బిగ్బాస్ సీజన్ 8 ఐదో వారం వీకెండ్ వచ్చేసింది. శనివారం ఎపిసోడ్లో కంటెస్టెంట్లకు అంతగా క్లాస్ తీసుకోలేదు నాగార్జున. కేవలం మణికంఠ ఏడుపు, ఎమోషన్ పైనే నిన్నటి ఎపిసోడ్ మొత్తం గడిచింది. ఏడవడమే నీ స్ట్రాటజీ అయితే అది పనికిరాదు.. ఇక ఏడుపు ఆపేయ్ అంటూ మణికి స్మూత్ వార్నింగ్ ఇచ్చారు నాగ్. అలాగే హౌస్మేట్స్ మొత్తం మణిపైనే కంప్లైయింట్స్ ఇచ్చారు. శనివారం నబీల్, నిఖిల్ సేవ్ కాగా.. ఈరోజు అసలు ఎలిమినేషన్ ఎవరనేది తెలియనుంది. అలాగే ఈరోజు మొత్తం 8 వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండనున్నట్లు ముందు నుంచి చెబుతున్న సంగతి తెలిసిందే. తాజాగా సండే ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. ఈరోజు బిగ్బాస్ 2.0 గ్రాండ్ లాంఛ్ కానుంది. ఈరోజు పలువురు సెలబ్రెటీలు స్టేజ్ పై సందడి చేయనున్నారు. అలాగే మొత్తం 8 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు హౌస్ లోకి అడుగుపెట్టనున్నాయి. కాసేపటి క్రితం విడుదలైన ప్రోమోలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలను గమనిద్దామా..
తాజాగా విడుదలైన ప్రోమోలో తన స్వాగ్ సినిమా ప్రమోషన్లలో భాగంగా శ్రీవిష్ణు, రీతూ వర్మ, దక్ష నగార్కర్ సందడి చేశారు. అలాగే జనక అయితే గనక సినిమా ప్రమోషన్లలో భాగంగా సుహాస్, దిల్ రాజు, సంగీర్తన ఎంట్రీ ఇచ్చారు. ఇక మా నాన్న సూపర్ హీరో ప్రమోషన్స్ కోసం సుధీర్ బాబు, షాయాజీ షిండే స్టేజ్ పై కనిపించారు. వీరితోపాటు మరికొంత మంది సెలబ్రెటీలు రానున్నట్లు తెలుస్తోంది. అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీల వేడుక అట్టహసంగా జరిగింది.
వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ ముఖాలు ఎక్కడా కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. అయితే తాజాగా విడుదలైన ప్రోమో చూస్తుంటే.. రోహిణి, టేస్టీ తేజతోపాటు నయని పావని, గౌతమ్ కృష్ణ, అవినాష్, మోహబూబ్, గంగవ్వ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇవ్వబోతున్నారు. అలాగే హరితేజ కూతురు స్టేజ్ పైకి వచ్చి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మీ అమ్మ బిగ్ బాస్ లోకి వెళ్తుంది కదా.. నువ్వు మిస్ అవుతున్నావా ? అని అడిగితే.. టీవీలో కనిపిస్తుంది కదా అంటూ ఆన్సర్ ఇచ్చింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.