బిగ్బాస్ సీజన్ 7 పదమూడవ వారం నామినేషన్స్ ఎంత హీటెక్కించాయో చూశాం. SPA బ్యాచ్, SPY బ్యాచ్ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ ఈవారం హౌస్ నుంచి బయటకు వెళ్లేందుకు అమర్ మినహా.. మిగితా ఇంటిసభ్యులు నామినేట్ అయ్యాడు. శివాజీ, అర్జున్, ప్రియాంక, శోభా, ప్రశాంత్, యావర్, అర్జున్ నామినేట్ అయ్యారు. ముఖ్యంగా ఈ నామినేషన్స్ ప్రక్రియలో ఎవరూ ఊహించని నామినేషన్స్ చేశారు అర్జు్న్, అమర్. గతవారం తమకోసం నిలబడిన వారినే నామినేట్ చేసి షాకిచ్చారు. దీంతో ప్రశాంత్ కన్నీళ్లు పెట్టుకోగా.. శివాజీ ఎమోషనల్ అయ్యాడు. ఇక నామినేషన్స్ తర్వాత మరోసారి ఇంట్లో హీట్ డిస్కషన్ నడిచింది. అలాగే ఈ వారం ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యేందుకు టాస్కులు స్టార్ట్ చేశాడు బిగ్ బాస్. తాజాగా విడుదలైన ప్రోమోలో ఫైనలిస్ట్ టాస్క్ రివీల్ చేశారు.
ప్రోమోలో ముందుగా.. ఏంట్రా ఇన్ని వారాలు నామినేషన్స్ జరగలేదా అంటూ అమర్ తో మాట్లాడింది శోభా. నమ్మకద్రోహం అనే మాటను ప్రశాంత్ కావాలనే జనాలకు చూపించేందుకు తీశాడంటూ చెప్పుకొచ్చాడు అమర్. ఇక శివాజీ, ప్రశాంత్ కూర్చుని ఉండగా.. నామినేషన్లలో అర్జున్ అతి తెలివి తేటలేంటో నాకు అర్థం కాలేదు. ఇంత వంకరగా ఆలోచిస్తాడు అనుకోలేదు అన్నాడు శివాజీ. ఆ తర్వాత ఈ సీజన్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యే ప్రతిష్టాత్మకమైన గౌరవాన్ని అందుకునేందుకు ఒక్క అడుగు దూరంలో ఉన్నారన్నారు బిగ్ బాస్.
ఈ ఛాలెంజ్ లోనే.. వీలైనంత ఎక్కువ సమయం ఆటలో ఉండేలా చూసుకోవాల్సి ఉందని చెప్పాడు బిగ్ బాస్. అందులో భాగంగా.. క్లాక్ టవర్ టాస్కు ఇచ్చారు. గడియారం ముల్లు టచ్ అవ్వకుండా నిలబడాల్సి ఉంటుంది. ఇందులో ముందుగా ప్రశాంత్ అవుట్ కాగా.. ఆ తర్వాత గౌతమ్, శోభా అవుట్ అయ్యారు. ఇక అనంతరం శోభా, ప్రశాంత్ ఇద్దరినీ సంచాలకులుగా నిర్ణయించాడు బిగ్ బాస్. ఇక తర్వాత శివాజీ, యావర్ గేమ్ లో అవుట్ కాగా.. చివరకు ప్రియాంక, అర్జున్ మిగిలారు. అయితే ఇందులో ప్రియాంక కిందపడిపోయినట్లుగా తెలుస్తోంది. వెంటనే ఇంటిసభ్యులు ఆమెను కాపాడేందుకు పరిగెత్తడంతో ప్రోమో ముగిసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.