బిగ్బాస్ ఆదివారం ఫన్ డే అన్న సంగతి తెలిసిందే. శనివారం ఒక్కొక్కరికి గట్టిగా క్లాస్ తీసుకున్న నాగార్జున ప్రతి సండే ఇంటి సభ్యులతో సరదాగా కొన్ని గేమ్స్ ఆడిస్తారు. అలాగే చివరకు ఎలిమినేషన్ టెన్షన్ పెట్టేస్తారు. ఇప్పటివరకు పది వారాలు ఎలినిమినేషన్స్ జరగ్గా.. లేటేస్ట్ సమాచారం ప్రకారం 11వ ఎలిమినేషన్ లేదని తెలుస్తోంది. ఈవారం అశ్విని, రతిక, శోభాశెట్టి డేంజర్ జోన్లో ఉండగా.. అందరికంటే తక్కువ ఓట్లు వచ్చింది శోభా.. దీంతో ఈవారం ఎలిమినేషన్ తీసేయడంతో శోభాను సేవ్ చేయడానికే అంటూ సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా సండే ఫన్ డే ప్రోమో రిలీజ్ అయ్యింది. ఈవారం బిగ్బాస్ స్టేజ్ పై ‘కోట బొమ్మాళి పీఎస్’ మూవీ టీమ్ సందడి చేసింది. తమ సినిమా ప్రమోషన్ కోసం సీనియర్ హీరో శ్రీకాంత్, శివానీ రాజశేఖర్, వరలక్ష్మి శరత్ కుమార్ వచ్చారు. ముఖ్యంగా శ్రీకాంత్ తన స్నేహితుడు శివాజీనీ ఓ ఆటాడుకున్నాడు. అలాగే హౌస్మేట్స్ ఒక్కొక్కరి గురించి ఇంట్రెస్టింగ్ రివ్యూస్ ఇచ్చాడు. ఇంతకీ ప్రోమోలో ఏం జరిగిందో చూద్దాం.
ప్రోమోలో.. లింగ్ లింగ్ లింగిడీ పాటకు హీరోహీరోయిన్స్ శివానీ, రాహుల్ విజయ్ స్టెప్పులేశారు. ఆ తర్వాత నాగార్జున మాట్లాడుతూ.. రాహుల్ బిగ్బాస్ చూస్తావా అని అడగ్గా.. నేను మాత్రం ఫస్ట్ సీజన్ నుంచి ఇప్పటివరకు ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ కాకుండా చూస్తాను అని అన్నారు. ఇక ఆ తర్వాత కోట బొమ్మళి సినిమా గురించి చెప్పుకొచ్చాడు. ఇక తర్వాత ఇంటి సభ్యులకు హుషారు కోసం నా స్నేహితులను తీసుకువచ్చాను. శివాజీకి అయితే బెస్ట్ ఫ్రెండ్ అంటూ కోట బొమ్మళి టీంను పరిచయం చేశాడు. ఆ తర్వాత శ్రీకాంత్ మాట్లాడుతూ.. వెనక కూర్చున్న శివాజీని పక్కకి రా అంటూ ఆప్యాయంగా పలకరించాడు. ఎలా ఉన్నావ్ రా బాబు ఇన్ని రోజులు అంటూ కామెడీ చేశాడు. గేమ్ మాత్రం సూపర్ ఆడుతున్నావ్ అంటూ పొగడ్తలు కురిపించాడు. ఇక తర్వాత అమర్ దీప్ ను మాట్లాడిస్తూ… నీ జీవితంలో లక్ లేదని అనుకుంటున్నావ్.. కానీ ప్రయత్నించి చూడు లక్ ఆటోమేటిక్ గా వస్తుంది అంటూ మోటివేట్ చేశాడు.
ఇక ఆ తర్వాత శోభాను కన్నడలో ఎలా ఉన్నావ్ అని అడగ్గా.. కన్నడలోనే మాట్లాడింది శోభా. దీంతో ఇక మొదలుపెట్టారా అంటూ నాగ్ కౌంటరిచ్చాడు. శోభా పటాకా సార్.. ఫైర్ అండీ బాగా క్రాకర్ లా పేలుతుంది అంటూ ప్రశంసించాడు. ఇక మధ్యలో శివాజీ మాట్లాడుతూ.. వీళ్లు ఎవరు సార్.. ఎందుకొచ్చారంటూ శివాజీ అడగ్గా.. నిన్ను చూడటానికి వచ్చాంరా అంటూ శ్రీకాంత్ పంచ్ ఇచ్చాడు. తర్వాత అర్జున్ మాట్లాడుతూ.. మిమ్మల్ని జిమ్ లో చూసి మీకంటే శివాజీ పెద్దొడు.. మీరు చిన్నోడు అనుకున్నా అన్నా అని అన్నాడు. దీంతో ఊరుకోవయ్యా…మాటి మాటికి వయసు గురించి మాట్లాడతావ్ అంటూ శివాజీ కామెడీ చేశాడు. అవును అర్జున్.. బయట కూడా శివాజీ నాకంటే పెద్దోడనే అనుకుంటారు అందరూ అంటూ శ్రీకాంత్ కౌంటరివ్వగా.. తలుపులు తీయండి సార్.. నేను వెళ్లిపోతా..తట్టుకోలేకపోతున్నాను అని శివాజీ అనడంతో అక్కడున్నవారంతా నవ్వేస్తారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.