Bigg Boss 5 Telugu: లోబో ఎలిమినేట్.. గుక్కపెట్టి ఏడ్చిన విశ్వ.. అందరి గురించి తెలుసుకోమంటూ లక్కీ ఛాన్స్..

|

Oct 17, 2021 | 7:23 AM

లోబో.. రవి ఏం చెబితే అదే చేస్తాడు.. తనకు తాను గేమ్ ఆడాలని ప్రతిసారి నాగ్ చెప్పిన.. లోబో తీరులో మాత్రం మార్పు రాలేదు.

Bigg Boss 5 Telugu: లోబో ఎలిమినేట్.. గుక్కపెట్టి ఏడ్చిన విశ్వ.. అందరి గురించి తెలుసుకోమంటూ లక్కీ ఛాన్స్..
Lobo
Follow us on

లోబో.. రవి ఏం చెబితే అదే చేస్తాడు.. తనకు తాను గేమ్ ఆడాలని ప్రతిసారి నాగ్ చెప్పిన.. లోబో తీరులో మాత్రం మార్పు రాలేదు. చివరకు రవి చెప్పాడని.. హౌస్ ప్రాపర్టీ డ్యామేజ్ చేశాడు లోబో.. దీంతో నిన్నటి ఎపిసోడ్ లో జలక్ ఇచ్చాడు నాగార్జున. చేతిలో టెడ్డీ పెట్టి మరీ క్లాస్ తీసుకున్నారు. ముందుగా ఇంట్లో ఉండడానికి అర్హత లేని వారు ఎవరో చెప్పాలని ఒక్కొ కంటెస్టెంట్ ను సిక్రెట్ రూంకు పిలిచి అడిగాడు నాగార్జున.

మానస్.. శ్రీరామ్..
సన్నీ.. ప్రియ..
యానీ మాస్టర్.. లోబో..
కాజల్.. ప్రియ…
శ్రీరామ్… యాంకర్ రవి..
ప్రియాంక.. ఆర్జే కాజల్..
ప్రియ.. ఆర్జే కాజల్..
శ్వేతా.. లోబో..
షణ్ముఖ్.. లోబో..
జెస్సీ.. యాంకర్ రవి.
సిరి..లోబో.
యాంకర్ రవి.. ఆర్జే కాజల్..
విశ్వ.. ప్రియ..
లోబో.. ప్రియ..
ఇందులో ఎక్కువగా ఓట్లు ప్రియకు, లోబోకు ఎక్కువగా ఓట్లు పడ్డాయి. దీంతో ఇంట్లో ఉండటానికి ఎవరు మద్దతు ఇస్తారు అని అడగ్గా.. ఎక్కువగా ప్రియకు సపోర్ట్ ఇచ్చారు హౌస్ మేట్స్. తక్కువ ఓట్లు వచ్చిన లోబోను ఎలిమినేట్ అయినట్లుగా ప్రకటించారు నాగార్జున. దీంతో విశ్వ వెక్కి వెక్కి ఏడ్చాడు. తప్పు చేసిన వాళ్లు ఉంటున్నారు.. లోబోను ఎలిమినేట్ చేశారేంటీ అంటూ బోరున ఏడ్చాడు.. ఇక ఆ తర్వాత అందరికీ గుడ్ బై చెప్పేసీ.. తప్పు చేస్తే క్షమించాలిని కోరుతూ.. ఇంటి సభ్యులతో డ్యాన్స్ చేయిస్తూ మరోసారి ఎమోషనల్ అయ్యాడు లోబో. ఇక స్టేజ్ మీదకు వచ్చిన లోబో.. ఇంటి సభ్యులు అందరికి థమ్స్ సింబల్ ఇస్తూ అందరి గురించి పాజిటివ్ గా మాట్లాడాడు. ఆ తర్వాత తన లైఫ్ హిస్టరీ చెబుతూ… కన్నీళ్లు పెట్టుకున్నాడు.. ఎలిమినేషన్ అయిన లోబోకు చివర్లో లక్కీ ఛాన్స్ ఇచ్చాడు నాగార్జున. లోబోను వెనక్కి పిలిచి.. బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ చేసే అధికారం ఎవరికీ లేదని.. కేవలం ఆడియన్స్ కు మాత్రమే ఉందని.. ఆడియన్స్ నిన్ను ఎలిమినేట్ చేయలేదని.. నిన్ను సేవ్ చేశారని చెప్పుకొచ్చాడు.. దీంతో స్జేజ్ పై కుప్పకూలిపోయి బోరు బోరున ఏడ్చాడు. తనను సీక్రెట్ రూంల ఉండాలని.. అక్కడే ఉండి అందరిని అబ్జర్వ్ చేయి అని చెప్పాడు.. దీంతో ముందుగా అనుకున్నట్లుగానే లోబోను ఎలిమినేట్ చేసినట్టే చేసి సిక్రేట్ రూంకు పంపించాడు.

Also Read: Bigg Boss 5 Telugu: మరోసారి అడ్డంగా దొరికిపోయిన రవి.. నిజంగానే గుంటనక్క అనేసిన నాగార్జున..

Manchu Vishnu: కొత్త టీమ్ వచ్చేసింది.. కానీ వారి పరిస్థితి ఏంటి.. ‘మా’ లో వీడని సస్పెన్స్