బుల్లితెరపై బిగ్‌బాస్ రియాల్టీ షోకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హిందీ, తెలుగు, కన్నడ, తమిళ్ ఇలా భాషతో సంబంధం లేకుండా.. బిగ్‌బాస్ షోను ఆదరించే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అయితే ఇంత పాపులారిటీ ఉన్న షోలోకి వెళ్లే కంటెస్టెంట్స్ విషయంలో కొన్ని సందర్భాల్లో మంచి జరగోచ్చు.. మరికొన్ని సందర్భాల్లో పాపులారిటీ తగ్గిపోవచ్చు. బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ మీద ట్రోలింగ్ జరగడం.. వారి గురించి నెగిటివ్‌గా కామెంట్స్ చేయడం జరుగుంతుంది.
ముందుగు ఎక్కువగా ఫేమస్ అయిన వారు ఈ షో ద్వారా పూర్తి నెగిటివ్‌ను సంపాదించుకోవచ్చు.. అసలు పాపులారిటీ లేనివారు ఫేమస్ అవ్వచ్చు.. ఇదంతా బిగ్‌బాస్ ఎడిటర్స్ చేతుల్లోనే ఉంటుంది. అయితే బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ విషయంలో కొన్నిసార్లు.. వారి కుటుంబసభ్యులను కూడా దారుణంగా ట్రోల్ చేస్తుంటారు. ఇప్పటికే గత సీజన్స్ కంటెస్టెంట్స్ పై ట్రోల్స్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి ఐదో సీజన్ లో తనపై జరిగిన ట్రోలింగ్, తన కుటుంబసభ్యుల గురించి నెగిటివ్ కామెంట్స్ చేసినవారిపై యాంకర్ రవి యుద్ధాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.
తనపై .. తన కుటుంబసభ్యుల పై నెగిటివ్ కామెంట్స్ చేసిన వారిపై ఇప్పటికే సైబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు యాంకర్ రవి. ఎవరిపైనా సరే ఇలా నెగిటివ్ కామెంట్స్ చేస్తూ.. ట్రోల్స్ చేసేవారిని వదిలిపెట్టకూడదని.. మరోసారి ఇలాంటి కామెంట్స్ చేయకూడదనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు యాంకర్ రవి. అయితే యంకర్ రవి తీసుకున్న నిర్ణయం పై ఇప్పటికే పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఆనీ మాస్టర్ సైతం యాంకర్ రవికి మద్దతు తెలిపింది. మంచి పని చేశావ్ బ్రో అంటూ ప్రశంసలు కురిపించింది. నేను ఎంత జెన్యూన్ గా ఉంటానో నీకు తెలుసు స్టార్ మా.. ఇక చేసిందంతా చాలు.. ఎవరైనా సరే ద్వేషపూరితమైన ప్రసంగాలు, బ్యాడ్ కామెంట్స్ చేస్తే నేను కూడా రిపోర్ట్ చేస్తాను. బిగ్‌బాస్ ఇంట్లో 24 గంటలు ఏం జరుగుతుందో మీకు తెలియదు. కాబట్టి ఇదంతా ఆపేయండి అంటూ వార్నింగ్ ఇచ్చింది ఆనీ మాస్టర్..
Also Read: Pushpa Item Song: సమంత సాంగ్ ఇష్యూపై మాధవిలత సంచలన కామెంట్స్.. ఛ.. పరువు పోయిందంటూ..
Nani: కల్లు ఇష్టం.. వరంగల్లు ఇష్టం.. ఆమెను చూసి నటించడమే మర్చిపోయా.. నాని ఆసక్తికర కామెంట్స్..