Bigg Boss 7 Telugu : సీరియల్ బ్యాచ్‏ సేఫ్.. వారి కోసం బిగ్‏బాస్ కొత్త రూలు.. ప్రియాంక, శోభా చాలా ఓవరు..

|

Nov 07, 2023 | 7:35 AM

ఈ వారం నామినేషన్స్ నుంచి అమర్ ను సేవ్ చేసేందుకు శోభా, ప్రియాంక చాలా కష్టపడ్డారు. అలాగే మరోసారి భోలే పై రివేంజ్ తీర్చుకున్నారు. ముందుగా అమర్ దీప్, అర్జున్ ఇద్దరూ రాగా.. ముందుగా అమర్ మాట్లాడుతూ.. వీక్ అని ఒప్పుకొని రావడం ఇష్టం లేదని రీజన్ చెప్పాడు. ఇక అర్జున్ మాట్లాడుతూ.. అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా టీమ్ మొత్తాన్ని శివాజీ ఇన్ఫ్లూయెన్స్ చేశాడని గౌతమ్ చెప్పడం కరెక్ట్ కాదంటూ రీజన్ చెప్పాడు. కానీ శోభా, ప్రియాంకలకు అమర్ చెప్పిన కారణం కరెక్ట్ అనిపించి

Bigg Boss 7 Telugu : సీరియల్ బ్యాచ్‏ సేఫ్.. వారి కోసం బిగ్‏బాస్ కొత్త రూలు.. ప్రియాంక, శోభా చాలా ఓవరు..
Bigg Boss 7 Telugu
Follow us on

బిగ్‏బాస్ పదవ వారం నామినేషన్స్ రచ్చ జరిగింది హౌస్ లో. ఎప్పుడూ నువ్వా నేనా అంటూ హీట్ డిస్కషన్ నడిచే హౌస్‏లో ఈవారం మాత్రం చెత్త నామినేషన్స్ జరిగాయి. ముఖ్యంగా సీరియల్ బ్యాచ్ లోని ఒక్కరు కూడా నామినేషన్లలో లేకపోవడం విచిత్రం. ఈవారం జరిగిన నామినేషన్స్.. బిగ్‏బాస్ కొత్త రూల్స్ చూస్తుంటే సీరియల్ బ్యాచ్‍ను సేవ్ చేసేందుకే అని అర్థమవుతుంది. నిన్నటి ఎపిసోడ్‏లో హౌస్ లో ఉన్న అమ్మాయిలందరూ రాజమాతలు అంటూ ఏదో ఒక కథ మొదలు పెట్టాడు బిగ్‏బాస్. ప్రతిసారి ఇద్దరు క్యాండెట్స్ వెళ్లి తాము నామినేట్ చేసే వ్యక్తిని వారి రీజన్స్ చెబితే.. అందులో ఎవరి రీజన్ కరెక్ట్ గా ఉంటే వారి నామినేషన్స్ రాజమాతలు ఏకాభిప్రాయంతో సెలక్ట్ చేస్తారు. ఇక నామినేషన్స్ కోసం నలుగురు రాజమాతలకు నాలుగు పెద్ద సింహాసనాలు ఏర్పాటు చేశారు. సింహాసనాలపై కూర్చున్న శోభా శెట్టి, ప్రియాంకలకు నిజాంగానే శివగామి పూనిందేమో అన్నట్లుగా బిహేవ్ చేశారు.

అమర్ సేఫ్.. ప్రియాంక విశ్వప్రయత్నాలు..

ఈ వారం నామినేషన్స్ నుంచి అమర్ ను సేవ్ చేసేందుకు శోభా, ప్రియాంక చాలా కష్టపడ్డారు. అలాగే మరోసారి భోలే పై రివేంజ్ తీర్చుకున్నారు. ముందుగా అమర్ దీప్, అర్జున్ ఇద్దరూ రాగా.. ముందుగా అమర్ మాట్లాడుతూ.. వీక్ అని ఒప్పుకొని రావడం ఇష్టం లేదని రీజన్ చెప్పాడు. ఇక అర్జున్ మాట్లాడుతూ.. అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా టీమ్ మొత్తాన్ని శివాజీ ఇన్ఫ్లూయెన్స్ చేశాడని గౌతమ్ చెప్పడం కరెక్ట్ కాదంటూ రీజన్ చెప్పాడు. కానీ శోభా, ప్రియాంకలకు అమర్ చెప్పిన కారణం కరెక్ట్ అనిపించి వెంటనే భోలేను నామినేట్ చేశారు. ఇక వారితోపాటే రతిక, అశ్విని ఓకే అన్నారు. ఇక యావర్ వచ్చి అమర్ ను నామినేట్ చేస్తూ.. నేను ప్రశాంత్ ఫుటేజ్ కోసం రతిక వెంట తిరిగమా అని అడగ్గా.. అమర్ దీప్ సీరియల్ యాక్టింగ్ స్టార్ట్ చేశాడు. నేను అనలేదు.. ఫుటేజ్ చూపించండి.. నిజమైతే ఇక్కడే చంపేయండి అంటూ డైలాగ్స్ కొట్టాడు. ఇక ప్రశాంత్.. గౌతమ్ ను నామినేట్ చేయగా.. ప్రశాంత్ నామినేట్ ఓకే చేసి గౌతమ్ ను నామినేట్ చేశారు. అమర్ ను కాపాడేశారు.

ఇక భోలే వచ్చి అమర్ ను నామినేట్ చేయగా.. గౌతమ్ వచ్చి శివాజీని నామినేట్ చేశాడు. ఇక్కడ కూడా అమర్ సేఫ్.. శివాజీని నామినేట్ చేశారు రాజమాతలు. ఇక వెంటనే శివాజీ, యావర్ వచ్చి అమర్ ను నామినేట్ చేయగా.. రంగంలోకి దిగాడు బిగ్‏బాస్ . ఇద్దరూ ఒకే వ్యక్తిని నామినేట్ చేయకూడదంటూ కొత్త రూల్ తెరపైకి తీసుకొచ్చాడు. నిజానికి నామినేషన్స్ ముందే ఈ రూల్ చెప్పాలి. కానీ అలా కాకుండా మధ్యలో దూరిపోయి చెప్పాడు బిగ్‏బాస్ . ఇద్దరు వేరే వాళ్లను సెలక్ట్ చేసుకోవాలని, లేకపోతే యావర్ నేరుగా నామినేట్ అయిపోతాడని చెప్పాడు. దీంతో చిరాకొచ్చిన యావర్.. నేనే సెల్ఫ్ నామినేట్ అవుతా అని చెప్పాడు. దీంతో బిగ్‏బాస్ చెప్పాడు కదా అంటూ మళ్లీ అమర్ ను సేవ్ చేస్తూ యావర్ ను నామినేట్ చేశారు రాజమాతలు. ఇక భోలే అమర్ ను నామినేట్ చేస్తున్న సమయంలో ప్రియాంక మధ్యలోకి వచ్చేసి తెగ హంగామా చేసింది. అసలు ఆమె ఎందుకు రియాక్ట్ అయ్యిందనేది అక్కడున్న వారికే అర్థంకాలేదు.