బిగ్ బాస్ ఆరోవారం ఎలిమినేషన్ ప్రక్రియ ముగిసింది. సోషల్ మీడియాలో వినిపిస్తున్న టాక్ ప్రకారమే.. ఈ ఆదివారం ఇంటి నుంచి శ్వేత వర్మ ఎలిమినేట్ అయ్యింది. ఇక నిన్నటి (అక్టోబర్ 18న) ఎపిసోడ్లో సండేను ఫన్ డేగా మార్చేశారు హోస్ట్ నాగార్జున.. ఇంటి సభ్యులను ఎంటర్ టైన్ చేస్తూ.. కొన్ని గేమ్స్ ఆడించాడు నాగార్జున.. ఇక గేమ్ మధ్యలోనే ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వచ్చాడు.. ముందుగా.. లోబో గురించి.. వాళ్ల తండ్రి చనిపోవడం గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యాడు రవి..
ఇక ఆతర్వాత.. ఎంట్రీ ఇచ్చిన నాగ్.. ఇంటి సభ్యులను రెండు గ్రూపులుగా విడదీసి.. రవిని సంచాలకుడుగా నియమించాడు.. ఇక ఏ టీలో సిరి, షన్ను, కాజల్, శ్రీరామ్, ప్రియాంక, విశ్వ ఉండగా.. టీం బీలో మానస్, సన్నీ, యానీ మాస్టర్, శ్వేత, ప్రియ, జెస్సీలను నియమించాడు.. ఇక ముందుగా పిప్పిప్పీ అని ఊదుకుంటూ పాటలను గెస్ చేయాలని సూచించాడు నాగార్జున.. ఇక అనంతరం కళ్లకు గంతలు కట్టి.. బోన్ పట్టుకునే గేమ్ ఆడించాడు నాగార్జున. కళ్లకు గంతలు కడితే.. మిగతా వాళ్లంతా డైరెక్షన్ ఇస్తూ ఉండాలి.. హూలా హూప్స్ మధ్యలో పెట్టిన బోన్‌ను పట్టుకోవాలి. గేమ్స్ ఆడుతున్న మధ్యలోనే ఒక్కొక్కరిని సేవ్ చేస్తూ వచ్చిన నాగ్.. చివరకు సిరి, శ్వేతలు డేంజర్ జోన్లో ఉన్నట్టుగా తెలిపారు.. అనంతరం వారిద్దరిని గార్డెన్ ఏరియాకు రమ్మన్నాడు నాగ్. సుత్తితో అక్కడున్న డబ్బాను పగలగొట్టమన్నాడు. అందులో వచ్చిన మరో బాక్సును లివింగ్ ఏరియాకు తీసుకురమ్మన్నాడు. ఆ డబ్బాలో సిరి బొమ్మ ఉండటంతో ఆమె సేఫ్ అయినట్టు నాగ్ ప్రకటించాడు. దీంతో చివరగా మిగిలిన శ్వేతాను ఎలిమినేట్ అయిందని ప్రకటించాడు నాగ్.. శ్వేత ఎలిమినేట్ కావడంతో యానీ మాస్టర్ వెక్కి వెక్కి ఏడ్చింది.
Also Read: Bigg Boss 5 Telugu: ఈవారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేది ఈ కంటెస్టెంటేనా..?
Bigg Boss 5 Telugu: మరోసారి అడ్డంగా దొరికిపోయిన రవి.. నిజంగానే గుంటనక్క అనేసిన నాగార్జున..