Bigg Boss 7 Telugu: బిగ్‏బాస్ షాకింగ్ ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్.. అందరూ సేవ్ అయ్యారా ?..

|

Nov 18, 2023 | 9:58 PM

ఈ వారం మొదటి నుంచి అమర్, యావర్ మధ్య ఓటింగ్ పోటాపోటిగా జరిగింది. మొన్నటి వరకు యావర్ టాప్ 1లో ఉండగా.. స్వల్ప ఓటింగ్ తేడాతో అమర్ దీప్ రెండో స్థానంలో నిలిచాడు. ఇక ఆ తర్వాత డాక్టర్ బాబు, అర్జున్, ప్రియాంక, ఉండగా.. చివరి స్థానంలో అశ్విని, రతిక, శోభాశెట్టి మధ్య గట్టిపోటి నడిచింది. వీరి ముగ్గురిలో ఈవారం ఒకరు ఎలిమినేట్ కావడం ఖాయమనుకున్నారు. అయితే వారంలో శివాజీ బ్యాచ్‏తో కలిసి తిరగడంతో రతికకు కాస్త ఓటింగ్ పెరిగింది. దీంతో అశ్విని, శోభా ఇద్దరూ డేంజర్ జోన్ లో ఉన్నారు.

Bigg Boss 7 Telugu: బిగ్‏బాస్ షాకింగ్ ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్.. అందరూ సేవ్ అయ్యారా ?..
Bigg Boss 7
Follow us on

బిగ్‏బాస్ సీజన్ 7.. ఇప్పటివరకు 10 వారాలు పూర్తైంది. ఇక ఇప్పుడు 11వ వారం ఎలిమినేషన్ సమయం వచ్చేసింది. ఈవారం మొత్తం ఎనిమిది మంది నామినేట్ అయిన సంగతి తెలిసిందే. అమర్ దీప్, యావర్, అర్జున్, అశ్విని, ప్రియాంక, శోభా శెట్టి, రతిక, గౌతమ్ హౌస్ నుంచి బయటకు వెళ్లేందుకు నామినేట్ అయ్యారు. అయితే ఈ వారం మొదటి నుంచి అమర్, యావర్ మధ్య ఓటింగ్ పోటాపోటిగా జరిగింది. మొన్నటి వరకు యావర్ టాప్ 1లో ఉండగా.. స్వల్ప ఓటింగ్ తేడాతో అమర్ దీప్ రెండో స్థానంలో నిలిచాడు. ఇక ఆ తర్వాత డాక్టర్ బాబు, అర్జున్, ప్రియాంక, ఉండగా.. చివరి స్థానంలో అశ్విని, రతిక, శోభాశెట్టి మధ్య గట్టిపోటి నడిచింది. వీరి ముగ్గురిలో ఈవారం ఒకరు ఎలిమినేట్ కావడం ఖాయమనుకున్నారు. అయితే వారంలో శివాజీ బ్యాచ్‏తో కలిసి తిరగడంతో రతికకు కాస్త ఓటింగ్ పెరిగింది. దీంతో అశ్విని, శోభా ఇద్దరూ డేంజర్ జోన్ లో ఉన్నారు. ఇంకేముంది ఈసారి శోభా ఎలిమినేట్ కావడం అనుకున్నారంతా. గత కొన్ని వారాలుగా శోభాకు అతి తక్కువ ఓటింగ్ రావడం.. చివరలో ఆమెకు బదులుగా మరొకరు ఎలిమినేట్ కావడం చూస్తున్నాం. శోభాకు తక్కువ ఓటింగ్ వచ్చినప్పుడు నయని, తేజా, సందీప్, భోలే ఇలా స్ట్రాంగ్ అనుకున్నవాళ్లకు బయటకు పంపించేశారు. ఇక ఇప్పుడు ఈవారం అందరి కంటే తక్కువ ఓట్లు శోభాకే పడ్డాయి. కానీ అనుహ్యంగా ఇప్పుడు నో ఎలిమినేషన్ అనే టాక్ వినిపిస్తుంది.

సాధారణంగా ఎలిమినేషన్ గురించి ముందే ఊహిస్తుంటారు జనాలు. మొదటి వారం నుంచి దాదాపు అడియన్స్ ఊహించినట్లుగానే ఎలిమినేషన్స్ జరుగుతాయి. కానీ కొన్నిసార్లు మాత్రమే అటు ఇటుగా జరుగుతుంటాయి. అన్ని సీజన్స్ మాదిరిగానే ఈ సీజన్ లోనూ దాదాపు అన్ని ఎలిమినేషన్స్ ముందే అడియన్స్ పసిగట్టారు. కానీ ఎప్పుడతే శోభా ఎలిమినేట్ కాబోతుందని అనుకున్నారో.. అప్పటి నుంచి ఎలిమినేషన్స్ పూర్తిగా మారిపోయాయి. ఎవరు ఊహించని విధంగా నయని పావని, సందీప్, భోలే, తేజ బయటకు రావడం జరిగింది. ఇక ఇప్పుడు 11వ వారంలో అశ్విని, రతిక కంటే శోభాకు తక్కువ ఓట్లు వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈవారం ఆమె పక్కా ఎలిమినేట్ అవుతుందని భావించారు.

కానీ తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ వారం ఎలినిమేషన్ లేదని తెలుస్తోంది. అయితే దీనిపై పూర్తిగా క్లారిటీ రాలేదు. కానీ ఇప్పటికీ వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈవారం ఎలిమినేషన్ తీసేశారట. దీంతో బిగ్ బాస్ నిర్ణయం పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్. ఎలిమినేషన్ లేనప్పుడు తమతో ఓట్లు ఎందుకు వేయించుకున్నారని… చివర్లో ఎలిమినేషన్ తీసేయడమేంటనీ కామెంట్స్ చేస్తున్నారు. మరీ నిజంగానే ఈ వారం ఎలిమినేషన్ తీసేశారా ? లేదా అంతా అనుకున్నట్లే శోభా ఎలిమినేట్ అయ్యిందా ? అనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.