Bigg Boss 7 telugu: పల్లవి ప్రశాంత్ కోసం కవిత చెప్పిన బిగ్‏బాస్.. ప్రోమో చూస్తే కన్నీళ్లు పెట్టడం ఖాయం..

|

Dec 13, 2023 | 5:06 PM

ప్రశాంత్ ఆట చూసి కంటెస్టెంట్స్, అడియన్స్ సైతం అవాక్కయ్యేలా చేశాడు. ఇక ఇప్పుడు టైటిల్ రేసులో టాప్ 3 స్థానంలో దూసుకుపోతున్నాడు. తాజాగా పల్లవి ప్రశాంత్ బిగ్‏బాస్ జర్నీని ఎంతో ఎమోషనల్‏గా చూపించాడు బిగ్‏బాస్. ముందుగా తన గార్డెన్ ఏరియాలో తన జర్నీ ఫోటోస్ చూసి ఎమోషనల్ అయ్యాడు ప్రశాంత్. తన తండ్రి ఫోటోను చూసి మురిసిపోయాడు. ఆ తర్వాత యాక్టివిటీ ఏరియాలో రైతు బిడ్డగా అడుగుపెట్టి అందరి మనసులు గెలుచుకున్న తీరును గొప్పగా చెప్పాడు బిగ్‏బాస్. అలాగే ఈసారి ప్రశాంత్ కోసం బిగ్‏బాస్ కవిత చెప్పాడు.

Bigg Boss 7 telugu: పల్లవి ప్రశాంత్ కోసం కవిత చెప్పిన బిగ్‏బాస్.. ప్రోమో చూస్తే కన్నీళ్లు పెట్టడం ఖాయం..
Pallavi Prashanth
Follow us on

బిగ్‏బాస్ సీజన్ 7లో అందరికంటే ప్రత్యేకం పల్లవి ప్రశాంత్. రైతు బిడ్డగా హౌస్‏లో అడుగుపెట్టి.. ఇప్పుడు టైటిల్ రేసులో దూసుకుపోతున్నాడు. కామన్ మ్యాన్‏గా ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్.. తన ఆట తీరుతో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. ముఖ్యంగా ఇంటి సభ్యులతో తన మాట తీరు.. ప్రవర్తన.. అందరిని అన్నా, అక్కా అంటూ పిలుస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇక అప్పటివరకు సైలెంట్‏గా ఉండే ప్రశాంత్.. టాస్కులలో మాత్రం అదరగొట్టేశాడు. మొదటి వారం రతికతో స్నేహం.. ఆ తర్వాత పులిహోర బిడ్డగా మారిపోవడంతో అతడిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. కానీ నమ్మిన స్నేహమే రతిక నామినేట్ చేయడం.. ఆ తర్వాత ఆమెతో జరిగిన గొడవలతో తెరుకున్నాడు. దీంతో తన ఫోకస్ మొత్తం ఆటపై పెట్టాడు. శారీరకంగా.. మానసికంగా తనకంటే బలవంతులతో పోటీ పడి మరీ అల్లాడించేశాడు. ప్రశాంత్ ఆట చూసి కంటెస్టెంట్స్, అడియన్స్ సైతం అవాక్కయ్యేలా చేశాడు. ఇక ఇప్పుడు టైటిల్ రేసులో టాప్ 3 స్థానంలో దూసుకుపోతున్నాడు. తాజాగా పల్లవి ప్రశాంత్ బిగ్‏బాస్ జర్నీని ఎంతో ఎమోషనల్‏గా చూపించాడు బిగ్‏బాస్.

ముందుగా తన గార్డెన్ ఏరియాలో తన జర్నీ ఫోటోస్ చూసి ఎమోషనల్ అయ్యాడు ప్రశాంత్. తన తండ్రి ఫోటోను చూసి మురిసిపోయాడు. ఆ తర్వాత యాక్టివిటీ ఏరియాలో రైతు బిడ్డగా అడుగుపెట్టి అందరి మనసులు గెలుచుకున్న తీరును గొప్పగా చెప్పాడు బిగ్‏బాస్. అలాగే ఈసారి ప్రశాంత్ కోసం బిగ్‏బాస్ కవిత చెప్పాడు.”మట్టితో మనకున్న సంబంధం విడదీయలేనిది. ఒక కామనర్ సెలబ్రెటీలా ఈ ఇంట్లో అడుగుపెట్టారు. దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ టాస్కులలో గెలవడానికి మీ రక్తాన్ని సైతం చిందించడానికి వెనుకాడలేదు. మీకు ఇక్కడ వివిధ వ్యక్తుల రూపంలో స్నేహం దొరికింది.

మీరు కుంగిపోయిన ప్రతిసారి లోకం తీరును తెలియజేస్తూ.. మీ లక్ష్యాన్ని గుర్తూ చేస్తూ ఏడుపు సమాధానం కాదని మీకు ఆ స్నేహమే తెలియజేసింది… నామినేషన్లలో మీలోని మరో ప్రశాంత్ ను అందరికీ చూపించి.. ఒక బలమైన పోటీదారులుగా మిమ్మల్ని ఇక్కడ నిలబెట్టింది. ఆకాశం నుంచి జారే ప్రతి నీటిబొట్టి భూమి మీద జీవానికి ఒక అవకాశమే.. దాన్ని ఒడిసిపట్టే నైపుణ్యమే విజయం.. ” అంటూ బిగ్‏బాస్ కవిత చెప్పగానే ప్రశాంత్ భావోద్వేగానికి గురయ్యాడు. ఇప్పటివరకు సోషల్ మీడియాలో వచ్చిన ఓటింగ్ ప్రకారం ప్రశాంత్ టైటిల్ రేసులో ముందున్నట్లు తెలుస్తోంది. అత్యధిక ఓట్లతో ప్రశాంత్ ముందుండగా.. ఆ తర్వాతి స్థానంలో శివాజీ.. మూడవ స్థానంలో యావర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మొన్నటి వరకు రెండో స్థానంలో ఉన్న అమర్ దీప్.. ఇప్పుడు నాలుగో స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. బిగ్‏బాస్ గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 17న జరగనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.