అయ్యా బాబోయ్… రేయ్ ఎవర్రా మీరంతా.. అంటూ ప్రేక్షకులు అనేలా బిహేవ్ చేశారు హౌస్మేట్స్. బిగ్‌బాస్ హౌస్‌లో నిన్నటి ఎపిసోడ్లో మాత్రం కంటెస్టెంట్స్ పొట్టు పొట్టు కొట్టుకున్నంత పనిచేశారు. బూతులు తిట్టుకోవడం.. కొట్టుకోవడం ఒక్కటేమిటీ చాలానే చేశారు. ముఖ్యంగా లేడీ కంటెస్టెంట్స్ ప్రేరణ, విష్ణుప్రియ ఇద్దరు మాత్రం జుట్టు పట్టుకుని ఛీ అంటూ తిట్టుకున్నారు. ఇక ఎప్పటిలాగే పృథ్వీ బూతులతో రెచ్చిపోయాడు. కన్నడ, ఇంగ్లీష్‌లో బూతులు తిడుతూ కాంతార టీమ్ సభ్యులను అదరగొట్టాడు. నిన్నటి ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.. శక్తి (నిఖిల్) టీం ఎక్కువ ఎగ్స్ కలెక్ట్ చేయడంతో కాంతార టీం నుంచి నబీల్ ను గేమ్ నుంచి తప్పించింది శక్తి టీం. దీంతో అతడు సంచాలక్ గా వ్యవహరించాడు. ఎగ్స్ టాస్క్ మళ్లీ స్టార్ట్ కాగానే సోనియా కాంతార టీంలోని ఎగ్స్ దొంగిలించింది. దీంతో యష్మీ కూడా శక్తి టీంలోని ఎగ్స్ దొంగిలించడంతో కాసేపు యష్మీకి, నిఖిల్ మధ్య డైలాగ్ వార్ నడిచింది. చివరకు శక్తి టీమ్ 60 ఎగ్స్ కలెక్ట్ చేయగా.. కాంతార టీం 30 ఎగ్స్ తో సరిపెట్టుకుంది.
ఇక ఆ తర్వాత మరోసారి ప్రభావతి టాస్క్ మొదలైంది. కానీ అప్పటికే నిఖిల్ రెడ్ ఎగ్ తీసుకుని జేబులో వేసుకున్నాడు. ఇక ఈ గేమ్ లో మరోసారి పృథ్వీ రెచ్చిపోయాడు. ఎగ్స్ ఎవరూ తీసుకోకుండా అందరినీ తోసేసాడు. దీంతో ఆదిత్య, మణికంఠ ఎందుకు ఇలా అంటూ అడగ్గా.. అమ్మాయిలా ఏడిస్తే ఇక్కడొద్దు పొండి అంటూ హెచ్చరించాడు. దీంతో మైండ్ యుఆర్ టంగ్ అంటూ కాసేపు గొడవపడ్డాడు మణికంఠ. ఇక యష్మీ, ప్రేరణను చాలా సేపు కదలనివ్వకుండా పట్టుకోవడంతో పృథ్వీకి ఒక్కటిచ్చింది ప్రేరణ. దీంతో ఇద్దరి మధ్య కాసేపు గొడవ జరిగింది. ఇక ఆ తర్వాత ఎగ్స్ కోసం నిలబడినప్పుడు విష్ణుప్రియ సీత చేయి చేయి పట్టుకుని ప్రేరణను వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు. దీంతో ప్రేరణ వాళ్ల చేయి పట్టుకుని విడిపించే ప్రయత్నం చేసింది. దీంతో ప్రేరణను విష్ణుప్రియ తోసేసింది. నాతో పెట్టుకోకు ఇలా అవుతుంది అంటూ వార్నింగ్ ఇచ్చింది విష్ణుప్రియ. ఇక ప్రేరణ కూడా విష్ణును తోసేసింది.
అయితే కాంతార టీమ్ సభ్యులు కష్టపడి ఎగ్స్ తీసుకువస్తే.. వాటిని కాపాడడం మానేసి చూస్తూ ఉండిపోయాడు అభయ్. ఎగ్స్ డిఫెండ్ చేసుకోవడం ఆపేసి చేతులెత్తేసి శక్తి టీంకు అవకాశాలు ఇచ్చాడు. దీంతో తన చీఫ్ అభయ్ పై ఫైర్ అయ్యాడు మణికంఠ. అంత కష్టపడి తీసుకువస్తే ఇలా ఈజీగా ఇచ్చేస్తున్నావ్ ఏంటీ అంటూ గొడవ పడ్డాడు. ఒక టీమ్ బుట్టను మరో టీమ్ విసిరేయగా.. ప్రేరణను సీత ఆపడానికి ట్రై చేసింది. దీంతో ప్రేరణ తన్నడంతో విష్ణు ఆమెను పట్టుకుంది. ఆ కోపంతో ఈ రాక్షసి కూడా వచ్చిందంటూ ప్రేరణ తిట్టడం స్టార్ట్ చేయడంతో.. నువ్వు కాదంటే రాక్షసి.. రాక్షసి దానా అంటూ విష్ణు తిట్టింది. ఇదే సమయంలో ఒకరిపై మరోకరి తూ అంటే ఊసేసుకున్నారు. క్యారెక్టర్ లెస్ అంటూ విష్ణును తిట్టింది ప్రేరణ.. నువ్వు పెద్ద క్యారెక్టర్.. పతివ్రతను మరీ అంటూ విష్ణు కూడా తిట్టింది. తన టీంకు హెల్ప్ చేయాలని నబీల్ ట్రై చేయగా.. సోనియా ఫైర్ అయ్యింది. దీంతో ఇద్దరూ ఒకరిపై మరొకరు అరుచుకోగా.. అరవకు అంటూ నబీల్ కు వార్నింగ్ ఇచ్చాడు పృథ్వీ. దీంతో మణికంఠ ఆపడానికి ట్రై చేస్తే కన్నడ, ఇంగ్లీష్ లో బూతులతో రెచ్చిపోయాడు పృథ్వీ. ఇద్దరి మధ్య కాసేపు పెద్ద గొడవే జరిగింది. చివరకు శక్తి టీమ్ దగ్గర 263 ఎగ్స్.. కాంతార టీమ్ వద్ద 25 ఎగ్స్ ఉన్నాయి. దీంతో ప్రేరణను గేమ్ నుంచి తప్పించింది శక్తి టీమ్. మొత్తానికి నిన్నటి ఎపిసోడ్ లో మాత్రం బూతులు తిట్టుకుంటూ జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు కంటెస్టెంట్స్.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.