎలిమినేట్ కాగా.. రెండో వారం ఎలిమినేషన్ కు అందరూ షాకయ్యారు. గతవారం ఊహించని విధంగా శేఖర్ భాషా బయటకు రావడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు.

నిజానికి శేఖర్ భాషా కాకుండా గతవారం పృథ్వీ ఎలిమినేట్ కావాల్సింది. లాస్ట్ వీక్ ఓటింగ్ ప్రకారం పృథ్వీకి అందరి కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. కానీ తన కొడుకును చూడాలనే ఆశతో శేఖర్ భాషా కావాలని బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ వారం డేంజర్ జోన్ లో మరోసారి అబ్బాయిలు ఉన్నారు. మూడో వారం ఓటింగ్ లో లెక్కలు మారుతున్నారు. ఈసారి ఇద్దరు అబ్బాయిలకు ఓటింగ్ తక్కువ వస్తున్నట్లు తెలుస్తోంది. ఈవారం మొత్తం 8 మంది నామినేషన్స్ లో ఉన్నారు. నాగ మణికంఠ, యష్మి, సీత, నైనిక, పృథ్వీరాజ్, విష్ణుప్రియ, అభయ్ నవీన్ ఉన్నారు. చీఫ్ అయినప్పటికీ ఎవరో ఒకరు నామినేట్ కావాలని బిగ్‏బాస్ అదేశించగా అభయ్ నవీన్ నామినేట్ అయ్యాడు.

అయితే ఇప్పుడు అభయ నవీన్ డేంజర్ జోన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అతడితోపాటు పృథ్వీ కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నాడు. ఇప్పటివరకు వివిధ ఓటింగ్ ప్లాట్ ఫామ్స్ లో పృథ్వీకి, అభయ్ నవీన్ కు తక్కువ శాతం ఓటింగ్ వచ్చినట్లు తెలుస్తోంది. వీరిద్దరి చివరి స్థానంలో పృథ్వీ ఉన్నాడు. కానీ ఈసారి కూడా బిగ్‏బాస్ పృథ్వీని ఎలిమినేట్ చేయకుండా ఈసారి అభయ్ ను బయటకు పంపనున్నారనే టాక్ నెట్టింట నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే హౌస్ లో లవ్ స్టోరీ నడిపేందుకు తెగ ట్రై చేస్తున్నాడు పృథ్వీ. అలాగే టాస్కులలో శ్రుతిమించి ప్రవర్తించడం.. బూతులు మాట్లాడుతూ హౌస్మేట్స్ పై రెచ్చిపోతూ కెమెరాకు కావాల్సినంత కంటెంట్ ఇస్తున్నాడు. అందుకే అతడికి బదులుగా మరో కంటెస్టెంట్ ను బలి చేయడం ఖాయమంటున్నారు నెటిజన్స్. ఇప్పటికే అభయ్ చీఫ్ పోస్ట్ కూడా బిగ్ బాస్ తొలగించాడు.  అలాగే సోనియా, నిఖిల్, పృథ్వీ ఈ ముగ్గురితో బిగ్‏బాస్ కు కావాల్సినంత కంటెంట్ వస్తుంది.. కాబట్టి ఈ ముగ్గురు మరికొన్ని వారాలు హౌస్ లో ఉంటారని అంటున్నారు నెటిజన్స్. ఓటింగ్ ప్రకారం మాత్రం పృథ్వీ అందరి కంటే చివరి స్థానంలో ఉన్నట్లు సమాచారం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.