Bigg Boss 8 Telugu: రాయల్స్ టీంపై విరుచుకుపడిన పృథ్వీ, నిఖిల్.. ఓజీ టీమ్ విధ్వంసం..

|

Oct 25, 2024 | 8:16 AM

బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడు చీఫ్ కంటెండర్ ఎంపిక కోసం బీబీ రాజ్యం అనే టాస్కు నడుస్తున్న సంగతి తెలిసిందే. మొదటి టాస్కులోనే రాయల్స్ టీం గెలవడంతో ఎలాగైనా ఈసారి విజయం సాధించాలని ప్లాన్ చేసింది ఓజీ టీం. ఇంకేముంది నిఖిల్, పృథ్వీ ఆ తర్వాత టాస్కులలో విరుచుకుపడ్డారు.

Bigg Boss 8 Telugu: రాయల్స్ టీంపై విరుచుకుపడిన పృథ్వీ, నిఖిల్.. ఓజీ టీమ్ విధ్వంసం..
Bigg Boss 8 Telugu
Follow us on

బీబీ రాజ్యం టాస్కులో రాయల్స్ టీం గెలవడంతో ఓజీ క్లాన్ భారీగానే ప్లాన్ చేసింది. నిన్న జరిగిన ఎపిసోడ్ లో బీబీ రాజ్యం ఛాలెంజ్ కొనసాగింది. ఎనిమిది ధాన్యపు బస్తాలను తోపుడు బండిపై ఎవరు ముందుగా పెడతారో ఆ టీంకు రాజ్యంలో వ్యవసాయం దక్కుతుందని అన్నాడు బిగ్ బాస్. దీంతో ఓజీ టీమ్ నుంచి వచ్చిన నిఖిల్, పృథ్వీ హడలెత్తించారు. వారిద్దరిని అడ్డుకునేందుకు గౌతమ్, మెహబూబ్ చాలావరకు ప్రయత్నించారు. ఈ టాస్కులో రాయల్స్ టీం సభ్యులపై నిఖిల్, పృథ్వీ చెలరేగిపోయారు. నిన్న ఒక టాస్కులో గెలిచి బీబీ రాజ్యంలో సరస్సును సొంతం చేసుకుంది రాయన్స్ క్లాన్. నిన్న మొదటి టాస్కులో గురించి అనౌన్స్ చేశాడు. అత్యంత బలమైన సేనల్ని కూడా ఆకలి మట్టుబెడుతుంది. ప్రతి రాజ్యానికి ఆహార భద్రత అత్యంత ముఖ్యం. అలాంటి ఆహారాన్ని ఇచ్చే వ్యవసాయం కోసం బిగ్ బాస్ ఇస్తున్న టాస్కు పట్టుకో కార్డులో పెట్టుకో ఇందులో గెలవడానికి 8 ధాన్యపు బస్తాలని మీకు సంబంధించిన రెడ్ లైన్ వెనక్కి కార్డ్ ద్వారా చేర్చడం..టాస్కు ముగిసే సమయానికి ఏ క్లాన్ అయితే తమకు చెందిన 8 ధాన్యపు బస్తాలను రెడ్ లైన్ వెనక్కు ముందుగా చేరుస్తారో వారు ఈ టాస్కును గెలుస్తారు. అలాగే వ్యవసాయాన్ని పొంది.. మీ క్లాన్ జెండాను పాతొచ్చు అని బిగ్ బాస్ చెప్పడంతో టాస్కు ఎలాగైనా గెలవాలని ఓజీ క్లాన్ ప్రణాళికలు రెడీ చేసుకుంది.

ఇక ఈ టాస్కులో నిఖిల్, పృథ్వీ, గౌతమ్, మెహబూబ్ చాలా వరకు కొట్టుకున్నారు.. తోసుకుంటూ నానా అరాచకం సృష్టించారు. దీంతో బిగ్ బాస్ కొన్ని సెకన్స్ పాటు గేమ్ పాజ్ చేశాడు. అలాగే ఈ ఆటలో పోటీదారులను మార్చుకోవచ్చని వెసులుబాటు కల్పించడంతో గౌతమ్, మెహబూబ్ స్థానాల్లోకి అవినాష్, టెస్టీ తేజ వచ్చారు. వీరిద్దరు కూడా నిఖిల్, పృథ్వీలను ఆపేందుకు వాళ్ల శక్తికి మించి ప్రయత్నించారు. వాళ్లు ఎంతో కష్టపడి ఓ సంచిని బండిపై పెట్టినా కానీ అది ముందు ఓజీ తోపుడు బండికి టచ్ అయిందంటూ వారికే పాయింట్ ఇస్తానంటూ వితండవాదం చేసింది సంచాలకురాలు యష్మీ. ఒక్క బస్తా కూడా రాయల్ టీం పెట్టలేకపోయింది. ఇక ఈ టాస్కులో ఓజీ టీం గెలిచి వ్యవసాయ భూమి సొంతం చేసుకున్నారు. దీంతో తమ టీమ్ నుంచి పృథ్వీని మెగా ఛీఫ్ కంటెండర్ గా ప్రకటించారు. ఈ క్రమంలోనే కంటెండర్ కావాలనుకున్న ప్రేరణ, యష్మీకి మధ్య గొడవ జరిగింది. ఇది మన సీజన్.. మన టీంలోని ఒకరే ట్రోఫీ ఎత్తాలి.. మనలో మనకు గొడవలొద్దు అని నిఖిల్ సర్దిచెప్పాడు. ఇక మరోవైపు రాయల్స్ టీం నుంచి గంగవ్వను మెగా ఛీఫ్ కంటెండర్ పోస్టు నుంచి తప్పించారు.

ఆ తర్వాత వచ్చినప్పటి నించి ప్రతి టాస్కు మేమే గెలిచామని రాయల్స్ టీమ్ ఫీల్ అవుతున్నారు. మనం మిగతా టాస్కులు గెలిచి ఆ పొగరును తగ్గించాలని ప్రేరణ, నబీల్ ముచ్చటించారు. ఇక హరితేజ తన కూతురిని తలుచుకుని ఎమోషనల్ అయ్యింది. బీబీ రాజ్యంలో సైన్యం, హాస్పిటల్ ను పొందడానికి బిగ్ బాస్ వైరల్ అటాక్ అనే టాస్కు ఇచ్డాు. ఇందులో ఓజీ టీం నుంచి నిఖిల్, నబీల్ ఆడగా.. రాయల్ టీమ్ నుంచి గౌతమ్, తేజ ఆడారు. దీంతో మరోసారి ఓజీ టీం గెలవగా.. నబీల్ చీఫ్ కంటెండర్ గా ప్రకటించారు. ఇక గౌతమ్ ను రాయల్స్ టీం చీఫ్ కంటెండర్ టాస్కు నుంచి తప్పించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.