Bigg Boss 5 Telugu: సన్నీపై నాగార్జున ఫైర్.. సిరి, షణ్ముఖ్‏లకు మెచ్చుకోలు..

|

Nov 14, 2021 | 8:10 AM

బిగ్‎బాస్.. కెప్టెన్సీ పోటీదారుల టాస్కులో షణ్ముఖ్, సిరి, సన్నీకి జరిగిన గొడవతో హౌస్ మొత్తం హీటెక్కింది. కోపంలో సన్నీ మాటలు జరగా.

Bigg Boss 5 Telugu: సన్నీపై నాగార్జున ఫైర్.. సిరి, షణ్ముఖ్‏లకు మెచ్చుకోలు..
Bigg Boss
Follow us on

బిగ్‎బాస్.. కెప్టెన్సీ పోటీదారుల టాస్కులో షణ్ముఖ్, సిరి, సన్నీకి జరిగిన గొడవతో హౌస్ మొత్తం హీటెక్కింది. కోపంలో సన్నీ మాటలు జరగా.. దొరికిందే ఛాన్స్ అన్నట్టుగా సిరి, షణ్ముఖ్ మరింత రెచ్చిపోయారు. దీంతో ఇంట్లో చిన్నపాటి యుద్ధ వాతావరణాన్ని సృష్టించారు. అయితే ఈ మొత్తం రచ్చకు నాగార్జున వచ్చి ముగింపు పలికారు. శనివారం నాటి ఎపిసోడ్‏లో భీమ్లా నాయక్ పాటతో ఎంట్రీ ఇచ్చారు నాగ్. ఇక రవి.. కెప్టెన్ కావడంతో ఆనీ మాస్టర్ కాస్త అత్యుత్సాహం ప్రదర్శించింది. ఇక షణ్ముఖ్ ఒళ్లో పడుకున్న సిరి.. అతనికి ఐలవ్వ్యూ అంటూ పలుమార్లు చెబుతూ ఏడ్చేసింది.

ఇక శుక్రవారం జరిగిన గొడవపై మానస్, సన్నీ చర్చించుకున్నారు. సిరికి కామన్‏సెన్స్ లేదని.. బ్యాడ్‏గా మాట్లాడుతుందని చెప్పుకొచ్చాడు సన్నీ. ఏ ఆడపిల్ల ఇంత గలీజ్ గా మాట్లాడం చూడలేదని మానస్ తో చెప్పుకొచ్చాడు. మరోవైపు.. షణ్ముఖ్, సిరి, రవి.. సన్నీ చేసిన రచ్చ గురించి ముచ్చట్లు పెట్టుకున్నారు. ఇక అనంతరం నాగ్ ఇంటి సభ్యులతో ఎఫ్ఐఆర్ గేమ్ ఆడించారు. మొదటగా ఆనీ మాస్టర్.. కాజల్‏ను జైల్లో పెట్టి తన తప్పులను చెప్పుకొచ్చింది. ఇక ఆ తర్వాత రవి..సన్నీని జైల్లో పెట్టి బ్యాడ్ బిహేవియర్.. సిరి, షన్నూలకు మద్దతు ఇచ్చాడు. అయితే సన్నీ మాట్లాడిన మాటలు కూడా తప్పు అనేట్టుగానే నాగార్జున సైతం బిహేవ్ చేశారు. ఇక షణ్ముఖ్, సిరి సైతం సన్నీని జైల్లో పెట్టి ఏకగ్రీవంగా అతడిని బ్యాడ్ బిహేవియర్ అంటూ చెప్పారు. దీంతో సన్నీ మెడలో గిల్టీ అనే ట్యాగ్ వేయించారు నాగార్జున. ఇక ఆ తర్వాత కేక్ తినడంలో సన్నీ చేసిన పని సరైనదే అని చెప్పిన నాగ్. చివరకు సన్నీని సేవ్ అయినట్టుగా ప్రకటించారు.

Also Read: Nisha Agarwal: నిషా అగర్వాన్‌ను ఫోన్ నంబర్ అడిగిన్ నెటిజన్.. ఆమె రియాక్షన్ ఇదే..

Liger Movie: అమెరికాలో వాలిపోయిన లైగర్‌ బాయ్స్‌… మైక్‌టైసన్‌తో సన్నివేశాల కోసమేనా.?

Metro Bigg Boss: మెట్రో ప్రయాణికులకు అవగాహన కల్పించేందుకు రంగంలోకి దిగిన బిగ్‌బాస్‌.. 54 స్టేషన్లలో..