Bigg Boss 7 Telugu: ‘తల్లి, భార్య జోలికొస్తే ఇంటి కొచ్చి కొడతా’.. ఆ కామెంట్లపై ఏడ్చేసిన అమర్‌దీప్‌ తల్లి

బిగ్‌బాస్‌ టైటిల్‌ గెలిచేందుకు ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. టాస్కులు, గేమ్స్‌లో చురుగ్గా పాల్గొంటున్నారు. తోటి కంటెస్టెంట్లతో సఖ్యతగా ఉంటూనే అవసరమొచ్చినప్పుడు వారినే దూషిస్తున్నారు. గొడవలు పడుతూనే ఉన్నారు. దీనికి తోడు కంటెస్టెంట్ల పీ ఆర్‌ టీమ్స్‌ మరీ దిగజారి ప్రవర్తిస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. తమ కంటెస్టెంట్స్‌కు హైప్‌ ఇస్తే సమస్య లేదు కానీ అవతలి వారిపై అనవరసరంగా ట్రోలింగ్‌కు దిగుతున్నాయి.

Bigg Boss 7 Telugu: తల్లి, భార్య జోలికొస్తే ఇంటి కొచ్చి కొడతా.. ఆ కామెంట్లపై ఏడ్చేసిన అమర్‌దీప్‌ తల్లి
Bigg Boss 7 Telugu

Updated on: Oct 16, 2023 | 9:13 PM

ప్రముఖ టీవీ రియాలిటీ షో బిగ్‌ బాస్‌ ఏడో సీజన్‌ సక్సెస్‌ ఫుల్‌గా రన్‌ అవుతోంది. ఇప్పటికే ఆరు వారాలు పూర్తి చేసుకుని ఏడో వారంలోకి అడుగపెట్టిందీ సెలబ్రిటీ గేమ్‌ షో. ప్రస్తుతం బిగ్‌ బాస్‌ హౌజ్‌లో మొత్తం 13 మంది కంటెస్టెంట్స్‌ ఉన్నారు. బిగ్‌బాస్‌ టైటిల్‌ గెలిచేందుకు ఎవరికి వారు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. టాస్కులు, గేమ్స్‌లో చురుగ్గా పాల్గొంటున్నారు. తోటి కంటెస్టెంట్లతో సఖ్యతగా ఉంటూనే అవసరమొచ్చినప్పుడు వారినే దూషిస్తున్నారు. గొడవలు పడుతూనే ఉన్నారు. దీనికి తోడు కంటెస్టెంట్ల పీ ఆర్‌ టీమ్స్‌ మరీ దిగజారి ప్రవర్తిస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. తమ కంటెస్టెంట్స్‌కు హైప్‌ ఇస్తే సమస్య లేదు కానీ అవతలి వారిపై అనవరసరంగా ట్రోలింగ్‌కు దిగుతున్నాయి. కొందరైతే కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులను ఇందులోకి లాగుతున్నారు. తాజాగా ఇదే విషయంపై అమర్‌ దీప్‌ చౌదరి తల్లి మనస్తాపానికి గురైంది. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్‌ కు చెందిన పీఆర్‌ టీమ్ తమను మానసికంగా వేధిస్తోందంటూ కన్నీరు పెట్టుకుందామె. ఇదే విషయమై నాగార్జునను కూడా కలుస్తానన్నారు. ప్రస్తుతం అమర్‌ దీప్‌ తల్లి వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి.

‘నేను అమర్‌దీప్‌ తల్లిని.. మీకు ఏమైనా మతుండే ఇలాంటి నీచమైన కామెంట్స్‌ పెడుతున్నారా? అసలు మీరు ఏం తింటున్నారు? అన్నం తింటున్నారా? గడ్డి తింటున్నారా? పల్లవి ప్రశాంత్‌ ఏమైనా పై నుంచి దిగివచ్చాడా? నా గురించి, అమర్ భార్య గురించి ఇంతటి నీచమైన కామెంట్లు చేస్తారా? అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? పల్లవి ప్రశాంత్‌ పై ప్రేమ ఉంటే ఓట్లేసి గెలిపించుకోండి.. అంతే కానీ తల్లి, భార్యల జోలికి వస్తే మాత్రం ఇంటి కొచ్చి కొడతాను. మీకసలు సంస్కారం ఉందా? మీ మాటల వల్ల ఎదుటివారు ఎంత బాధపడుతున్నారో తెలుసా? మేం మానసికంగా చచ్చిపోతున్నాం. నాగార్జున దగ్గరకు వెళ్లి ఈవిషయంపై మాట్లాడుతా’ అంటూ తెలిపారు అమర్‌ దీప్‌ తల్లి. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. కుటుంబ సభ్యులను ఇందులోకి లాగొద్దంటూ నెటిజన్లు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

బిగ్ బాస్ హౌజ్ లో అమర్ దీప్..

అమర్ దీప్ పై నెగెటివ్ కామెంట్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us