Bigg Boss 7 Telugu: మూడు సినిమాల్లో హీరోగా గౌతమ్.. నెగిటివిటీ పై తొలిసారి శోభా రియాక్షన్.. 

|

Dec 17, 2023 | 8:14 PM

బిగ్‏బాస్ సీజన్ 7 పై సొంతంగా కంపోజ్ చేసిన పాటకు భోలే స్టెప్పులతో అదరగొట్టేశారు. ఆ తర్వాత హౌస్ లో ఉన్న ఆరుగురు ఫైనలిస్ట్స్ ఒక్కొక్కరిగా పర్ఫామెన్స్ ఇచ్చారు. అంతకు ముందు మాజీ కంటెస్టెంట్స్ అందరినీ ఆప్యాయంగా పలకరించారు హోస్ట్ నాగార్జున. బిగ్‏బాస్ తర్వాత లైఫ్ ఎలా ఉందంటూ అడిగి మరీ తెలుసుకున్నారు. ముందుగా సింగర్ దామిని తన లైఫ్ పూర్తిగా మారిపోయిందని చెప్పుకొచ్చింది. చాలా బాగుందని.. ముందుకంటే 10 రెట్లు బెటర్ అంటూ సంతోషం వ్యక్తం చేసింది.

Bigg Boss 7 Telugu: మూడు సినిమాల్లో హీరోగా గౌతమ్.. నెగిటివిటీ పై తొలిసారి శోభా రియాక్షన్.. 
Shobha Shetty, Gautham
Follow us on

బిగ్‏బాస్ సీజన్ 7 గ్రాండ్ ఫినాలే అట్టహాసంగా స్టార్ట్ అయ్యింది. ఎంట్రీతోనే కేజీఎఫ్ సినిమాలోని పాటకు డాన్స్ చేశారు నాగార్జున. ఆ తర్వాత మాజీ కంటెస్టెంట్స్ జోడిలుగా డాన్స్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. శుభ శ్రీ.. గౌతమ్, పూజా మూర్తి.. అశ్విని, టేస్టీ తేజ.. శోభా, సందీప్.. నయని, భోలే స్టెప్పులతో అదరగొట్టేశారు. బిగ్‏బాస్ సీజన్ 7 పై సొంతంగా కంపోజ్ చేసిన పాటకు భోలే స్టెప్పులతో అదరగొట్టేశారు. ఆ తర్వాత హౌస్ లో ఉన్న ఆరుగురు ఫైనలిస్ట్స్ ఒక్కొక్కరిగా పర్ఫామెన్స్ ఇచ్చారు. అంతకు ముందు మాజీ కంటెస్టెంట్స్ అందరినీ ఆప్యాయంగా పలకరించారు హోస్ట్ నాగార్జున. బిగ్‏బాస్ తర్వాత లైఫ్ ఎలా ఉందంటూ అడిగి మరీ తెలుసుకున్నారు. ముందుగా సింగర్ దామిని తన లైఫ్ పూర్తిగా మారిపోయిందని చెప్పుకొచ్చింది. చాలా బాగుందని.. ముందుకంటే 10 రెట్లు బెటర్ అంటూ సంతోషం వ్యక్తం చేసింది. ఇక తేజ మాత్రం కాస్త ఎక్కువే చెప్పాడు. బిగ్‏బాస్ తర్వాత తనకు 10 సినిమాల్లో ఛాన్స్ వచ్చిందని.. బిగ్‏బాస్ లో సంపాదించిన కంటే.. 6 వారాల్లో అంతకు ఎక్కువే సంపాదించినట్లు చెప్పాడు.

ఇక తర్వాత గౌతమ్ డాక్టర్ బాబును అడగ్గా.. చాలా సంతోషంగా ఉందని చెప్పాడు. చాలా బాగున్నాను.. మూడు సినిమాలకు హీరోగా సైన్ చేశాను అని అన్నాడు. మా అమ్మగారికి రిటైర్మెంట్ ముందే ఇప్పిస్తున్నాను.. అంతకు ముందు రిటైర్మెంట్ అంటే ఇంకా సెటిల్ కాలేదని భయం ఉండే.. కానీ ఇప్పుడు అలా లేదంటూ సంతోషంగా మాట్లాడాడు. ఇక తర్వాత శోభా శెట్టి మొదటిసారి తనపై వచ్చిన నెగిటివిటీ గురించి మాట్లాడింది. ఇంకా బిగ్‏బాస్ నుంచి బయటపడలేదని.. ఎలిమినేట్ అయ్యానన్న బాధ నుంచి ఓవర్ కమ్ కాలేదని తెలిపింది. అలాగే తనపై చాలా నెగిటివిటీ వచ్చిందని.. మీమ్స్ కూడా వచ్చాయని చెప్పుకొచ్చింది.

అలాగే శుభ శ్రీ మాట్లాడుతూ.. బిగ్‏బాస్ తర్వాత తనను జనాలు గుర్తుపడుతున్నారని సంతోషంగా మాట్లాడింది. హే.. మనోభావాలు పాప అంటూ పలకరిస్తున్నారని తెలిపింది. ఇక తర్వాత భోలే మాట్లాడుతూ. బిగ్‏బాస్ తర్వాత తను హీరో అయ్యాయని.. అలాగే శ్రీలీల వచ్చినప్పుడు పాడిన పాటతో ఇప్పుడు ఓ ప్రైవేట్ సాంగ్ కంపోజ్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. భోలే కంపోజ్ చేసిన పాటలో శుభ శ్రీ హీరోయిన్ అంటూ అసలు విషయం బయటపెట్టేశాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.